కాంగ్రెస్ లోకి రేవంత్.. టిఆర్ఎస్ లోకి ఎల్.రమణ | Will Revanth joins Congress and Ramana into TRS

Will revanth joins congress and ramana into trs

Revanth Reddy, Ramana, Telangana, TDP, Chandrababu, TRS, రేవంత్ రెడ్డి, టిడిపి, తెలంగాణ, చంద్రబాబు, టీఆర్ఎస్

Telangana TeluguDesam Party getting ready to loose some more main leaders. In TDP senior leaders discussing about Ramana and Revanth Reddy.

కాంగ్రెస్ లోకి రేవంత్.. టిఆర్ఎస్ లోకి ఎల్.రమణ

Posted: 05/11/2016 12:26 PM IST
Will revanth joins congress and ramana into trs

అసలే వెంటిలేటర్ మీదున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్ తగలనుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీని వ్యవస్థాగతంగా దెబ్బతీసిన టిఆర్ఎస్ ఉన్న నలుగురు నాయకులను కూడా ఛిన్నాభిన్నం చెయ్యడానికి పావులు కదుపుతోందని తెలుస్తోంది. అధికార టీఆర్ఎస్ ను దెబ్బతీయ‌డానికి ప్రయ‌త్నించి అధః పాతాళానికి ప‌డిపోయిన టీడీపీని బ‌ల‌ప‌ర్చేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ మాత్రం ప్రయ‌త్నించ‌క‌పోవ‌డం, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట‌కే విలువ ఇస్తున్న నేప‌థ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్.ర‌మ‌ణ పార్టీని వీడేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ఇప్పటికే మంత్రి హ‌రీష్ రావుతో చ‌ర్చలు పూర్తయ్యాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల‌లో వినిపిస్తోంది.

ఓటుకునోటు కేసులో అడ్డంగా దొరికిపోయనా ఆంధ్రా మీడియా అండ‌తో రెచ్చిపోయిన రేవంత్ వ్యవ‌హారం చూసి టీడీపీ ఎమ్మెల్యేలంతా పార్టీని వీడ‌డంతో రేవంత్ రెడ్డి చ‌ప్పబ‌డ్డాడు. ప‌స‌లేని ఆరోప‌ణ‌ల‌తో ప్రెస్ మీట్లకే ప‌రిమితం అయిన రేవంత్ తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీతో క‌లిసి ప‌నిచేయ‌డం ఆ పార్టీ నేత‌ల‌కే రుచించ‌డం లేదు. పైగా తాను కాంగ్రెస్ లో చేర‌న‌ని, టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకే కాంగ్రెస్ తో ప‌నిచేస్తున్నాన‌ని ప్రక‌టించ‌డం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ప‌దేళ్లు అధికారంలో ఉండి అంతులేని అక్రమాల‌కు పాల్పడి కేసుల్లో ఇరుక్కున్న కాంగ్రెస్ తో క‌లిసి రెండేళ్ల క్రితం అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్ ను ఎదిరించ‌డం ఏంట‌ని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ కాంగ్రెస్ తో క‌లిసి ప‌నిచేయ‌డం ఏంట‌ని, తెలంగాణ‌లో టీడీపీకి పుట్టగ‌తులు లేవ‌ని గ్రహించిన రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ తో తిరుగుతూ వారికి ద‌గ్గర‌య్యి అందులో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడ‌ని టీడీపీ వ‌ర్గాలు అంటున్నాయి. మొత్తానికి కొంచెం వెన‌కా ముందు రేవంత్ కాంగ్రెస్ లోకి ..ర‌మ‌ణ టీఆర్ఎస్ లోకి చేర‌డం ఖాయం అని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles