ఆ పదవి కోసం బొత్స ఆరాటం..?! | bosta Satyanaraya may trying to get that position

Bosta satyanaraya may trying to get that position

YSRCP, Bosta Satyanarayana, Bosta, YSRCongress, Jagan, బొత్స, జగన్, ఏపి, బొత్స సత్యనారాయణ

Soon, YSRCP party will get one Rajyasabha seat. YSRCP senior Leader Bosta SatyaNarayana expecting for that seat.

ఆ పదవి కోసం బొత్స ఆరాటం..?!

Posted: 05/20/2016 12:51 PM IST
Bosta satyanaraya may trying to get that position

ఏపి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టిడిపిలోకి ఇప్పుడు వైసీపీ నాయకులు క్యు కడుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయారు. వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో పార్టీలో జగన్ తర్వాత మంచి పట్టుతెచ్చుకున్న నాయకుడు బొత్స సత్యనారాయణ. ఎంతో క్రీయాశీలంగా వ్యవహరిస్తున్న బొత్స సత్యనారాయణ ఓ పదవి మీద మనసుపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ ను మెప్పించి ఎలాగైనా ఆ పదవిని దక్కించుకోవాలని బొత్స ట్రైచేస్తున్నారని తెలిసింది.

ఇంతకీ బొత్స ఆశిస్తున్న ఆ పదవి ఏంటా అనుకుంటున్నారా..? రాజ్యసభ సీటు. అవును త్వరలోనే పార్టీకి దక్కబోయే ఒకే ఒక్క రాజ్యసభ సీటును తనకు కేటాయించాలని బొత్స సత్యనారాయణ జగన్ ను కోరారట. ఆల్రెడీ ఈ సీటును విజయసాయిరెడ్డికి ఇవ్వడానికి జగన్ అంగీకరించాడని… ఇదే విషయాన్ని ఆయన పార్టీ నేతలకు నేరుగా చెప్పారని ప్రచారం సాగుతోంది. అలాంటిది బొత్స సత్యనారాయణ మళ్లీ ఇలాంటి డిమాండ్ తెరపైకి తీసుకురావడం జగన్ కు కూడా ఆశ్చర్యం కలిగిస్తోందని సమాచారం. మరి… చివరి నిమిషంలో విజయసాయికి పోటీగా వస్తున్న బొత్స సత్యనారాయణ అనూహ్యంగా పెద్దల సభకు వెళ్లే అవకాశం దక్కించుకుంటాడేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles