రాజకీయాల్లో ఎవరిని తమ ఆదీనంలో పెట్టుకుంటే మంచిదో... ఎవరిని వ్యతిరేకిస్తే మంచిది కాదో బాగా తెలిసి ఉండాలి. అలాంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీలో వేల సంఖ్యలో ఉన్నారు. మిగిలిన పార్టీల్లో లేరు అని దీనర్థంకాదు. తాజాగా మన తెలుగు తేజం వెంకయ్య నాయుడు మీద మోదీ పట్టుసాధించాడని... ఆయన చిట్టా మొత్తం మోదీ జేబులో ఉందని వార్త షికారు చేస్తోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటీ అంటే తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో కీలకంగా ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కు సంబందించిన ఆస్తుల వివరాలను మోదీ తెప్పించుకున్నారని.. వాటి మీద ఓ కన్నేసినట్లు తెలుస్తోంది.
వెంకయ్య. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి, రాజకీయ చతురతకు, తెరవెనుక రాయబేరాలకు పెట్టింది పేరైన వెంకయ్యనాయుడుకు కమలనాథుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందట. జాతీయ స్థాయిలో పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులతో వెంకయ్యనాయుడుకు బలపడిన ఆర్థిక సంబంధాల నేపథ్యంలో పలుకుబడి పలుచనైందని ప్రచారం సాగుతోంది. ఏపీ బీజేపీలో వెంకయ్యనాయుడు వ్యతిరేకవర్గం పనిగట్టుకుని మరీ వెంకయ్య కు సంబందించిన వివరాలను మోదీకి చేరవేసినట్లు సమాచారం. ఈ విషయం వెంకయ్య నాయుడుకు కూడా తెలిసిందట.
దీనికనుగుణంగా మంత్రిపదవి ఉండగానే అన్నీ చక్కబెట్టుకోవాలనే ఆత్రంతో ఉన్నారట. ఈ తొందరలో భారీ డీల్స్‌కు తెరతీశారట. ఇదే వెంకయ్య కొంపముంచిందని తెలుస్తోంది. వెంకయ్య మంత్రిపదవి వచ్చిన తరువాత భారీగానే వెనకేశారని సాక్షాత్తు ప్రధాని నిఘా బృందం గుర్తించిందట. వెంకయ్యనాయుడు మంత్రి అయిన తరువాత కుమారుడు హర్షవర్థన్ 40 కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నారట. ఆయన ఆస్తుల విలువ వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని అంచనాకొచ్చారట. స్వర్ణభారత్ ట్రస్ట్ పేరుతో కుమార్తె దీప కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉందట. తెలంగాణ సీఎం కుమారుడు కేటీఆర్‌తో కలిసి, వెంకయ్య కొడుకు వాహనాల స్కాం చేశాడని నేషనల్ మీడియాలో అప్పట్లో కథనాలొచ్చాయి. మొత్తం మోదీ వెంకయ్య నాయుడు మీద కూడా నిఘా ఉంచారని. ఏదో టైంలో బాంబ్ పేలుస్తాడని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more