రాను రాను అంటున్న వెయ్యి నోటు.. Banks Looking At Lowering Savings Account Interest Rates

Banks looking at lowering savings account interest rates

loan growth, Credit growth, Banking sector, Banking system, interest rates on savings bank accounts, Savings bank account, Jefferies, Indian banking sector, net interest margin, demonetisation, RBI, Shaktikanta Das, finance ministry, arun jaitley, pm modi

With falling loan-deposit ratios, a weak loan growth and compressing spreads, banks are looking at the possibility of lowering the savings interest rates, Jefferies said.

సేవింగ్స్ అకౌంట్ల వడ్డీరేట్ల తగ్గింపు..? కస్టమర్లకు బ్యాంకుల షాక్..?

Posted: 03/28/2017 07:48 PM IST
Banks looking at lowering savings account interest rates

దేశంలో చలామణిలో వున్న పాత పెద్ద నోట్ల స్థానంలోకి కొత్త ముద్రించిన రూ.500, రూ.2000 లను తీసుకువచ్చిన కేంద్రప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరించిన పలువురు డీమానిటేజైషన్ నేపథ్యంలో రానున్న రోజుల్లో పెట్రోల్ రూ. 30కే లీటర్ వస్తుందని, పంచధార, టూత్ పేస్టు వంటి నిత్యావసరాల ధరలు ఎంతగానో తగ్గుతాయని పలువురు వాట్సాఫ్ గ్రూప్ లలో పెట్టి విపరీతంగా ప్రచారం చేశారు. తీరా చూస్తే దేశంలో ఏర్పడిన కరెన్సీ కొరత తీరడానికి కేవలం యాభై రోజులు చాలునని చెప్పింది బీజేపి సర్కార్.

రమారమి ఆరు మాసాలు కావస్తున్న ఇప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లలో కరెర్సీ కొరతతో ఏర్పడిన ఇబ్బందులను దూరం చేయలేకపోతుంది కేంద్రం. ఇక నిత్యావపసర ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా నోట్ల రద్దుకు ముందుకు వున్న రేట్లకు కాస్తా అటు ఇటుగానే వున్నాయి. అసలు నోట్ల రద్దుతో దేశానికి ఒనగూరిన లాభమేంటి..? సామాన్యుడికి కలిగిన లాభం ఏంటీ..? అని పరిశీలిస్తే.. ప్రభుత్వ అర్భాటం, బ్యాంకుల పెత్తనానికి రెక్కలు రావడం తప్ప.. ఏమీ లాభాం లేదని స్పష్టమవుతుంది.

ఇక ప్రధాని నరేంద్రమోడీ అవినీతి, నల్లధనం, ఉగ్రవాదానికి సహకారం, అంతర్గత తీవ్రవాదం గురించి నోట్ల రద్దు నేపథ్యంలో ఆ తరువాత అనేక సభల్లో సమావేశాల్లో ఈ విషయంపైనే మాట్లాడారు. నోట్ల రద్దు తరువాత ఏకంగా కాశ్మీర్ లోకి చోరబడిన ఉగ్రవాదుల వద్ద కొత్తగా వచ్చిన రూ.2000 నోట్లు లభించాయి. ఆ తరువాత ఉగ్రవాదానికి ఏమాత్రమైన తగ్గిందా..? అన్నది వారే అలోచించాలి. ఇక అవినీతి గురించి ప్రధాని ప్రస్తావించారు.

ఎప్పుడో జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్న ప్రధాని కొత్త రూ వేల రూపాయల నోట్లను భద్రపర్చుకున్న వారెందరో తెలిసినట్టు లేదు. ఇక బ్యాంకు అధికారుల నుంచి పోస్టాఫీసు వరకు అన్ని చోట్ల అవినీతికి తెరలేపిన అధికారులు గురించి అసలు మర్చిపోయినట్లు వున్నారు. నోట్ల రద్దుతో సామాన్యులను కష్టాల పాలు చేయడంతో పాటు నీతివంతుల్ని అవినీతులుగా మార్చే అవకాశం కూడా కల్పించారన్న అరోపణలు తెరపైకి వస్తున్నాయి.

ఇక నల్లధన కుబేరుల విషయానికి వస్తే చిన్న చిన్న చేపలకు బదులు తిమింగళాలను మాత్రం ఎంచక్కా వదిలేశారన్న అరోపణలు వున్నాయి. అసలు ప్రభుత్వ ప్రకటించిన స్వచ్చంధ పథకం కింద కాకుల్ని కోట్టి గద్దలకు పెట్టారన్న చందాన.. చిన్న చితకా వ్యాపారులను కొల్లగోట్టడం పక్కనబెడితే.. వందల కోట్ల రూపాయల నల్లధన కుబేరులు ఎందరో వున్న ఈ దేశంలో వారిపై మాత్రం ఇప్పటి వరకు దాడులు జరగలేదన్న అరోపణలు వినబడుతున్నాయి.

మరీ ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయాల్లోనే పెద్ద ఎత్తున్న నల్లధన కుబేరులున్నారని, వారిలో ఎవరిపైనా దాడులు జరిగాయని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. గాలి జనార్థన్ రెడ్డి నుంచి ఎందరో రాజకీయ ప్రముఖులు ఈ విషయంలో మినహాయింపులు లభించాయన్న గుసగుసలు కూడా వినబడుతున్నాయి. ఇక ప్రధాని చెప్పినట్లు పేదల సేవింగ్స్ అకౌంట్లలో, జన్ ధన్ ఖాతాలలో ఎందరికి నోట్ల రద్దు నేపథ్యంలో ఒక్కసారిగా డబ్బులు వచ్చిపడ్డాయో.. ఎంతమంది సంపన్నులు పేదల ఇళ్లముందు క్యూ కట్టారో.. ఎందరిని లక్షాధికారుల్ని చేశారో కూడా చెప్పాలని డిమాండ్లు ప్రతిపక్షాల నుంచి వినబడ్డాయి.

ఇక వీటన్నింటినీ పక్కనబెడితే తాము కష్టించి సంపాదించిన సోమ్ముపై బ్యాంకు అధికారులు షరతులు విధించడంపైనా సామాన్యుల నుంచి తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ఏటీయంలలో నో క్యాష్ బోర్డులు.. ఇలా సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు మాత్రమే తీవ్రంగా నష్టపోయారు. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చెబుతున్న సమాధానం డిజిటల్ మనీ. డిజిటల్ లావాదేవీ కోసమే బ్యాంకులు ఇలా చేస్తున్నాయని, అసలు ప్రభుత్వాలు వున్నవి ప్రజల కస్టాలను తీర్చేందుకా..? లేక ప్రజలకు కష్టాలను కలిగించేందుకా..? అన్న ప్రశ్నలు కూడా సామాన్యుల నుంచి ఉత్పన్నం అవుతున్నాయి.

నోట్ల రద్దు నేపథ్యంలో రంగంలోకి దిగిన భారతీయ రిజర్వు బ్యాంకు ఆ తరువాత నోట్లపై పరిధిపై షరతులను పెట్టింది. వారానికి ఇంత. నెలకు ఇంత అంటూ పరిధులను పెట్టింది. ప్రజలను తమ డబ్బును తాము తీసుకునేందుకు వీలు లేకుండా చేసింది. ఆ తరువాత పరిధులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నా ఏటీయం కేంద్రాలను అదికంగా వినియోగించకుండా దానిపై అంక్షలను విధించి.. వాటిని అతిక్రమిస్తే జరిమానాలు తప్పవని కూడా హెచ్చరించింది. మినిమమ్ బ్యాలెన్స్ లేని అకౌంట్లకు క్షవరం తప్పదని, మూడు పర్యాయాల కన్నా అధికంగా ఏటీయం కేంద్రానిక వెళ్లి నగదు డ్రాచేసనా.. కొతలు పడతామని హెచ్చరించింది.

ఇక తాజాగా బ్యాంకులు మరో మారు తమ కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పనున్నాయి. అదేంటంటే సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు ప్రసుత్తం అందిస్తున్న వడ్డీ రేట్లను తగ్గించేందుకు కసర్తుతులు చేస్తున్నాయని సమాచారం. సేవింగ్స్ అకౌంట్లో వున్న డబ్బులకు బ్యాంకు అధికారులు ఇచ్చే వడ్డీ రేటును మరింత తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అలోచిస్తున్నట్లు సమాచారం. ఇది ఎందుకంటే డీమానిటేజైషన్ నుంచి రుణాలను తీసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందట.

దీంతో బ్యాంకులకు లాభాలు తగ్గిముఖ్యం పట్టాయని, వాటిని అధిగమించాలంటే ప్రసుత్తం సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు ఇస్తున్న నాలుగు శాతం వడ్డీని దీనిని మూడున్నర శాతం వరకు తగ్గించి అంటే 50 బేసిక్ పాయింట్లు తగ్గించి లాభాలను అర్జించాలని బ్యాంకులు అలోచనట. ఈ మేరకు సవరణ చేయాల్సిందిగా వారు ప్రతిపాదిస్తున్నారని ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ సంస్థ జేఫ్పెరీస్ తెలిపింది. ఇలా చేస్తే మరి డిజిటల్ లావాదేవీల మాట ఏమో కానీ.. బ్యాంకుల్లోనే డబ్బులకు కరువు వచ్చే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని అంటున్నవారి సంఖ్య కూడా పెద్దగానే వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles