Why Is Pawan Talking On Betrayal Of Chiru? పవన్ కల్యాన్ వ్యాఖ్యల వెనుక నిగూఢార్థం అదేనా..?

Chiranjeevi s next political stint with pawan kalyan

Pawan clearing route for chiranjeevi, chiranjeevi to join janasena, janasena honorary president chiranjeevi, pawan on betrayal of chiru, chiru next political stint with janasena. Chiranjeevi, Pawan Kalyan, Jana Sena Party, praja rajyam party, deceivers, congress, politics

There are serious speculations in the film industry about Chiranjeevi all set to take up the post of the honorary president of the Jana Sena Party, founded by his younger brother, Pawan Kalyan.

పవన్ కల్యాన్ వ్యాఖ్యల వెనుక నిగూఢార్థం అదేనా..?

Posted: 12/12/2017 12:51 PM IST
Chiranjeevi s next political stint with pawan kalyan

మరో సార్వత్రిక ఎన్నికకు సమయం అసన్నమైంది. మరో ఏడాదిన్నర కాలంలోనే ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం, ఎన్నికలలో గెలుపు కోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. అధికారంలో వున్న ప్రభుత్వాలు ప్రజలు తాము ఎంత చేశామో అన్నదానిపై విశ్లేషణలు ఇవ్వనున్నారు. అయితే అధికారంలోకి మేము వస్తే మరెంతో చేస్తామని నినదిస్తూ ప్రతిపక్షాలు జనంలోకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో కొత్తగా అవిర్భవించిన పార్టీలో మాత్రం అసలు తామెంటో.. తమ ఉద్దేశ్యమెంటో.. తాము రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామో..? తమ లక్ష్యాలను కూడా ప్రజలకు తెలుపుతున్నాయి.

ఇక అంధ్రప్రదేశ్ కేంద్రంగా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన రాజకీయాల్లో ఇదే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు విపక్ష పార్టీ అధికార పార్టీ సాధించింది ఏదీ లేదని అరోపిస్తూ పాదయాత్రను చేపడుతుండగా, అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నారని అధికార పార్టీ ప్రతివిమర్శలు చేస్తున్నాయి.  అయితే ఇదే సందర్భంలో జనసేన అధినేత, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా చలోరే చలోరే చల్ కార్యక్రమంలో భాగంగా విశాఖ నుంచి ఒంగోలు వరకు పర్యటించారు. ఆయన పర్యటన నేపథ్యంలో తన పార్టీ ఏం చేస్తుందన్న విషయాలతో పాటు.. తన పార్టీ లక్ష్యాలను కూడా తెలిపింది.

కాగా, గతంలో తన సోదరుడి అంశం వచ్చినప్పుడు కుండబద్దలు కొట్టినట్లు తన సోదరుడు చిరంజీవి ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీలోకి రారని స్పష్టం చేసిన పవన్ కల్యాన్ ఈ పారి పర్యటనలో మాత్రం కొంత క్లారిటీ వచ్చేలా మాట్లాడారు. ప్రజలకు ఎంతో చేద్దామని, తన అన్న ప్రజారాజ్యం పార్టీని స్థాపిస్తే.. దానిని కాంగ్రెస్ లో విలీనం చేసేలా చేసిన కొందరు వెన్నుపోటు దారులకు మాత్రం తగిన గుణపాఠం చెబుతామని పవన్ వ్యాఖ్యనించడం కొంత అసక్తిని రేపింది. అయితే చిరంజీవి జనసేనలో సముచిత స్థానం లభిస్తుందా..? అందుకే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారా..? అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే రాజకీయాలలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించినా.. కాంగ్రెస్ లో మాత్రం ప్రస్తుతం తన ఉనికి కాపాడుకుంటున్న చిరంజీవి.. తన సోదరుడు పవన్ కల్యాన్ కోసం పార్టీకి రాజీనామా చేయనున్నారా..? అన్న వార్తలు బలంగా తెరపైకి వస్తున్నాయి. పవన్ నిత్యం కాంగ్రెస్ ను దోషిగా చూస్తూ, ప్రజలకు చూపిస్తున్న క్రమంలో ఇక తాను కాంగ్రెస్ లో కొనసాగడం సముచితం కాదని భావిస్తున్నారా.? అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అయితే రాజకీయంగా పవన్ కూడా తన సోదరుడికి అంతకన్నా సముచితమైన స్థానం ఇవ్వనున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి చిరు వచ్చారన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.

దీంతో చిరంజీవి జనసేనలో చేరబోతున్నారన్న వార్తలు ఇప్పడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. జనసేనలో కీలక బాధ్యతలను అన్న చిరంజీవికి పవన్ అప్పగించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెగాస్టార్, పవర్ స్టార్ లు కలసి జనసేన తరపున పోటీ చేయనున్నారన్న వార్తలు కూడా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమ వర్గాల్లో కూడా అసక్తికరంగా మారాయి.

అందుకనే పవన్ తన సోదరుడు చిరంజీవిని టార్గెట్ చేసిన వ్యాఖ్యలు చేశారన్న వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. జనసేన పార్టీ గురించి మాట్లాడాల్సిన పవన్ ప్రజారాజ్యం ప్రస్తావన తీయడం, నమ్మకద్రోహులకు గుణపాఠం చెబుతానని ప్రకటించడం.. అంతా ఒక పక్కా ప్రణాళికలో భాగంగానే జరిగిందన్న.. పవన్ ఆ వ్యాఖ్యలు వెనుక  నిగూడార్థం ఇదేనన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలను విశ్లేషిస్తున్న రాజకీయ నిపుణులు, చిరంజీవి త్వరలో జనసేనలోకి వస్తారని అంచనా వేస్తున్నారు. చిరంజీవిని కూడా జనసేనలో కలుపుకుంటే, మరింత త్వరగా ప్రజల్లోకి వెళ్లవచ్చని పవన్ కూడా భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Pawan Kalyan  Jana Sena Party  praja rajyam party  deceivers  congress  politics  

Other Articles