రాహుల్ గాంధీ స్థాయిని పెంచిన ప్రధాని మోడీ PM ModI hypes Rahul gandhi image

Pm modi hypes rahul gandhi image

Rahul Gandhi, PM Modi, Youth Leader, birla industries, sahara industries, bribe allegations, modi bribe allegations, gujarat sm, congress, bjp, uttar pradesh, political news, political gossips

While attacking congress vice president rahul gandhi PM Modi called him as youth leader, gives hype to him, by which bjp workers feel un satisfied

రాహుల్ గాంధీ స్థాయిని పెంచిన ప్రధాని మోడీ

Posted: 12/23/2016 05:47 PM IST
Pm modi hypes rahul gandhi image

పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని అవినీతి, నల్లదనం ఉగ్రవాదం, నక్సలిజాన్ని తరమికోట్టేందుకు తీసుకున్న చారిత్రక నిర్ణయం అని ప్రధాని నరేంద్రమోడీ చెప్పిడంతో దేశంలోని అనేక మంది ప్రజలు, విభిన్నవర్గాలకు చెందిన కార్మికులు, కర్షకులు తమకు త్వరలో ఉజ్వల భవిష్యత్ వస్తుందని అశిస్తున్నారు. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ చెప్పినట్లుగా తమకు అచ్చేధిన వస్తాయంటే కొంత కాలం వేచివుంటామని.. నవంబర్ 8న ప్రధాని ప్రకటన తరువాత అనుకున్నారు.

అయితే నెల గడించింది.. ప్రధాని చెప్పిన గడవుకు ఇంకా కేవలం ఐదు రోజులు మాత్రమే వుంది. అయినా తమ జీవితాల్లో వెలుగులు రాకపోగా.. ఉన్న మిటుకు మిటుకు మనే వెలుతురు కూడా అరిపోయే ప్రమాదముందని భావిస్తున్నారు. కేంద్రం పాత పెద్దనోట్లను బ్యాంకుల్లో వేయాలని చెప్పడం.. అలా చేయాగానే వాటిని తీసుకోవాడానికి మాత్రం పరిదులు, అంక్షలను పెట్టడం.. విధించిన పరిధి తాలుకు డబ్బును కూడా ఇవ్వలేకపోవడం అన్ని కలసి ప్రజాగ్రహం పెల్లుబిక్కుతుంది. అయినా మంచి రోజులు వస్తాయన్న అశతో సంయమనంగా వున్నారు.

ఈ క్రమంలో పెద్దనోట్ల రద్దుపై కేంద్ర నిర్ణయాన్ని తప్పబడుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూడా ఉద్యమాన్ని చేపట్టింది. కాంగ్రెస్ యువనేత మునుపెన్నడూ లేని విధంగా ప్రధానిపై సునిషితమైన విమర్శలు చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో నల్లకుబేరులకు ఓరిగిందేమీ లేదని, వారిళ్లకు డబ్బు చేరుతుందని, అయితే పేదలు, సామాన్యులు మాత్రం అనేక ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు.

ఈ నేపథ్యంలో రాహుల్ ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ తాను కొన్ని విషయాలు బయటపెడితే.. బీజేపిలో ముసలం పుడుతుందని, ప్రధాని కింద భూకంపం వస్తుందని అరోపణలు గుప్పించారు. అయితే వాటిని లైట్ గా తీసుకున్న బీజేపి.. రాహుల్ పై విమర్శలకు దిగింది. ఆ భూకంపం ఏదో రానీ చూద్దం అని సవాల్ విసరడం.. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పడు బిర్లా, సహారా గ్రూపుల నుంచి లంచం తీసుకున్నారని అభియోగాలు సంధించడం.. వాటిని చెల్లని నాణేలుగా బీజేపి నేతలు అభివర్ణించడం అన్ని చకచకా జరిగిపోయాయి.

అయితే తనపై అరోపణలు గుప్పించిన రాహుల్ పేరును ప్రస్తావించకుండా.. వారికి ఓ యువనేత వున్నాడు అయన ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడని.. అయన మాట్లాడి వుండకపోతే భూకంపం వచ్చేదేమో.. కానీ ఆయన మాట్లాడగానే అది రాదని అర్థమైపోయిందని మోడీ రాహుల్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ గాంధీ ఇప్పటికే పలు అంశాలపై మోడీని అయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అయినా ఎప్పుడూ స్పందించని మోడీ.. అవినీతి అరోపణలు చేయగానే అలా ఎలా రాహుల్ పై విమర్శలు చేశారా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాహుల్ మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన అంశాలు..

* భూ సంస్కరణల చట్టంలో మార్పుల అంశం
* వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం మాజీ సైనికుల ఉద్యమం
* నిత్యవసర సరుకుల ధరలు తగ్గింపు
* విదేశాలలోని నల్లడబ్బును తీసుకువస్తామన్న అంశం
* నల్లధన కుబేరులకు ఫెయిర్ అండ్ లవ్లీ స్కీం వర్తింపజేయడం
* సర్జికల్ స్ట్రైక్ అనంతరం హర్యానా మాజీ సైనికుడి ఆత్మహత్య అంశం
* పెద్ద నోట్ల రద్దుతో పేదలు, సామాన్యులకు పాట్లు అన్న అంశంలో..

ఇవి కాక ఇంకా అనేకానేక అంశంలలో ప్రధాని నరేంద్రమోడీని రాహుల్ గాంధీ విమర్శించారు. అయితే ప్రధాని మాత్రం పరోక్షంగా యువనేత అంటూ రాహుల్ ను టార్గెట్ చేయడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అవినీతి అరోపణలు గుప్పిస్తే తప్ప ప్రధాని నరేంద్రమోడీ నాయకుల పేర్లను ప్రస్తావించరనుకుంటా నంటూ కాంగ్రెస్ వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి.

కాగా, ప్రధాని తనను విమర్శించిన కొద్దిసేపటికే రాహుల్ యూపీలోని ఓ సభలో మాట్లాడుతూ తనను ఎంతైనా అవహేళన చేసుకోమ్మని అయితే తాను అడిగిన ప్రశ్నలకు మాత్రం బదులు ఇవ్వాలని చెప్పారు. గుజరాత్ సీఎం హోదాలో బిర్లా, సహారా సంస్థల నుంచి 52 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారా..? లేదా..? అవినీతినికి పాల్పడ్డారా..? లేదా అన్న అంశాలపై నేరుగా సమాధానం ఇవ్వండీ అని డిమాండ్ చేశారు.

అయితే ఇన్నాళ్లు రాహుల్ గాంధీని పప్పూ అంటూ చిన్నపిల్లాడిలా మాత్రమే గుర్తించిన బీజేపి.. ఇప్పుడు రాహుల్ ను యువనేతగా గుర్తించనుంది.. అందుకు కారణం ప్రధాని మోడీ యువనేత అంటూ సంభోధించడమే. కొద్ది నెలల క్రితం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ యాభై ఏళ్లు వచ్చినా.. మీకు రాహుల్ గాంధీ యువనేతగా కనబడతారా..? అంటూ మీడియానే నిలదీశారు.. మరి ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడామె ఎలా రియాక్ట్ అవుతారో.. వేచిచూడాలి. ఇక అలా రాహుల్ ఇమేజ్ ను ప్రధాని మోడీ పెంచేశారని.. ఇది తమను తీవ్ర నిరాశకు గురిచేస్తుందని బీజేపి పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  PM Modi  Youth Leader  congress  bjp  uttar pradesh  political news  

Other Articles