AP Govt to cut ration card and pension ఆ మూడింటికి ముడిపెట్టనున్న ఏపీ సర్కార్

Ap govt to cut ration card and pension if the power consumption exceeds 200 units

Amaravati, Amaravati news, Amaravati latest news, Ration cards, Pension beneficiaries, power consumption, village volunteers, AP Government, Power Consumption, Pension, Ration Cards, Andhra Pradesh, YS Jagan, CM, andhra pradesh, Politics

AP people have a reason to be shocked by the new rules on pension and ration cards. Pensioners and ration card users are no longer asleep as they link current bills to eliminate pension and ration cards and issue new ones.

రేషన్, పెన్షన్ కావాలా.? కరెంటుతో ముడిపెట్టిన ఏపీ సర్కార్

Posted: 12/23/2019 04:51 PM IST
Ap govt to cut ration card and pension if the power consumption exceeds 200 units

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేసేందుకు మాత్రం కొర్రీలు పెడుతున్నారా.? అంటే ఔనన తప్పదు. ఎన్నికలకు ముందు ప్రకటించిన నవరత్నాలతో ప్రజలు ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టడంతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఒకొక్కటిగా పథాకాలను ప్రవేశపెడుతూ వస్తోంది. ఈ క్రమంలో అధికశాతం మందితో ముడిపడిన పథకాలు రేషన్ కార్డులు, పింఛన్ల అన్న విషయం అందరికీ తెలిసిందే.

దీంతో ఈ రెండు పథకాలకు విద్యుత్ వినియోగంతో ముడిపెట్టిన వైసీపీ ప్రభుత్వం.. ఇక్కడే అసలు కొర్రీలు పెట్టింది. విద్యుత్ వినియోగం అధికంగా వుంటే సబ్సీడీలపై లభించే రేషన్ కానీ.. లేక ఫించన్లు కానీ ఇవ్వలేమని స్పష్టం చేస్తోంది. తాజాగా నియమితులైన గ్రామ వాలెంటీర్లు.. ఈ వివరాలను సేకరించి.. వాటిపై దృష్టిపెట్టనున్నారని కూడా సమాచారం. అంతేకాదు నాలుగు చక్రాల వాహనాలు (టాక్సీలు మినహాయించి) వున్న ఏ ఒక్కరికి కూడా ఆహార భద్రత కింద రేషన్ లభించదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఇక రేషన్ పోందాలంటే ఎంత విద్యుత్ ను వినియోగించాలి.. ఫించను రావాలంటే ఎంత విద్యుత్ ను వినియోగించాలన్న వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకు రెండు వందల యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం చేసే ఏ ఒక్కరికి కూడా నిత్యావసర సరుకులు రేషన్ దుకాణాల్లో సబ్సీడి ధరలపై లభించవని ముడిపెట్టింది. అలాగే నెలకు మూడు వందల యూనిట్ల కన్నా అధికంగా విద్యుత్ వినియోగం చేసేవారికి ఫించను కూడా లభించదని తాజాగా వెల్లడించింది. ఈ క్రమంలో ఇల్లు అద్దెకిచ్చే స్తోమత ఉన్నవారు ఫించన్లకు ఎలా అర్హులని కూడా విద్యుత్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఇక ఉచిత విద్యుత్ పథకంలోనూ కొర్రీలు పెట్టిన విద్యుత్ అధికారులు.. ఇకపై సొంత ఇళ్లలో నివాసముండే వారికి కూడా ఈ వెసలుబాటును వర్తింపజేయమని చెబుతున్నారు. ఇదిలావుంటే.. ఇన్నాళ్ల పాటు భర్త ఆధార్, భార్య అధార్ కార్డులు వేర్వేరుగా వున్నా ఇకపై భార్యభర్తల అధార్ ను కలసి ఒక యూనిట్ గా పరిగణలోకి తీసుకోనున్నారు. ఇకపై ఇల్లు, వాణిజ్య, వాప్యార, పారిశ్రామిక, ఇత్యాది ఏ సేవా రంగంలోనైనా భార్యభర్తల యూనిట్ నే పరిగణలోకి తీసుకోనున్నారు.

రాష్ట్రంలో నిజమైన అర్హులకు పథకాలు పూర్తిస్థాయిలో అందాలంటే.. ఈ నిబంధనలను వర్తింపజేయాలని కూడా ప్రభుత్వం కృతనిశ్చయంతో వుంది. ఈ మేరకు నూతన సవరణలు అమల్లోకి తీసుకోవాలని కూడా యోచిస్తోంది. అయితే తాజా సవరణలపై ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతకాలు కూడా చేశారని సమాచారం. దీంతో ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టి.. వాటిని అందుకోనీయకుండా కొర్రీలు పెడుతొందని ఇన్నాళ్లు నిబంధనలను ఉల్లఘించిన పథకాల లబ్దిని పోంది.. తాజా అదేశాలతో లబ్దికి దూరమవుతున్న పలువరు అరోపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles