sparing jaimin patel from no fly list araises questions పౌరవిమానయాన శాఖ అకులు, కంచాలు వేరయా..!

Sparing gujarat dy cm son jaimin patel from no fly list araises questions

Gujarat Dy CM, Nitin Patel, jaimin patel, no fly list, suspension on flying, jhalak, vaihvi, inebriated passenger, Qatar airways, greece, Ahmedabad International Airport, gujarat, no flying list, ashok gajapathi raju,

questions araise why the central aviation ministry, or the indian airport officials not booked Gujarat Deputy Chief Minister Nitin Patel's son jaimin patel under no fly list even after he had argued with airline staff

పౌరవిమానయాన శాఖ అకులు, కంచాలు వేరయా..!

Posted: 05/09/2017 07:38 PM IST
Sparing gujarat dy cm son jaimin patel from no fly list araises questions

దేశ పౌరవిమానయానంలో అధికారులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారా..? లేక అందరి పట్ల ఒకే విధానాన్ని కనబరుస్తున్నారా..? అంటే పక్షపాత ధోరణి వుందన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అయిన వారికి అకుల్లోనూ.. కానీ వారికి కంచాల్లోనూ వడ్డించే విధంగా పౌర విమానయాన శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ అరోపణలు గుప్పుమంటున్నాయి. తాను పొందిన బిజినెస్ క్లాస్ టిక్కట్టుకు బదులు ఎకానమీ క్లాసులో కూర్చోబెట్టిన ఎయిర్ ఇండియా అధికారిపై చేయిచేసుకున్న ఘటనలో శివసేన ఎంపీ రవింద్ర గైక్వాడ్ ను ముప్పుతిప్పలు పెట్టి చివరాఖరును అతనిపై విధించిన సస్పెషన్ ను రద్దు చేసిన అధికారులు అదే అటు కేంద్రంలోనూ ఇటు గుజారత్ రాష్ట్రంలోనూ అధికారంలో వున్న బీజేపికి చెందిన ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ కుమారుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన జైమన్ పటేల్ (30) పట్ల వేర్వేరుగా స్పందించిన తీరు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది.

పీకత వరకు మద్యం తాగి విమానాశ్రయంలో అధికారులతో వాదనకు దిగి వీరంగమేసి జైమన్ పటేల్ పట్ల అధికారులు చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. రవీంద్ర గైక్వాడ్ ఘటన నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ పలు నూతన నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనల్లో విమాన ప్రయాణికులు విమానాశ్రయ సిబ్బందితో వాదనకు దిగినా.. అనుచితంగా వ్యవహరించినా వారిపై నో ప్లైయింగ్ లిస్ట్ ఓపెన్ చేస్తామని కూడా అధికారులు తెలిపారు. మరి జైమన్ పటేల్ పై పౌరవిమానయాన శాఖ ఎందుకు నో ప్లైయింగ్ లిస్ట్ జాబితాలో పేరును ఎందుకు నమోదు చేయలేదన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తుంది.

భార్య ఝలక్, కుమార్తె వైష్వితో కలిసి గ్రీస్ వెళ్లేందుకు జైమన్ పటేల్ ఉదయం 4 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్‌ పోర్ట్‌ కు చేరుకున్నారు. వీల్ చెయిర్‌ లో కూర్చున్న జైమన్ పటేల్ ఇమ్మిగ్రేషన్ తనిఖీలు కూడా పూర్తి చేయించుకున్నారు. ఆయన పూటుగా మద్యం తాగడంతో కనీసం నడవలేని స్థితిలో ఉండడంతో, ఆయనను వీల్‌ చెయిర్‌ లో కూర్చోబెట్టారని సమాచారం. అప్పటికీ దుర్వాసన వస్తుండడంతో విమానంలో ఆయనను ఎక్కించేందుకు ఖతార్ ఎయిర్ వేస్ సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆయన వారితో వాదనకు దిగారు. డిప్యూటీ సీఎం కొడుకునే ఆపుతారా? అంటూ వీరంగంవేసి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వివాదం గుజరాత్ లో కలకలం రేపడంతో... దీనిపై గుజరాత్ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ వివరణ ఇస్తూ...తన కుమారుడు అనారోగ్యం కారణంగా నడవలేక వీల్‌ చెయిర్‌ లో కూర్చున్నాడని అన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ప్రత్యర్ధులు అర్థం పర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయితే విమాన సిబ్బందితో వాదనకు దిగిన జైమన్ పటేల్ తాను అనారోగ్యం బారిన వున్నానని ఎందుకు చెప్పలేకపోయారు. అయినా అనారోగ్యంతో వున్న వ్యక్తి భార్య పిల్లలతో కలసి విదేశాలకు విహారయాత్రకు ఎందుకు పయనమయ్యారు..? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.

వీటిని పక్కన బెడితే.. విమాన సిబ్బందితో వాదనకు దిగి వీరంగం చేసిన జైమన్ పటేల్ పై నో ప్లెయింగ్ లిస్ట్ జాబితాలో పేరును ఎందుకు నమోదు చేయలేదన్నది అసలు ప్రశ్న. ఇక పార్లమెంటు సభ్యుడిని ముప్పుతిప్పలు పెట్టిన ఘటనలో సదరు ఎంపీ విమానసిబ్బంది బాధితుడినని స్వయంగా పార్లమెంటులోనే చెప్పాడు. అయితే ఓ ఎంపీ కన్నా ఉప ముఖ్యమంత్రి తనయుడికి అధిక ప్రాథాన్యతను ఇచ్చి అతన్ని కాపాడే బాధ్యతను విమానయాన సిబ్బంది ఎందుకు భుజాన వేసుకున్నారన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles