pawan kalyan press meet at karimnagar in telangana టీఆర్ఎస్ కంచుకోటలో పవన్ కల్యాన్ ప్రెస్ మీట్

Pawan kalyan attracts young leaders of other parties

Pawan Kalyan Political Yatra, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Kondagattu Anjaneya Swami Temple, pawan kalyan, pawan kalyan, janasena, social media, TRS, TDP, YSRCP,Congress, BJP, telangana, andhra pradesh, politics

Janasean president Pawan Kalyan today said that he welcomes leaders from other parties if they are bound to the welfare of people.

పవన్ ప్రకటనతో అధికార, విపక్ష పార్టీల్లో కలవరం

Posted: 01/22/2018 08:54 PM IST
Pawan kalyan attracts young leaders of other parties

తెలంగాణ రాష్ట్ర సమితికి కంచుకోటగా వున్న కరీంనగర్ జిల్లాలో జనసేన పార్టీ తమ రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించింది. తెలంగాణలో ప్రజా యాత్రలో భాగంగా జనసేన అధ్యక్షుడు, సినీ నటడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఇవాళ కొండగట్టు అంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కరీంనగర్ చేరుకుని అక్కడ ప్రేస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ పార్టీ స్థాపనకు పునాది వేసి తొలి బహిరంగ సభకు వేదికైన కరీంనగర్ లో ఇవాళ పవన్ కల్యాన్ కు అభిమానులను పట్టిన బ్రహ్మరథంతో అధికార పార్టీలో బీటలు వారుతున్నాయా? అన్న అనుమానాలు కూడా తలెత్తనున్నాయి.

అయితే ఇన్నాళ్లు తమకు మాత్రమే కంచుకోటగా అని భావించిన టీఆర్ఎస్ సహా అంతకు ముందు ఈ ప్రాంతంలో అదిపత్యాన్ని చాటిన కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా అందోళన ప్రారంభమైంది. పూర్తిగా యువత పవన్ కల్యాన్ అంటూ అతని వెంట తిరిగితే.. ఇక తమ పార్టీలో తమకు పల్లకీలు పట్టేది ఎవరన్న చర్చకు కూడా ఈ పరిణామాలు అంతర్గతంగా దారితీస్తున్నాయి. ఇక పవన్ కల్యాన్ ఇతర పార్టీ నేతలకు కూడా తమ పార్టీలోకి అహ్వనిస్తామని, అయితే వారు ప్రజాహితం కోసం కంకణబద్దులయితేనా తాము స్వాగతిస్తామని చెప్పడంతో.. కొందరు యువ నాయకులు కూడా అటువైపు చూస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో ఈ ఏడాది చివరి నాటికి సార్వత్రిక ఎన్నికలు జరిగితే లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా అనివార్యమన్న విషయాన్ని ఇప్పటికే అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం.. దానికి మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వంత పాడినట్లు ప్రకటన చేయడంతో.. అసెంబ్లీ స్థానాల పెంపు ఈ లోగా జరగకపోవచ్చునని. దీంతో తమ పార్టీకి చెందిన నాయకులతో పాటు పార్టీలలోకి వలస వచ్చిన నాయకులను ఎలా బుజ్జగించాలన్ని విషయం అధికార పార్టీలకు శరాఘతంగా మారింది.

దీంతో పార్టీలోని యువ క్యాడర్ పవన్ కల్యాన్ పార్టీవైపు కూడా పయనించే అవకాశాలు వున్నాయని వార్తలు వినబడుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఎలాగైనా ఈ సారి ఎన్నికలోనైనా విజయాన్ని సాధించాలంటే మాత్రం.. తాము తప్పక ఇతర పార్టీ వైపు పయనించాలని అలోచన వున్న విపక్షాలకు చెందిన పార్టీ నేతలు కూడా పవన్ జనసేన వైపు అకర్షితులవుతున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  TRS  TDP  YSRCP  Congress  BJP  telangana  andhra pradesh  politics  

Other Articles