బిజెపికి చంద్రబాబు షాకిస్తాడా.? | Will Chandrababu Naidu give shock to BJP

Will chandrababu naidu give shock to bjp

Chandrababu Naidu, AP, Rajya Sabha, Elections, BJP, బిజెపి, రాజ్యసభ, ఏపి, ఆంధ్రప్రదేశ్

May be AP CM Chandrababu Naidu give shock to BJP in Central. On Rajya Sabha elections TDP and BJP seats are creating new rumours between both parties.

బిజెపికి చంద్రబాబు షాకిస్తాడా.?

Posted: 05/18/2016 01:04 PM IST
Will chandrababu naidu give shock to bjp

బీజేపీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు షాక్ ఇవ్వనున్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చే ప్రశ్నేలేదని తేల్చి చెప్పిన కమలనాధులకు రాజ్యసభ సీటు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చింది.వెంటనే బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌కు ఓ రాజ్యసభ సీటును ఇచ్చారు.ఆ స్థానం కాంగ్రెస్ నేత నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి మరణంతో ఖాళీ అయింది. ఈ సీటుకు చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్ ను ఎంపిక చేశారు. ఇక నిర్మాలా సీతారామన్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది.

ఇదిలాఉండగా మళ్లీ రాజ్యసభకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో మళ్లీ నిర్మాలా సీతారామన్ కు రాజ్యసభ సీటు ఇచ్చే ప్రతిపాదన ఏమీ లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పేశారు.ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమకు రాజ్యసభ సీటుపై బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని చెప్పారు. ఇదిలాఉండగా.. ఏపీ భవన్ లో చంద్రబాబును కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ మర్యాద పూర్వకంగా కలిశారు. వీరి భేటీ అనంతరమే ఏపీ ముఖ్యమంత్రి రాజ్యసభ సీటుపై ఎలాంటి ప్రతిపాదన లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇక తనను కలిసిన నిర్మాలా సీతారామన్ తో కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles