KCR very afraid of Pawan Kalyan

Kcr very afraid of pawan kalyan

Telangana, KCR, GHMC, GHMC elections,Pawan Kalyan, Janasena, Farmers, AP, Chandrababu Naidu, YSRCP, Jagan

Telangana cm KCR afraid of Janasena Party President Pawan Kalyan. If Pawan kalyan party will contest in the GHMC elections then TRS will loose the vote bank.

పవన్ వల్ల కేసీఆర్ కు ముప్పు తప్పదా..?

Posted: 11/12/2015 03:00 PM IST
Kcr very afraid of pawan kalyan

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వల్ల ముప్పు పొంచి ఉంది... ఎవరికి అనుకుంటున్నారా..? ఇంకెవరికి తెలంగాణ సిఎం కేసీఆర్ కు. అవును పవన్ కళ్యాణ్ వల్ల కేసీఆర్ కు నష్టం తప్పదు అని అప్పుడే చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇలా ఎందుకు అనుకుంటున్నారా... ? గతంలో ఏపిలో పవన్ కళ్యాణ్ దెబ్బకు వైయస్ఆర్ సిపి పార్టీకి గట్టి దెబ్బ పడింది. చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా పవన్ చేసిన ఎన్నికల ప్రచారం వైసీపీ ఓట్లకు గండి కొట్టింది. ఎన్నికలకు ముందే పవన్ తో పొత్తు పెట్టుకున్నచంద్రబాబు ముందు నుండి కూడా పవన్ కు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఎన్నికల్లో పవన్ వల్ల ఓట్లను, సీట్లను కూడా సొంతం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. అయితే పవన్ కళ్యాణ్ వల్లే తమ పార్టీ ఓట్లు కూడా తెలుగు దేశం, ఎన్డీయే పక్షానికే పడ్డాయని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపిలో వైసీపీ మాదిరిగానే తెలంగాణలో కేసీఆర్ కు, టిఆర్ఎస్ పార్టీకి తీరని నష్టం కలుగుతుందని భావిస్తున్నారు.. భయపడుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ తిరుగులేని పార్టీగా ఎదిగింది. ఎన్నికల్లో తెలంగాన ప్రజలు తిరుగులేని మెజార్టీని అందించి కేసీఆర్ ను అధికార పీఠానికి చేరువచేశారు. కానీ తర్వాత కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. తాజాగా పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి అడుగు పెడితే ఏపిలో వైసీపీ పరిస్థితే తమక్కూడా వస్తుందని భయపడుతున్నారట. గ్రేటర్ ఎన్నికల బరిలో నిలవాలని బిజెపి పార్టీ నాయకులు పవన్ కు చేసిన సూచనకు సానుకూలంగా స్పందించారని.. చంద్రబాబుతో భేటీలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి దిగే అంశం మీద చర్చించనున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో టిఆర్ఎస్ నాయకుల్లో గుబులు మొదలైంది. మరి పవన్ తెలంగాణలో అడుగుపెడితే ఎవరి పంచాలు ఊడుతాయో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCp  Jagan  KCR  Pawan Kalyan  GHMC  GHMC Elections  

Other Articles