Amitji please show your courage in APSCS ఎన్ఆర్సీ ధైర్యాన్ని హోదా విషయంలోనూ చూపరూ..!

If your are really courageous give ap scs amit shah asks ap people

amit shah, rajiv gandhi, assam accord 1985, national register of citizens, assam, NRC, draft list, special category status, andhra pradesh, railway zone, kadapa steel factory, chandrababu, sujana chowdary, PM Modi, Congress, BJP, Politics

After draging former PM name, BJP president Amit Shah said, Rajiv Gandhi signed the Assam Accord in 1985, which was similar to NRC. They did not have courage to implement it, we did." The people of AP asks show the similar courage in sanctioning special status to Andhra Pradesh.

ఎన్ఆర్సీ ధైర్యాన్ని హోదా విషయంలోనూ చూపరూ..!

Posted: 08/02/2018 05:27 PM IST
If your are really courageous give ap scs amit shah asks ap people

ఎన్ఆర్సీ.. జాతీయ పౌరుల రిజిస్టర్.. ఇలాంటిది ఒకటుందని, దాదాపుగా దేశప్రజల్లోని 90శాతం మందికి తెలియనే తెలియదు. అయితే కేంద్రంలో బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ఎన్ఆర్సీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్ర ప్రజలకు ఎన్ఆర్సీ వంట్లో వణుకు పుట్టిస్తోంది. మన దేశానికి చెందిన పౌరసత్వం లభించే విషయంలో ఎన్ఆర్సీ అత్యంత క్రీయాశీలకంగా వ్యవహరిస్తుందని దేశప్రజల్లో స్పష్టత వచ్చింది. ఇది లేకపోతే దేశ పౌరసత్వమే లేదని, దేశంలో తిరిగే అవకాశం కూడా కోల్పోతామని వెల్లడైంది.

అస్పోంలో అక్రమ చోరబాటుదారులుగా వచ్చి.. దేశపౌరులుగా చలామణి అవుతూ దేశ ఫౌరసత్వంతో పాటు దేశం పేద ప్రజానికానికి కల్పిస్తున్న అన్ని రాయితీలను కూడా అక్రమంగా పోందుతున్న అక్రమ వలసదారులను గుర్తించడం ఎంతో కఠినమైన, కష్టమైన కార్యమే. ఓ వైపు విపక్షాలు తమ వ్యతిరేకతను చాటుతున్నా పట్టించుకోని ప్రభుత్వం ఎన్ఆర్సీ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పింది. ఈ నేపథ్యంలో 1985లో అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ అస్సోం అకోడ్ అంటూ ఓ విధానాన్ని తీసుకువచ్చారని, అది కూడా రమారమి ఎన్ఆర్సీ మాదిరిగానే వుందని బీజేపి జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అమిత్ షా పార్లమెంటులో విపక్షాల నిరసనల మధ్య తెలిపారు.

అయితే కాంగ్రెస్ ఈ రకమైన విధానాన్ని రూపోందించింది కానీ దానిని అమలు చేసే ధైర్యం మాత్రం లేకపోయిందని.. అయితే తమ ప్రభుత్వానికి దమ్మూ, ధైర్యం రెండు పుష్కలంగా వున్నాయని.. అందుచేతే తాము ఎన్ఆర్సీ విధానాన్ని అమలుపరుస్తున్నామని చెప్పారు. ఇంతవరకు బాగానే వున్నా.. ఆయన ధైర్యం విషయమై మాత్రం ఇప్పుడు టీడీపీ సహా ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కొంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయ్యా అమిత్ షా గారూ.. పార్లమెంటు సాక్షిగా మీరు ధైర్యవంతులని చెప్పిన మాటలను తాము నిజమని నమ్మాలంటే.. ఈ ఒక్కటీ కూడా చేయరూ అంటూ ఆంధ్రప్రదేశ్ వాసులు కొరుతున్నారు.

ఎన్నికల హామీలో లేని అంశానికి.. అందులోనూ కేవలం 40 లక్షల మందికి మాత్రమే పరిమితమైన అంశానికి మీరు అంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే.. ఇక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి, అందులోనూ ఆరు కోట్ల అంధ్రులకు సంబంధించిన అంశానికి మరెంత ప్రాధాన్యత ఇస్తారోనని ఆంధ్రప్రదేశ్ వాసులు ఆయన ముందు రాష్ట్ర విభజన హామీల అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి స్పెషల్ రైల్వే జోను, ఇత్యాది సమస్యలను ఏకరువు పెడుతున్నారు. అమిత్ షా జీ.. వీటిపై కూడా మీ దమ్మూ.. ధైర్యాన్ని చూపండీ.. అంటూ అంగలార్చుతున్నారు.

ఇక ఎన్డీయే ప్రభుత్వంలోని పలు పార్టీలు కూడా ఈ విషయంలో మింగలేక.. కక్కలేక తమ నిర్ణయాన్ని చెప్పలేని సంకట పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కేంద్రం తీసుకువచ్చిన ఎన్ఆర్సీ విధానాన్ని మాత్రం రాష్ట్రంతో పాటు దేశంలోని పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా అందోళనలు, నిరసనలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇదే అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మాత్రం ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించే అవకాశమే లేదని కూడా అంధ్ర్రప్రదేశ్ వాసులు బల్లగుద్ది చెబుతున్నారు. అన్ని పార్టీలు బీజేపి హోదా నిర్ణయాన్ని స్వాగతిస్తాయని స్పష్టం చేస్తున్నారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1985లో తీసుకువచ్చిన అకోడ్ లో వున్న విషయాన్ని తెలుసుకుని.. వారు అమలు చేయని అదే విధానాన్ని మీరు మీ సొంత ధైర్యంతో చేస్తున్నారంటే ప్రశంసనీయమని కొనియాడుతున్న ఏపీ రాష్ట్రవాసులు.. ప్రధాని నరేంద్రమోడీకి పూర్వపు ప్రధాని మన్మోహన్ సింగ్.. ఎన్డీఏకు పదవీ బాధ్యతలను అందించిన యూపీఏ ప్రభుత్వం సరిగ్గా ఎన్నికలకు వెళ్లనున్న ముందు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక రాష్ట్ర హోదా సహా విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని.. అందుకు అమిత్ షా ధైర్యంగా వ్యవహరించాలని ఏపీ వాసులు కోరుతున్నారు. మరీ ఈ విషయంలో అమిత్ షా ఎలా వ్యవహరిస్తారో.. అసలు పట్టించుకుంటారో లేదో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amit shah  rajiv gandhi  assam  NRC  andhra pradesh  special category status  chandrababu  Politics  

Other Articles