గాలి వారింట పెళ్లికి బీజేపి పెద్దలు దూరం..? BJP leaders to stay away from lavish wedding

Bjp leaders to stay away from janardhan reddy s daughter s lavish wedding

Gali Janardhan Reddy, janardhan reddy daughter's wedding, brahmini wedding, amit shah, karnataka BJP Leaders, PM modi, black money, demonetisation, atm withdrawal charges, bengaluru palace, bengaluru india news

The BJP high command has been directed to stay away from Gali Janardhan Reddy's daughter's wedding, to keep in line with the PM Modi's campaign against black money

గాలి వారింట పెళ్లికి బీజేపి పెద్దలు దూరం..?

Posted: 11/15/2016 05:59 PM IST
Bjp leaders to stay away from janardhan reddy s daughter s lavish wedding

కేంద్ర ప్రభుత్వం అవినీతి, నల్లధనంపై సాగిస్తున్న యుద్దం నేపథ్యంలో దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రానికి అండగా నిలబడిన సామన్యులను ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోవద్దని బీజేపి పెద్దలు భావిస్తున్నట్లు వున్నారు. ఇప్పటికే ఒకవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు కేంద్ర నిర్ణయంపై దుమ్మెత్తి పోస్తున్న తరుణంలో ఎలాంటి వివాదాలు, వివాదాస్పద వ్యవహరాల జోలికి వెళ్లవద్దని బీజేపి పెద్దలు నిర్ణయించుకున్నారు.

బీజేపీకి చెందిన కీలక వ్యక్తులతో పాటు తమ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా పారిశ్రామిక వేత్తలకు ఇప్పటికే సమాచారం అందించి.. వారంతా సర్ధుకున్నాక కేంద్ర పెద్ద నోట్లపై రద్దు నిర్ణయం తీసుకుందని విమర్శలు వస్తున్నాయి. ఇక మరికోందరు అన్ని పెద్దనోటులో అవినీతి నిర్మూలిద్దామన్న కేంద్రం.. ఎలా రెండు వేల రూపాయలను అందుబాటులోకి తీసుకువస్తుందని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ తరుణంలో బీజేపి పెద్దలు వివాదాలకు తావులేనివిధంగా వ్యవహరించాలని బీజేపి నిర్ణయించింది.

ఇందులో భాగంగా గనుల అక్రమాలకు పాల్పడి వేల కోట్ల రూపాలను అక్రమంగా సంపాదించారని అభియోగాలను ఎదుర్కోన్న మాజీ మంత్రి గాలిజనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహ వేడుకలకు కూడా దూరంగా వుండాలని భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ నేతలకు అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడ్యూరప్పకు ఫోన్ చేసి ఈ విషయంపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.

గాలి కుమార్తె వివాహానికి హాజరు కావాలా? వద్దా? అని సతమతమవుతున్న బీజేపీ నేతలు అధిష్టానం ఆదేశాలతో వెనక్కు తగ్గే అవకాశముంది. ఈ వివాహానికి హాజరైతే అది ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదం ఉందని అధిష్టానం పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎంతో అట్టహాసంగా జరుగుతున్న వివాహానికి ప్రధాని, అమిత్ షా సహా రాష్ట్ర బీజేపి నేతల హాజరు కూడా కష్టమేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

ఇదిలావుండగా గాలి జనార్థన్ రెడ్డికి కూడా నోట్ల రద్దు విషయం ముందుగానే లీక్ అయ్యిందని, ఈ నేపథ్యంలో ఆయన ముందుజాగ్రత్త తీసుకున్నాడని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరో ఏఢాది సమయంలో రానున్న ఎన్నికలకు కర్ణాటకలో ఇప్పటి నుంచే వేడి రగులుతుందని, ఈ నేపథ్యంలో అటు పార్టీ విజయావకాశాల కోసం కూడా గాలి జనార్థన్ రెడ్డి డబ్బులను పక్కకు తీసి పెట్టారని, ఎన్నికల సమయంలో ఆయన ఆ డబ్బును తీసి ఖర్చుచేస్తారని కూడా గుసగుసలు గుప్పుమంటున్నాయి. అయితే ప్రస్తుతం ప్రజలు డబ్బుల కోసం అవస్థలు పడుతున్నారని, ఈ తరుణంలో పెళ్లికి హాజరుకాకుండా, ప్రజలు విషయాన్ని మర్చిపోయిన తరువాత ఆయన సేవలను పార్టీకి వాడుకోవచ్చునని కూడా పార్టీ భావిస్తున్నట్లు వార్తలు పార్టీ వర్గాలు సంచరిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gali Janardhan Reddy  brahmini wedding  amit shah  BJP Leaders  PM modi  black money  karnataka  

Other Articles