ఫిబ్రవరి రెండో వారంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు..? Elections In 5 States Likely From February Second Week

Elections in 5 states likely in february second week

UP assembly elections, 2017 elections, UP polls, Punjab polls, Uttarakhand polls, Goa polls, Manipur polls, india news, latest news

Assembly elections in five states including Uttar Pradesh and Punjab are most likely to be between second week of February and the beginning of March

ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగరా..?

Posted: 12/24/2016 05:23 PM IST
Elections in 5 states likely in february second week

దేశంలోనే అత్యధిక పెద్ద రాష్ట్రంగా బాసిల్లుతున్న ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీకి ఫిబ్రవరిలో నగరా మ్రోగనుందా..? అంటే అవునన్న సంకేతాలు వస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో నిర‍్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల తొలివారంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు వున్నాయని తెలుస్తుంది.

ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే మణిపూర్ లో పెద్ద ఎత్తున్న అందోళనలు, నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వాటిని కూడా ఎన్నికల సంఘం పరిశీలనలోకి తీసుకోని తేదీలను ప్రకటించే అవకాశాలున్నాయి. కేంద్ర బడ్జెట్ సమర్పణ జరిగి.. పార్లమెంటు సమావేశాలు ముగిసి ముగియగానే ఐదు రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం.

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నామని ఈ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే సమాచారాన్ని కూడా పంపింది. ఈ నేపథ్యలో బోర్డు, ఇంటర్‌ పరీక్షలకు ఎన్నికలు నిర్వహణ ఎలాంటి అటంకాలు కల్గకుండా ముందుగానే ఎన్నికలను నిర్వహించాలని కూడా ఈసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల తేదీలపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని సూచనలు చేసినట్లు సమాచారం.

పంజాబ్‌, గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్ ల అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు విడతల్లో పోలింగ్‌ జరిగే అవకాశాలున్నాయి. ఇక  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడవు 2017 మే 27తో ముగియనుండగా, ఈ నేపథ్యంలో యూపీ అసెంబ్లీ పదవీకాలం ముగియకముందే.. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఉత్తరప్రదేశ్‌ లో తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని అధికార పార్టీ సమాజ్‌ వాదీ, మరోవైపు అధికారం కోసం బీఎస్పీ పోటీ పడుతున్నాయి. ఇక్కడ బీజేపి తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది.

ఇక పంజాబ్‌ లో బీజేపీ, కాంగ్రెస్‌ పోటీపడుతుండగా, కొత్తగా ఆమ్‌ ఆద్మీపార్టీ పోటీకి దిగటంతో అక్కడ త్రిముఖ పోటీ ఏర్పడింది.  గోవాలోనూ బీజేపి, కాంగ్రెస్ ల మధ్య పోటీకీ అప్ కూడా బరిలో నిలవడంతో అక్కడ కూడా త్రిముఖ పోటీ నెలకోంది. ఉత్తరాఖండ్ లో రెండు జాతీయ పార్టీల మధ్య ద్విముఖ పోటీ వుండగా, మణిపూర్ లో ఎన్నికల సరళిని అంచనా వేయడానికి అందోళనలు అడ్డంకిగా మారాయి. అంచనాలు ఎలా వున్నా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడంతోనే అసలు రాజకీయ సమీకరణలు చోటుచుసుకుంటాయని విశ్లేషకుల అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles