Motkupalli to join janasena? జనసేనలోకి మోత్కుపల్లి.. తెలంగాణ శాఖ బాధ్యతలు..?

Motkupalli to be telangana party chief for janasena

pawan kalyan, janasena, motkupally narasimhulu, telangana jana sena, TJSP president, TTDP, pawan kalyan on kapu reservation, porata yatra, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, Pawan Kalyan uttatandhra yatra, Pawan Kalyan gangapooja, andhra pradesh, politics

Motkupalli narasimhulu who resigned to TDP recently is all set to meet Pawan Kalyan shortly. There have been rumours that Motkupalli will be offered Janasena party chief position in Telangana.

జనసేనలోకి మోత్కుపల్లి.. తెలంగాణ శాఖ బాధ్యతలు..?

Posted: 08/02/2018 06:08 PM IST
Motkupalli to be telangana party chief for janasena

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలకంగా నిన్నమొన్నటి వరకూ వ్యవహరించిన సీనియర్ పొలిటీషియన్ మోత్కుపల్లి నర్సింహులు.. తనకు పార్టీలో జరుగుతున్న అవమానంతో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. తన రాజకీయ జీవితాన్ని అందించిన అన్నగారికి.. వెన్నుపోటు పోడిచిన చంద్రబాబు.. తన రాజకీయ జీవితాన్ని కూడా పూర్తిగా నాశనం చశాడని కూడా అరోపించారు.

అంతేకాదు అన్నగారు ఎన్టీ రామారావుకు అన్యాయం చేయడంతోనే తనకు ఈ పరిస్థితి వచ్చిందని పశ్చాతాప ధోరణితో చెప్పిన మోత్కుపల్లి.. ఇక చంద్రబాబు నాయుడిని, ఆయన పార్టీని ఓడించేందుకు తాను ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వాడవాడలా తిరుగుతూ.. తమ దళితజాతిని మేల్కోలుపుతానని అన్నారు. జగన్, పవన్ లపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు.. వారు సొంతంగా పార్టీలను స్థాపించి ప్రజాసేవ కోసం వస్తున్నారని, అంతేకాని వెన్నుపోటు రాజకీయాలతో వచ్చి అందలం ఎక్కాలని కుతంత్రాలు పన్నడం లేదని కూడా విమర్శించారు.

ఇదంతా తెలిసిందేగా అంటున్నారా.. ఇక తాజగా లభిస్తున్న సమాచారం మేరకు మోత్కుపల్లి నర్సింహులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసిన తరువాత మోత్కుపల్లి తన అనుచరగణంతో జనసేన తీర్థం తీసుకోనున్నారని తెలుస్తుంది. అయితే ఎప్పుడు ఆయన పవన్ కల్యాణ్ ను కలుస్తారన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత వెలువడలేదు. అయితే మోత్కుపల్లి లాంటి సీనియర్ నేతను కేవలం అలేరుకో లేక నల్గోండకో పరిమితం చేయకుండా తెలంగాణ కు పూర్తిగా పరిమితం చేయాలని జనసేన యోచిస్తుందని సమాచారం.

ఈ క్రమంలో మోత్కుపల్లి నర్సింహులుకు జనసేన తెలంగాణ రాష్ట్ర పగ్గాలను అందిస్తే ఎలా వుంటుందన్న అలోచనలో పవన్ కల్యాణ్ వున్నారని, అయితే దీనిపై ఆయన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కమిటీ నిర్ణయం తీసుకున్న తరువాత.. ఆ దిశగా పవన్ కల్యాణ్ కూడా అడుగులు వేస్తారని తెలుస్తుంది. కమిటీ నిర్ణయించిన పక్షంలో మోత్కుపల్లికి జనసేన పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా నియమించనున్నారనే ప్రచారం జరుగుతోంది.

అయితే మోత్కుపల్లి తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్ తో సన్నిహితంగా వున్న నేపథ్యంలో ఆ పార్టీలో చేరుతారని కూడా కొంతకాలం క్రితం వార్తలు వినిపించాయి. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు ఆయన టీఆర్ఎస్ కండువాను కప్పుకుంటారన్న వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్య వహిస్తున్న అలేరు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించిన నేపథ్యంలో తనకు అవకాశం రాకపోవచ్చని భావించిన మోత్కుపల్లి జనసేనలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారని సమాచారం. ఇక పవన్ లాంటి స్వచ్ఛత, పారదర్శక రాజకీయాలలో తాను వుండాలని భావిస్తు్న ఎందరో దళిత యువతీ, యువకులకు మోత్కుపల్లి చేరికతో ఎంతో ప్రోత్సాహం, ప్రోద్భలం లభిస్తుందని కూడా సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  motkupally narasimhulu  telangana jana sena  TJSP president  TTDP  politics  

Other Articles