కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్నచారిత్రక పెద్దనోట్లను రద్దు నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తుండగా, మరికోందరు స్వాగతిస్తున్నారు. ప్రధాని నిర్ణయాన్ని సమర్థిస్తున్న వారి జాబితాలో ఆయనకు బద్ద శత్రువైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా వుండటం గమనార్హం. ఇక మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బహాటంగానే ప్రధాని నిర్ణయాన్ని దిక్కుమాలినదిగా విమర్శించడం, అటు తొలుత ఈ నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు కూడా ప్రజల అవస్థలు పడుతున్న నేపథ్యంలో విమర్శలు గుప్పించడం కూడా తెలిసిందే.
కాగా చారిత్రక నిర్ణయాన్ని మోగా బ్రదర్ నాగబాబు మద్దతు ప్రకటించారు. సరిగ్గా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ నిర్ణయంపై నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన తరువాత ప్రధాని నిర్ణయాన్ని నాగబాబు మద్దతు పలికడం వెనుక అంతర్యమేమిటో అర్థంకావడంలేదు. ప్రధాని తీసుకున్న నిర్ణయం దేశ అభివృద్దికి, పురోగతి దోహదం చేస్తుందని అకాంక్షించారు. దీంతో రంగంలోకి దిగిన రాజకీయ విశ్లేషకులు నాగబాబు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లనున్నారా.? అన్న ప్రశ్నలను సంధిస్తున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.2 వేల నోటును కూడా రద్దు చేసి, కొత్త నోటు తీసుకు వస్తే స్వచ్ఛమైన ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీకి ప్రముఖ నటుడు నాగబాబు విజ్ఞప్తి చేశారు. పెద్దనోట్ల రద్దుపై గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్రలో నిలిచారని నాగబాబు కొనియాడారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం దేశ భవిష్యత్ ను మార్చడం తథ్యమని అన్నారు. ప్రజలందరూ మోదీ తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని కోరడం వెనుక పరమార్థం అవగతం అవుతుందని పలు అంచానాలు వేసుకుంటున్నారు విశ్లేషకులు.
ఇక ముఖ్యంగా తాను మోదీ అభిమానిని కాదని, కనీసం బీజేపీ సభ్యుడిని కూడా కాదని, బీజేపీతో తనకు అభిప్రాయభేదాలు ఉన్నాయని పేర్కొంటూనే.. మోదీ నిర్ణయానికి మద్దతు పలకడం.. తాటాకు చప్పుళ్లేకు బెదిరే వ్యక్తి కాదు మోదీ.. చావో-రేవో తేల్చుకునే దమ్మున్న మగోడు’ అని ప్రశంసలతో ముంచెత్తడంతో ఇక ఆయన త్వరలోనే బీజేపిలోకి చేరే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. పెద్దనోట్లను రద్దుచేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయంతో తాను కూడా షాక్ అయ్యానని, అయితే దీని గురించి ఆలోచిస్తే ఇది మంచి నిర్ణయమో తెలిసిందని పేర్కొన్నారు.
అయితే ప్రధాని మోదీ చెప్పినట్టు ఆయనకు 50 రోజులు ఇచ్చి చూడాలని, మంచిరోజులు వస్తాయని నాగబాబు చెప్పడం వెనుక అంతర్యం ఉందని కూడా చెప్పారు. ఈ విషయంలో పవన్ కల్యాన్ ఇటీవల జరిగిన అనంత సభలో నోట్ల రద్దుపై ప్రస్తావించనప్పటికీ.. తెలుగు రాష్ట్రాలలో దీనికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం రాకూడదనే బీజేపి నేతలు నాగబాబు చేత ఇలాంటి ప్రకటన చేయించారా..? అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో జనసేన అధినే పవన్ కల్యాన్ కేంద్ర ప్రభుత్వంపై అనంత సభ వేదికగా పలు విమర్శలు చేశారు.
మాస్ తో పాటు క్లాస్ అభిమానులను కూడా సోంతం చేసుకుని గత సార్వత్రిక ఎన్నికలలో అటు కేంద్రంలో నరేంద్రమోడీ అధ్వర్యంలో బీజేపి ప్రభుత్వానికి, ఇటు రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ పవన్ కల్యాన్ ప్రచారం నిర్వహించారు. రెండు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా.. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని మాత్రం నెరవేర్చడం లేదని, ప్రత్యేక హోదా ప్రజల హక్కు అని నినదించి కేంద్రచ రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలను సంధించారు, ఈ తరుణంలో పవన్ తమకు దూరం అవుతున్నాడని నాగబాబును బీజేపి తనవైపుకు దువ్వుకుంటుందా..? అన్న ప్రశ్నలను కూడా రాజకీయ విశ్లేషకులు సంధిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more