Will modi come to Nitesh Kumars oath

Will modi come to nitesh kumars oath

modi, Nitesh Kumar, Bihar, Bihar Elections, Modi to Nitesh Kumar oath, Bihar Polls

Though the official announcement is awaited, JD(U) Nitish Kumar in all likelihood would take oath as the new chief minister of Bihar on November 20. “People are busy with Diwali and after that comes the Chhath festival which ends on November 18. So oath of the new government in all likelihood will be administered after Chhath,” state JD(U) President Basistha Narayan Singh told.

నితీష్ ప్రమాణానికి మోడీ వస్తారా?

Posted: 11/11/2015 06:18 PM IST
Will modi come to nitesh kumars oath

బీహార్ శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించడంతో ముచ్చటగా మూడోసారి జేడీయూ అధినేత నితీష్‌కుమార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారం కార్యక్రమం ఈ నెల 20న జరగనుంది. అయితే నితీష్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, ఎల్‌కే అద్వానీకి ఆహ్వానం పంపనున్నట్లు జేడీయూ నేత వశిష్ఠ నారాయణ్‌ సింగ్ పేర్కొన్నారు. మరీ ఘోర ఓటమి చవిచూసిన మోడీ నితీష్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే సొంత పార్టీ నేతలే మోడీపై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఇక నితీష్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాపీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ హాజరు కానున్నారు.

బీహార్ ఎన్నికల ఫలితాలు బిజెపి పార్టీ ముఖ్య నేతలకు కూడా దిమ్మతిరిపోయేలా చేశాయి. బీహార్ ఎన్నికలు మోదీ మీద విమర్శల వర్షం కురిపిస్తోంది. మోదీ చరిష్మా తగ్గిందని.. కనీసం ఇప్పటికైనా పర్యటనల మీద కాకుండా పాలన మీద దృష్టిసారించాలని మోదీ వ్యతిరేకులు, ప్రత్యర్థులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. మరి నితీష్ కుమార్ గెలుపుతో మారిన మోదీ చరిష్మా కొలమానానికి మోదీ చేస్తారు అన్నది రెండో విషయం.. అంతకన్నా ముందు మోదీ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి వస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే మోదీ దగ్గరి వాళ్లు మాత్రం ఖచ్చితంగా మోదీరారని.. అంటున్నారు. కానీ మోదీ వ్యతిరేకం వర్గం మొత్తం అక్కడే ఉంటుందని అందరికి తెలిసిన నిజం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  Nitesh Kumar  Bihar  Bihar Elections  Modi to Nitesh Kumar oath  Bihar Polls  

Other Articles