undavalli arun kumar to join YSRCP వైసీపీలోకి ఉండవల్లి.. మంత్రిపదవి కన్ఫార్మ్..?

Undavalli arun kumar assured of cabinet birth in ysrcp

undavalli arun kumar, YSRCP, YS Jagan, Cabinet berth, YSRCP president YS Jagan, YS Jagan offer to Undavalli Arun Kumar, YS Jagan offer to Undavalli, YS Jagan people's government, YS Jagan, YSRCP, arun kumar, cabinet, visakhapatnam, ys jaganmohan reddy, ys rajasekhara reddy, andhra pradesh, politics

Former MP Undavalli Arun Kumar may join the YSR Congress Party and even to be inducted into the Cabinet if the party comes to the power.

వైసీపీలోకి ఉండవల్లి.. మంత్రిపదవి కన్ఫార్మ్..?

Posted: 05/07/2019 04:32 PM IST
Undavalli arun kumar assured of cabinet birth in ysrcp

ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో? అన్న విషయం ఎవరికి అంతుపట్టడం లేదు. ఈ నెల 23 వరకు ఈ ఉత్కంఠ సర్వత్రా నెలకొంటున్నప్పటికీ.. అధికార పగ్గాలను ఎవరు చేపడతారన్న విషయంలో మాత్రం సస్పెన్స్ అదే రోజున వీడనుంది. వైసీపీ అధినేతకు అవకాశాలు ఎక్కువగా వున్నాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ‌కూడా వైసీపీలోకి చేరిపోతున్నారా ? అన్న ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

జగన్ ఉండవల్లిని వైసీపీలోకి రావాలని ఆహ్వానించారా? అంటే.. అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఎందుకంటే ఉండవల్లి అరుణ కుమార్ రాజకీయాల్లో తలపండిన నేత. అన్ని విషయాలపై స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడు. అవగాహన లేకున్నా ఆ అంశాలపై అధ్యయనం చేసి మరీ పూర్తి సమాచారంతో చర్చించే నేత. ఇక దీనితో పాటు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎంతో ఆప్తుడు. ఎలాంటి విషయమైనా ముక్కు సూటిగా మొహమోటం లేకుండా చెప్పేస్తారు ఉండవల్లి. అనేక రాజకీయ విశ్లేషణలు కూడా చేస్తుంటారు. ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడంలో ఆయనను మించిన వారు ఉండరు.

రాష్ట్ర విభజనతో రాజకీయాలకు దూరంగా వున్న ఉండవల్లి మళ్లీ క్రియాశీలక రాజకీయాలలోకి అడుగుపెడుతున్నారా.? ఆయన అనుభవాలను, అవగాహనను వినియోగించుకుని ముందుకు సాగేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారా.? అంటే ఔనన్న సంకేతాలే వినిపిస్తున్నాయి. ఆ మధ్య జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ విభజన హామీలపై చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉండవల్లి కూడా ఉన్నారు. అప్పట్లో ప్రెస్ మీట్‌లు హడావుడి చేసిన ఆయన మళ్లీ గప్ చుప్ అయిపోయారు. దీంతో పవన్ కు ఉండవల్లి చేరువైతే.. అది తమ పార్టీకి నష్టమని భావించిన వైసీపీ.. ఆయనను మంత్రిపదవి హామీని ఇచ్చి మౌనంగా వుంచిందని కూడా రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

జగన్ పట్ల ఆయన పార్టీ పట్ల పెద్ద సానుకూలత చూపించకపోయినా.. వ్యతిరేకతను కూడా ఎన్నడూ ప్రదర్శించని ఉండవల్లిని వైసీపీ తమ అకర్ష్ పథకంలో అకట్టుకుందని సమాచారం. ఉండవల్లి లాంటి సీనియర్ నేతలు ఉంటే పార్టీకి కూడా ఎంతో మేలు జరుగుతుందని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే తమ పార్టీ అధికారంలోకి వస్తే తన మంత్రివర్గంలో చేరాలని జగన్ ఉండవల్లిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. జగన్ ఆహ్వానానికి అటు ఉండవల్లి కూడా సూత్రప్రాయంగా ఓకే అన్నట్లు సమాచారం. అంతేకాదు.. ప్రతిపక్ష పార్టీలను ఆయనే ధీటుగా ఎదుర్కోంటారని కూడా భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Komati reddy rajagopal reddy to join ruling trs party

  టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.?

  Sep 17 | తనకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని.. కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానంపై పలు విమర్శలకు పాల్పడి.. కేంద్రంలోని అధికార బీజేపి పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న ఆయన.. అక్కడ ఎందుకు బెడిసికొట్టిందో మాత్రం... Read more

 • Vangaveeti radha krishna to get key party post in janasena

  వంగవీటి రాధాకు జనసేనలో కీలక పదవి.?

  Sep 06 | ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వంగవీటి రాధా... తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. వైసీపీలో ఎదుర్కోన్న పరాభవం గుర్తుంచుకున్న నేత ముందుగానే తనకు లభించే పార్టీ... Read more

 • Telangana tdp senior leader t devender goud likely to leave party

  తెలంగాణ టీడీపీకి మరో షాక్.. సీనియర్ నేత గుడ్ బై.?

  Aug 17 | తెలంగాణ టీడీపీకి మరో భారీ షాక్ తగలనుందా.? చంద్రబాబు తొలి పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తరువాత మంత్రిగా బాద్యతలను చేపట్టి క్రీయాశీలక వ్యవహారాలను చక్కెబెట్టిన నాయకుడు త్వరలో చంద్రబాబుకు గుడ్ బై చెప్పనున్నారున్న... Read more

 • Will pawan kalyan janasena party shake hands with bjp

  బీజేపీతో చేతులు కలపనున్న పవన్ కల్యాణ్?

  Aug 01 | రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోని.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీని విజయతీరాల వైపు నడిపించేందుకు అవసరమైన కార్యచరణతో పాటు జిల్లాల వారీగా పార్టీ ముఖ్యనేతలతో కలసి వరుస సమావేశాలను... Read more

 • Vijayawada tdp leader bonda uma to bid goodbye to chandrababu

  టీడీపీకి గుడ్ బై చెప్పనున్న బొండా ఉమ.?

  Aug 01 | ఐధేళ్ల పాటు అధికారంలో వున్న నేతలు ప్రతిపక్షంలోకి వచ్చినా.. లేక ఓటమిని చవిచూసినా.. అప్పటి వరకు తాము చేపట్టిన అధికార, అనధికార పనులను సక్రమంగా పూర్తి చేసుకోవాలంటే గోపీలుగా మారాల్సిందే. ఇది రాజకీయ నాయకులకు... Read more

Today on Telugu Wishesh