Villagers demand encounter of psycho killer, CM KCR Sir.. కన్ను పీకేస్తానన్న కేసీఆర్ సారూ.. కానొచ్చిండా.?

Villagers demand encounter of psycho rapist killer srinivas reddy cm kcr sir

Yadadri murder case, srinivas reddy house set afire, Kalpana rape, kalpana missing, kalpana dead body, kalpana skelton, manisha murder, manisha dead body, manisha skeleton, sravani murder, sravani dead body, sravani rape and murder, srinivas reddy, bike mechanic, hazipur, bommalaramaram, yadadri district, crime

In a shocking development, the Rachakonda Police found that psycho rapist killer, srinivas reddy is the one behind all the three girls who went missing in Hazipur, demand the encounter of psycho.

కన్ను పీకేస్తానన్న కేసీఆర్ సారూ.. కానొచ్చిండా.?

Posted: 05/01/2019 06:15 PM IST
Villagers demand encounter of psycho rapist killer srinivas reddy cm kcr sir

తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన యాద్రాది భువనగిరి జిల్లా హాజీపూర్ లో మర్డర్ మిస్టరీల కేసు దర్యాప్తులో హంతకుడు శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ లో అంతం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో తమ పల్లెలోని ప్రతీ ఆడపడచు ఓ రుద్రమదేవిలా అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా పోలాలకు వెళ్లి వచ్చేవారని.. అలాంటి హాజీపూర్ గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లోనూ ఆడపడచులను భాయాందోళనకు గురిచేసిన సైకో శ్రీనివాస్ రెడ్డి అని.. సదరు నిందితుడిని అంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బొమ్మలరామారం మండలవాసులు.

బొమ్మలరామారాంలోని హాజీపూర్ పరిసర గ్రామాల అడపిల్లలను కన్న తల్లిదండ్రులకు కంటిమీద కునుకును కరువయ్యేలా చేసిన శ్రీనివాస్ రెడ్డి.. బతికి వున్నంతవరకు తమ ఆడపిల్లలు భయాందోళనకు గురవుతారని.. ప్రభుత్వం, పోలీసులు ఎంత భరోసా ఇచ్చినా.. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి మరణమే వారికి పెద్ద భరోసా అంటూ గ్రామస్థులు తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఆడపిల్లలపై కన్నెత్తి చూస్తే కన్నుపికేస్తానంటూ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంగా కేసీఆర్ చెప్పిన విషయాన్ని కూడా వీరు గుర్తు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సార్.. మీరు కన్నెత్తి చూస్తేనే కన్ను పీకేస్తాననన్నారు. మరీ హాజీపూర్ గ్రామంలో అమాయక పిల్లలను తీసుకెళ్లి అఘాయిత్యానికి తెగబడి వారిని బావుల్లో పూడ్చిపెట్టి.. ఏమీ ఎరగనట్టు తీరుగుతున్న శ్రీనివాస్ రెడ్డిని తక్షణం ఎన్ కౌంటర్ చేయండీ సారూ అంటూ హాజీపూర్ గ్రామాస్థులు, మృతుల బంధువులు కోరుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోని పక్షంలో గ్రామప్రజల్లో మరీ ముఖ్యంగా ఆడపడచులు మానసిక స్థైర్యం కోల్పోతారాని, ఎవరు ఎటునుంచి వచ్చి వారిపై దాడి చేస్తారో అనే భయాందోళనకు గురవుతారని గ్రామస్థులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

సైకో రేపిస్టు కిల్లర్ శ్రీనివాస్ రెడ్డే శ్రావణిపై అత్యాచారం, హత్య చేసిన నేపథ్యంలో అరెస్టు చేసిన పోలీసులు తమదైన శైలిలో నిందితుడ్ని విచారించగా, ఆ తరువాత నెల రోజుల క్రితం అదృశ్యమైన డిగ్రీ విద్యార్థిని మనీషా శవం లభ్యమైంది. ఆ తరువాత నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన పదకొండేళ్ల కల్పన మిస్సింగ్ కేసును విచారించగా అది కూడా తానే చేశానని నిందితుడు అంగీకరించాడని స్వయంగా రాచకోండ కమీషనర్ మీడియాకు తెలిపారని.. పేర్కోంటున్నారు.

దీంతో ఒక్క సైకో ముగ్గరు అమ్మాయిల జీవితాలను బుగ్గిపాలు చేసిన కాలరాసాడని, నిందితుడ్ని అంతమెందించడంతోనే తమకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. ఈ మేరకు మీడియా ప్రతినిధులను, సీఎం సారు కానొచ్చిండా.. కానోస్తే జె్ప్పుండీ అంటూ వృద్దులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక మరికోందరు మాత్రం కవితపై చెడువార్తలు రాస్తేనే లోపలేసిన నిందితుడ్ని కటకటాల పాలుచేసిన ముఖ్యమంత్రిగారూ.. మా బిడ్డలను ఈ రాక్షసుడు అత్యాచారం చేసి మారీ చంపిండు.. వాడు బతికుంటే తమ అడబిడ్డలకు రక్షణ వుండదని కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sravani  manisha  Kalpana  srinivas reddy  bike mechanic  keesara  hazipur  bommalaramaram  yadadri district  crime  

Other Articles

Today on Telugu Wishesh