Chandrababu Naidu will give shock to Modi

Babu shocks modi

Chandrababu, Modi, NDA TDP, BJP, Modi with Chandrababu Naidu, TDP with NDA, AP, Special status, Package, Special package to AP, Modi about AP

May AP CM Chandrababu Naidu give shock to Modi. After defeat in Bihar election, Modi facing bad time.

మోదీకి తర్వాత షాకిచ్చేది చంద్రబాబేనా...?

Posted: 11/10/2015 01:39 PM IST
Babu shocks modi

ప్రధాని నరేంద్ర మోదీకి షాక్ తగిలింది. బీహార్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైంది. పార్టీని ముందుండి నడిపించడంలో మోదీ విఫలమయ్యారు. అయితే బీహార్ లో పార్టీ ఓడిన తర్వాత నిరసన గళాలు, విమర్శలు వినిపించాయి. మోదీ వైఖరి వల్లనే ఇలా జరుగుతోందని కొన్ని మిత్రపక్ష పార్టీ నాయకులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో ఓటమికి సమిష్టి బాధ్యత వహిస్తూ పార్టీ అధినాయకత్వం ప్రకటన చేసింది. మరి అదే బీహార్ లో గెలిచి ఉంటే.. మోదీకి క్రెడిట్ దక్కేది కదా అలాంటప్పుడు వైఫల్యాన్ని కూడా అంగీకరించాలని విమర్శలు వినిపించాయి. అయితే తాజాగా సొంత పార్టీ నాయకులే మోదీ మీద విమర్శలకు దిగడం షాక్ కు గురిచేసింది. అయితే తర్వాత ఎవరు ఎలాంటి షాక్ ఇస్తారని మోదీ హడలిపోతున్నట్లు కొంత మంది అనుకుంటున్నారు. అయితే దీని మీద కొంత అనుకుంటున్న పేరు చంద్రబాబు.

Also Read: వంగవీటి రంగ హత్య వెనుక చంద్రబాబు హస్తం.. టీడీపీ మాజీ మంత్రి స్పష్టం

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు మోదీకి త్వరలోనే షాక్ ఇస్తున్నారని సమాచారం. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున చాలా ఆశించినా... మోదీ మాత్రం మొండిచెయ్యి చూపిస్తూనే ఉన్నారు. అయితే మరి బీహార్ ఎన్నికల తర్వాత మోదీకి షాక్ ఇచ్చేది చంద్రబాబు నాయుడే అనే వార్త వస్తోంది. ఎందుకు అంటే ఎన్డీయే కూటమిలో ఎన్నికల ముందే చేరి తన రాజకీయ చాణిక్యాన్ని చూపించారు చంద్రబాబు నాయుడు. కానీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ ఏపికి, చంద్రబాబు నాయుడుకు ఏ మాత్రం చేయూతనందించడం లేదు.

Also Read: ఆ ఊళ్లు నవ్వుతున్నాయి.. కారణం చంద్రబాబు

ప్రత్యేక హోదా దగ్గరి నుండి ఆర్థికంగా ఆదుకునే వరకు అన్నింటా మోదీ సర్కార్ ఏపిని మోసం చేస్తే వస్తోంది. అయితే ఏపిలో ప్రతిపక్షాలు కాస్త గట్టిగా ప్రశ్నిస్తుండటం.. ప్రజలు కూడా మోదీ సర్కార్ నుండి ఏదో ఆశిస్తున్నా కానీ కనీసం కంటి తుడుపు చర్యగా కూడా ఏమీ చెయ్యలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశ రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకే మోదీ సర్కార్ మొండి చెయ్యి చూపిస్తుండటం కోపానికి కారణం అని తెలుస్తోంది. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులను కేంద్ర ప్రభుత్వం నుండి క్విట్ చెయ్యాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందు ఎన్డీయే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసి.. అప్పటికి పని కాదు అని అనిపిస్తే ఎన్డీయే కూటమి నుండి వైదొలగాలని చంద్రబాబు పథకం రచించినట్లు తెలుస్తోంది.

Also Read: దిల్లీలో రింగు తిప్పిన కేసీఆర్.. బాబు కన్నా బెటర్

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  AP  TDP  Modi  NDA  

Other Articles