పార్టీ పగ్గాలు కాదు.. ఏకంగా సీఎం అయ్యేందుకే ఫ్లాన్! | How Sasikala became the kingmaker in Tamil Nadu.

Aiadmk crucial meeting on december 29

Sasikala Natarajan, AIADMK Chief, AIADMK General Council Meet, Sasikala Natarajan Tamil Nadu CM, Sasikala Natarajan New CM, AIADMK New General Secretary, AIADMK New Head, 2017 Tamil Nadu Politics, 2016 Tamil Nadu politics review, Chinnamma Sasikala, Sasikala Natarajan Panneerselvam

AIADMK general council meet on December 29. Sasikala Natarajan all set to take over Party.

శశికళ బ్యాక్ డోర్ ఓపెన్ చేసిందా?

Posted: 12/27/2016 10:18 AM IST
Aiadmk crucial meeting on december 29

డిసెంబర్ 29 తమిళనాట ఏం జరగబోతుందని రాజకీయ వర్గాలన్నీ ఆ సక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు అన్నాడీఎంకే స‌ర్వ‌స‌భ్య మండ‌లి, కార్యాచ‌ర‌ణ మండ‌లి స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ సమావేశంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి శశికళకు ఎదురవుతున్న చిక్కులను తొలగించబోతున్నారు కూడా. అయితే అదే సమయంలో ఆమెను ముఖ్యమంత్రిని చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అన్నాడీఎంకే లో వేగంగా మారుతున్న పరిణామాల‌ను చూస్తుంటే శ‌శిక‌ళ ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్టించ‌డం ఖాయ‌మేన‌ని అనిపించకమానదు. సాధారణంగా అన్నాడీఎంకే కౌన్సిల్ సమావేశం భారీ ఎత్తున జరుగుతూ వస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్త స్థాయి నుంచి కీలక నేతలంతా దానికి హాజరవుతుంటారు. కానీ, ఇప్పుడు జరగబోయే సమావేశానికి కేవలం జిల్లాల నుంచి 40 మంది నేతలను, 50 మంది కీలకమైన నేతలు మాత్రమే హాజరవుతున్నారు. పైగా దీనికి శశికళను కూడా ఆహ్వానించారు.

ఇక పార్టీ ప‌ద‌వికి పోటీ చేసే అభ్య‌ర్థి ఐదేళ్ల‌పాటు పార్టీ స‌భ్య‌త్వం క‌లిగి ఉండాల‌న్న నిబంధ‌న‌ను పార్టీ స‌ర్వ‌స‌భ్య మండ‌లి స‌మావేశంలో స‌డ‌లించ‌నున్నట్లు ఇది వరకే పార్టీ ప్రెసీడియం చైర్మన్ మ‌ధుసూద‌న్ ప్రకటించాడు కూడా. నిబంధ‌న స‌డ‌లించిన వెంట‌నే ఆమెను ప్రధాన కార్య‌ద‌ర్శిగా ఆమెను ఏక‌గ్రీవంగా ఎన్నుకుంటారు. అయితే అక్కడితో ఆగకుండా పార్టీ శాస‌న‌స‌భ్యుల స‌మావేశం నిర్వ‌హించి శ‌శిక‌ళ‌ను స‌భాప‌క్ష నాయ‌కురాలిగా ఎన్నుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.

అమ్మకు భారతరత్న అని గట్టిగా గళం వినిపిస్తున్న సెల్వం, శశికళ విషయంలో మాత్రం కిక్కురుమనకుండా ఉంటున్నాడు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న అనంత‌రం వారం రోజుల‌పాటు శ‌శిక‌ళ‌ను కలుసుకోని ముఖ్య‌మంత్రి ప‌న్నీర్‌సెల్వం సోమ‌వారం సాయంత్రం పోయెస్ గార్డెన్‌కు వెళ్లి ప‌ది నిమిషాలు భేటీ అయ్యారు. వారి స‌మావేశంలో ఇదే విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. సమావేశానికి శశికళ అండ్ అనుచరులను కూడా ఆహ్వానించటంతో ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK  Sasikala Natarajan  CM Panneerselvam  

Other Articles