janasena party to shake hands with BJP.? బీజేపీతో చేతులు కలపనున్న పవన్ కల్యాణ్?

Will pawan kalyan janasena party shake hands with bjp

Pawan Kalyan, Janasena, Shake handsm BJP, Union Government, YSRCP, CM Jagan, Chandrababu, Nara Lokesh, TDP. Amit Shah, Kanna Laxmi Narayana, BJP, Andhra Pradesh, Politics

There are rumours doing rounds in Andhra Pradesh political circles that Pawan Kalyan's Jana Sena Party will shake hand with BJP in the state and fight against YS Jagan Government in the state.

బీజేపీతో చేతులు కలపనున్న పవన్ కల్యాణ్?

Posted: 08/01/2019 07:24 PM IST
Will pawan kalyan janasena party shake hands with bjp

రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోని.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీని విజయతీరాల వైపు నడిపించేందుకు అవసరమైన కార్యచరణతో పాటు జిల్లాల వారీగా పార్టీ ముఖ్యనేతలతో కలసి వరుస సమావేశాలను నిర్వహిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. పార్టీని బలెపేతం చేయడంతో పాటు కేంద్రంలో అధికారంలో వున్న పార్టీతో జతకడితే.. సాధ్యమైనంత త్వరగా ప్రజల్లోకి చోచ్చుకెళ్లవచ్చని పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై గత రెండు రోజులుగా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్న పవన్.. బీజేపీతో కలిసి వెళ్లడంపై చర్చించినట్టు తెలుస్తోంది. కీలక నేతల వద్ద ఆయనీ విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. రాష్ట్రంలో జగన్‌ ని ఢీకొట్టేందుకు బీజేపీతో చేతులు కలపడం తప్ప మరో మార్గం లేదని జనసేన నేతలు కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను ఇటీవల నర్సాపురం పర్యటనలో జనసేన కీలకనేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు మాత్రం తోసిపుచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆయన స్వష్టంచేశారు.

ఇదిలావుంటే.. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని తానా సభల్లో పవన్ ను కలిసిన బీజేపీ నేత రాంమాధవ్ కోరినట్టు సమాచారం. అయితే అలా విలీనం చేసి తన సోదరుడు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వుండాల్సివచ్చిందని భావించిన పవన్.. బీజేపీతో జతకట్టి అడుగులు వేసేందుకే మొగ్గుచూపుతున్నారని, అంతేకానీ విలీనానికి మాత్రం అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని  కొందరు నేతలు పవన్ కు సలహా ఇచ్చినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  Shake handsm BJP  Union Government  Andhra Pradesh  Politics  

Other Articles

Today on Telugu Wishesh