rajagopal reddy to join ruling trs party.? టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.?

Komati reddy rajagopal reddy to join ruling trs party

Komati Reddy RajaGopal Reddy, RajaGopal Reddy to join BJP, RajaGopal Reddy to join TRS, Harish Rao, Congress MLA RajaGopal Reddy, Komati reddy RajaGopal Reddy to join TRS, Komati Reddy RajaGopal Reddy, Congress MLA, BJP, TRS, UTurn, Telangana, Politics

Congress MLA komati reddy rajagopal reddy, who had made his way to join central ruling party BJP, had taken an U turn and now he is knocking the doors of state ruling pary TRS.

టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.?

Posted: 09/17/2019 04:15 PM IST
Komati reddy rajagopal reddy to join ruling trs party

తనకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని.. కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానంపై పలు విమర్శలకు పాల్పడి.. కేంద్రంలోని అధికార బీజేపి పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న ఆయన.. అక్కడ ఎందుకు బెడిసికొట్టిందో మాత్రం చెప్పలేదు. ఇలోగా తాను అర్జునుడినని యూటార్న్ తీసుకున్న రాజగోపాల్ రెడ్డి తాజాగా రాష్ట్రంలోని అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి చేరాలని భావిస్తున్నారా.? అంటే ఔనన్న సంకేతాలే వినబడుతున్నాయి.

ఎందుకంటే ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా శాసనసభలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ లాబీలో హరీశ్‌తో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే వారి మధ్య ఏం చర్చలు జరిగివుంటాయన్న ప్రశ్నలు ఆసక్తిరేకెత్తిస్తున్నాయి.

వారిరువురి మధ్య తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ మార్పుపై వంటి అంశాలపై చర్చ జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటానని ఒకసారి ఉండలేనని మరోసారి చెప్తూ నానా హంగామా చేస్తున్నారు. బీజేపీలో చేరడం ఖాయంగా మారిందనుకున్న సమయంలో మళ్లీ యూటర్న్ తీసుకున్న.. కాంగ్రెస్ లోనే కొనసాగుతానన్నారు. అనంతరం అనేక మార్లు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు కూడా చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
 
అయితే తాజాగా టీఆర్ఎస్ కీలకనేత, మంత్రి హరీశ్‌తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి కారెక్కుతారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.  ఇంతకీ కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా లేక బీజేపీలో చేరతారా....? బీజేపీలో చేరే వ్యూహం బెడిసి కొట్టడంతో టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారా ....? ఇవే ప్రశ్నలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Komati Reddy RajaGopal Reddy  Congress MLA  BJP  TRS  UTurn  Telangana  Politics  

Other Articles

 • Andhra pradesh cs neelam sahni to go on long leave

  లాంగ్ లీవ్ పై వెళ్లనున్నా ఏపీ సీఎస్ నీలం సహాని.?

  Feb 03 | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్ని దీర్ఘకాలిక సెలవులో వెళ్లనున్నారా.? రాష్ట్రంలోని జగన్ సర్కార్ వైఖరితో కలత చెందిన ఆమె లాంగ్ లీవ్ పెట్టేందుకు సన్నధమయ్యారా.? రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చిన వైఎస్సార్... Read more

 • Modi govt has a new headache social media campaigns by unhappy ias railways officers

  సోషల్ మీడియాను అస్త్రంగా మలుచుకున్న కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు

  Jan 23 | కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల, విధి నిర్వహణలో తాము ఎదుర్కోంటున్న సమస్యల పట్ల అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు తాజాగా అందుబాటులోకి వచ్చిన మాద్యమాన్నే తమ కొత్త అస్త్రంగా మలుచుకుంటున్నారు. అదే సామాజిక మాద్యమం. దీని... Read more

 • Tdp to take action against director ramgopal varma for comments on balayya

  ఆర్జీవిపై చర్యలకు టీడీపీ సన్నధం అవుతుందా.?

  Jan 23 | వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తెలుగుదేశం పార్టీ చర్యలకు పూనుకోనుందా.? అంటే ఔనన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. శాసనమండలిలో వున్న టీడీపీ సభ్యుడి పట్ల అవమానకర రీతిలో.. హద్దుమీరి మరీ ఘాటుగా వ్యాఖ్యానించిన రాంగోపాల్... Read more

 • Ap govt to cut ration card and pension if the power consumption exceeds 200 units

  రేషన్, పెన్షన్ కావాలా.? కరెంటుతో ముడిపెట్టిన ఏపీ సర్కార్

  Dec 23 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేసేందుకు మాత్రం కొర్రీలు పెడుతున్నారా.? అంటే ఔనన తప్పదు.... Read more

 • Does pm back door comments reiterates bjp in goa

  ఇవాళ కర్ణాటక, రేపు మహారాష్ట్ర.. మరీ గోవా..?

  Dec 09 | కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలతో దేశంలోని జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల ప్రభావంపై చూపనుందా.? అంటే ఔననే చెప్పాలి. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ప్రజలు సుస్తిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని.. అందుకు ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని... Read more

Today on Telugu Wishesh