రూ. 6వేల కోట్ల సరెండర్ పై అనుమానాలు..? Doubts araise on PM Modi's friend surrender Rs 6,000 crore?

Doubts araise on pm s friend surrender rs 6 000 crore in old currency

India's wealthiest jeweller, Laljibhai Patel, Rs 6000 crores, black money, demonetisation, rbi rules, atm waiver, atm withdrawal, Delhi, pm modi demonetisation, demonetisation rules, rbi demonetisation, atm demonetisation, atm waiver, atm withdrawal, atm withdrawal charges, india news

Laljibhai Patel, ranked among ranked India's wealthiest jewellers, according to unverified reports, surrendered Rs. 6,000 crore in cash to the government.

రూ. 6వేల కోట్ల సరెండర్ పై అనుమానాలు..?

Posted: 11/15/2016 03:39 PM IST
Doubts araise on pm s friend surrender rs 6 000 crore in old currency

అవినీతి, నల్లధనం, నకిలీ నోట్లను కూకటివేళ్తో పెకిలించివేస్తామని ఈ నెల 8న కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అప్పటి నుంచి చేస్తున్న ప్రకటనలు కేవలం కంటి తుడుపు చర్యలుగానే మారుతున్నాయి. ఈ తరుణంలో అక్కడక్కడా రద్దు చేసిన నోట్లు పంఫిణీ, ఒకటి రెండు ప్రాంతాల్లో వాటిని బుగ్గిపాలు చేశారన్న వార్తలు తప్ప.. ఇప్పటి వరకు నల్లధన కుబేరులు ఎవరూ ప్రభుత్వానికి చిక్కలేదు. అయితే నల్లధనంపై అధికారంలోకి రాకముందు నుంచి ఎన్నికల హామీని ఇచ్చినని.. దానిని అమలు చేయకపోతే ప్రజలు తనను పట్టించుకోరని కూడా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇటీవల గోవాలో చెప్పారు.

అయితే ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు ముందు నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అక్కడ నల్లధన కుబేరులను చూసి.. ఇక దేశమంతా అలానే వుందని భావించారా..? అందుకనే నల్లధన విషయంలో కఠినంగా వ్యవహరించారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గుజరాత్, హర్యానా, ఆ పరిసర రాష్ట్రాలకు చెందిన పలువురు బడా వ్యాపారులు కుబేరుల దర్ఫం అనుభవిస్తున్నవారు కావచ్చు.. అయితే వారు నల్లధన కుబేరులేనా కాదా అన్నది కేంద్రం పరిధిలో వున్న పలు ప్రభుత్వ శాఖలు తేల్చాల్సి వుంది.

ముఖ్యంగా ప్రధానికి మంచి మిత్రులైన వ్యాపారస్థుల జోలికి దేశ సర్వోన్నత న్యాయస్థానం అభివర్ణించిన పంజరంలో చిలుకగా వున్న శాఖలకు వెళ్లే ధైర్యమే లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు ప్రధాని నరేంద్రమోడీతో పాటుగా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు కర్సెన్సీ మార్పిడి విషయాన్ని తమ అనుకూల వ్యక్తులకు ముందుగానే లీక్ చేశారన్న అభియోగాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ అభియోగాలను కేంద్రంతో పాటు అర్బీఐ పెద్దలు తోసిపుచ్చుతూ అత్యంత గోప్యంగా తమ ప్రణాళికను అమలు చేశామని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ బీజేపి నేత తమ అకౌంట్ లో ప్రధాని ప్రకటనకు కొన్ని గంటల ముందు మూడు కోట్ల రూపాయలను ఎలా తన అకౌంట్ లో వేశారన్న ప్రశ్నలు సైతం ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధానికి అత్యంత సన్నిహితుడైన, సంపన్నుడైన వజ్రాల వ్యాపారి లాల్జీ భాయ్ పటేల్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. దేశంలోనే అత్యంత సంపన్నులైన వ్రజాల వ్యాపారుల జాబితాలో అగ్రబాగాన నిలచేవారిలో ఈయన ఒకరు.

కాగా, వజ్రాల వ్యాపారిగా కన్నా కూడా ఈయన మరింతంగా పాపులర్ అయ్యింది మాత్రం ప్రధాని నరేంద్రమోడీకి బహుకరించిన సూట్ వల్లేనన్నది దేశమెరిగిన సత్యం. భారత పర్యటనకు అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామా వచ్చిన సందర్భంగా చకచకా డ్రెస్ లను మార్చిన ప్రధాని.. అయతో భేటీలో మాత్రం ఆయన పేరుతో వేసుకున్న సూట్ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో అప్పట్లో ప్రధానిపై విమర్శలు వెల్లివిరిసాయి. అది కేవలం 14 లక్షల సూట్ అని, దానిని తన మిత్రుడు లాల్జీభాయ్ పటేల్ బహుకరించారని బీజేపి వర్గాలు చెప్పడంతో ఆ అంశాన్ని పక్కన బెట్టారు. అయితే ఆ సూట్ ఖరీదు 14 లక్షలు కాదు ఏకంగా నాలుగు కోట్ల ముఫ్పై లక్షల ఫైమాటేనని తరువాత తెలుసుకుని విస్మయం చెందారు. ఇలా లాల్జీభాయ్ పటేల్ అప్పట్లో వార్తల్లో నిలిచి భారత ప్రజలకు పరిచితులుగా మారారు.

అయితే మళ్లీ రమారమి రెండేళ్ల తరువాత కూడా ఆయన వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి ఏకంగా ఆయన కూడా నల్లకుబేరుడేనని తేలిపోయేలా వార్తల్లో నిలిచారు. పలు జాతీయ మాద్యమాలు, సామాజిక మాద్యమాల్లో ఇప్పుడీ అంశమే హల్ చల్ చేస్తుంది. ప్రధానికి 4 కోట్ల రూపాయల సూట్ ను బహుకరించేంత చనువు వున్న లాల్జీభాయ్ పటేల్ ఏకంగా 6000 కోట్ల రూపాయల నల్లధనాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేశారన్న వార్త సంచలనంగా మారింది.

ప్రభుత్వం నిషేధించిన వెయ్యి, 500 రూపాయల కరెన్సీతో కూడిన నల్లధనం ఏకంగా అరు వేల కోట్ల రూపాయలను ఆయన ప్రభుత్వానికి సరెండర్ చేశారన్న వార్తలందుతున్నాయి. అయితే ఇక్కడే దేశ ప్రజలుకు పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ వార్తను అధికారికంగా ప్రభుత్వ వర్గాలు ఇంకా దృవీకరించలేదు. అవినీతిపై పోరాటంలో ఎంతవరకైనా వెళ్తాం అన్న ప్రధాని మోడీ.. తన మిత్రుడైన లాల్జీభాయ్ పటేల్ ఇచ్చిన నాలుగు కోట్ల రూపాయల సూట్ ను తీసుకునేప్పుడు ఆయన ఎందుకు బహుమానం ఇస్తున్నారో తెలుసుకోకుండానే దానిని ధరించారా..? అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి.

ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముందుగానే లీక్ అయ్యిందన్న సమాచారం కూడా దేశ ప్రజలలో చక్కర్లు కోడుతున్న క్రమంలో సూట్ మిత్రుడికే విషయాన్ని చెప్పలేదన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపాలన్న ఉద్దేశ్యంతో ఈ తరహా ప్రచారం జరుగుతుందా..? అన్న అనుమానాం కూడా ఉత్పన్నమవుతుంది. మరోవైపు గత వారం రోజులుగా ఎక్కడ పెద్దస్థాయిలో నల్లధనం బయటకు రాకపోవడంతో.. విదేశాలలో వున్న నల్లధనం విషయంలోనే కాదు.. స్వదేశంలో వున్న నల్లధనం విషయంలోనూ విఫలమైందన్న టాక్ రాకూడదనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇలా చేస్తుందా..? అన్న సందేహాలు కూడా రేకెత్తుతున్నాయి.

కాగా, విదేశాలలో మూలుగుతున్న నల్లధనం విషయంలో కేంద్రంలోని మోదీ సర్కార్ ఇచ్చిన విధంగానే ఇక్కడ కూడా అలాంటి స్కీం అమలు చేస్తుందా..? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. నల్లధనం వున్న కబేరులు తమ సొమ్మను ప్రభుత్వానికి సరెండర్ చేస్తే.. పది శాతం డబ్బును ఎలాంటి జంకు బొంకు లేకుండా ధైర్యంగా వైట్ గా మార్చుకోవచ్చన్న సందేశాన్ని నల్లకుబేరులకు పంపాలన్న ఉద్దేశంతో ఈ లాల్జీబాయ్ పటేల్ ను ఉదాహరణగా చూపించిందా..? అన్న అనుమానాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే విదేశాలలోని నల్లధనాన్ని వైట్ గా మార్చుకునేందుకు కేంద్రం ఫెయిర్ అండ్ లవ్లీ స్కీం ను తీసుకువచ్చిందని విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఇంకా పలు ప్రశ్నలు విపక్షాలు రేకెత్తుతున్నాయి.

* తన మిత్రడు లాల్జీభాయ్ పటేల్ నల్లధన కుభేరుడని ప్రధానికి తెలియదా..?
* ఎలాంటి లాభాపేక్ష లేకుండానే రూ.4.3 కోట్ల సూట్ ఎందుకిచ్చారు.?
* నల్లకుబేరుడు ఇచ్చిన సూట్ ధరించడంలో మోడీ అంతర్యమేమిటి..?
* అవినీతి మిత్రుడుని చంకలో పెట్టుకుని దేశప్రజలకు సూక్తులా..?
* క్యాబినెట్ లో అక్రమార్కుడైన సుజనా చౌదరికు స్థానం ఎలా ఇచ్చారు..?
* బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన విజయ్ మాల్యాపై సర్జికల్ స్ట్రైక్ ఎందుకు జరపలేదు..?
* ఎన్నికల హామీలో కరెన్సీ మార్చుతానని చెప్పారా..?
* స్విస్ బ్యాంకుల్లో వున్న నల్లడబ్బును తీసుకోచ్చారా.?
* స్విస్ బ్యాంకులతో పాటు విదేశాల్లో వున్న నల్లధనం మనది కాదా..?
* నల్లధనం తేవడంలో 100 రోజుల్లో కాదు రెండున్నరేళ్ల సమయం కూడా సరిపోదా..?
* ప్రతీ పేదవాడి ఖాతాలోకి రూ. 15 లక్షలు వేశారా.?
* దేశంలో అసలు పేదవారు లేరన్న మోడీ ప్రభుత్వం భావిస్తుందా..?
* ప్రజలను ఇబ్బంది పేడితేనే ప్రభుత్వం విలువ తెలుస్తుందని కేంద్రం బావిస్తుందా..?
* పెద్ద నోట్ల రద్దుతో నిజంగానే అవినీతి పోతుందా..?
* చిన్న కరెన్సీలతో అవినీతిపరులు లంచాలను తీసుకోరా..?
* నోట్ల రద్దు ప్రభావం భారత ప్రగతిపై పడదా..?
* దేశం వెనుకబాటుకు బాధ్యత తీసుకునేదెవరు.?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles