Big Shock to YSRCP in Vijayawada | విజయవాడలో పెను కలకలం.. టీడీపీలో చేరనున్న వంగవీటి రాధా?

Vangaveeti radha will join tdp

Vangaveeti Radha, YSR Congress Party, Vijayawada, Telugu Desam Party, Vangaveeti Radha TDP

Vangaveeti Radha ready to quit YSR Congress Party. He to likely to join TDP very soon. Not officially confirmed yet but, Radha unhappy with Yalamanchili Ravi will join TDP and also Malladi Vishnu domination in Party.

టీడీపీలో చేరనున్న వంగవీటి రాధా?

Posted: 01/17/2018 11:20 AM IST
Vangaveeti radha will join tdp

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించనున్నారనే వార్త ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఆయనతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారన్న విషయం ఈ ఉదయం వార్తల్లోకి ఎక్కగా, ఇప్పుడు ఎక్కడ చూసినా వంగవీటి రాధ పార్టీ మార్పుపైనే చర్చ జరుగుతోంది.

ఈ విషయంలో రాధా నోటి నుంచి అధికారికంగా ఏ విషయమూ బయటకు రానప్పటికీ, అటు తెలుగుదేశం వర్గాలు, ఇటు రాధ అనుచరులు పార్టీ మార్పు ఖాయమంటున్నారు. గత కొంతకాలంగా వైసీపీలో నెలకొన్న పరిణామాలు వంగవీటి రాధాకు రుచించటం లేదు. పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్నారంట. దీనికి తోడు మల్లాది విష్ణు పార్టీలో చేరటం రాధా తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఇక త్వరలో యలమంచిలి రవి కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమైపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాను పార్టీ మారటమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ ఈ విషయాన్ని తన అనుచరుల వద్ద చాలాసార్లే ప్రస్తావించారట. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఖాయం చేసిన పక్షంలో పార్టీ మారేందుకు రాధ సిద్ధంగా ఉన్నారని, ఈ విషయమై తమతో చర్చించారని ఆయన ప్రధాన అనుచరులు చెబుతున్నారు.

ఇంకోవైపు రాధతో చర్చలు పూర్తయ్యాయని కొందరు టీడీపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటనకు వెళ్లనుండగా, ఆయన అక్కడి నుంచి రాగానే రాధ చేరిక ఉంటుందని, ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

రాధ చేరికతో కాపు సామాజికవర్గంలో, ముఖ్యంగా విజయవాడలో టీడీపీ మరింతగా బలపడుతుందని, ఆయనతో పాటు చాలా మంది స్థానిక నేతలు పార్టీ మారనున్నారని తెలిపారు. వంగవీటి రాధ టీడీపీలో చేరితే, అది వైకాపాకు కోలుకోని దెబ్బే అవుతుంది.

ఖండించిన రాధా?

అయితే మీడియాలో వస్తున్న కథనాలకు రాధా వివరణ ఇచ్చినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. `మా నాన్నని చంపిన టీడీపీలో ఏ రకంగా నేను జాయిన్ అవుతాను? నాకు టీడీపీలో జాయిన్ అవ్వాల్సినంత ఖర్మ పట్టలేదు. ఇంకొక్కసారి ఇలాంటి చెత్త వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేస్తా` అని రాధా సమాధానమిచ్చినట్లు వారంటున్నారు. దీంతో ఆ వార్తలకు చెక్ పడిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles