Telangana cm KCR plays key role in delhi tour

Telangana cm kcr plays key role in delhi tour

Chandrababu Naidu, KCR, Modi, KCR Delhi Tour, Rajnath SIngh, Arun Jaitly, Delhi

Telangana cm KCR plays key role in delhi tour. Telangana cm KCR in Delhi tour. He met Modi, Arun Jaitly and Rajnath Singh. He got assurance on bifercation promises.

దిల్లీలో రింగు తిప్పిన కేసీఆర్.. బాబు కన్నా బెటర్

Posted: 10/29/2015 09:03 AM IST
Telangana cm kcr plays key role in delhi tour

దేశ రాజధాని దిల్లీలో కేసీఆర్ పర్యటన విజయవంతంగా సాగుతోంది. మోదీతో సహా పలువురు కీలక మంత్రులను కలిశారు. విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఇస్తామని ఇచ్చిన హామీల మీద హోంమంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని కేసీఆర్ కోరారు. విభజనలో భాగంగా చాలా సమస్యలు మిగిలిపోయాయని.. వాటిని వెంటనే పరిష్కరించాలని కూడా కోరారు. అయితే దిల్లీ పర్యటనలో కేసీఆర్ పని తీరు ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. మోదీ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కన్నా కూడా చాలా వరకు.. కేసీఆర్ తన పనిని వేగంగా చక్కబెట్టుకుంటున్నారని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రభావం ఎంత వరకు ఉంటుందో అందరికి తెలుసు.. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ కాబట్టి టిడిపి పార్టీకి అంటే చంద్రబాబుకు అధికంగా ప్రాధాన్యత ఉంటుందని అందరికి అనిపించినా వాస్తవానికి జరుగుతున్న వేరు.

దిల్లీలో మోదీతో సహా, అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ లతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. తమ రాష్ట్రానికి కావాల్సిన అన్ని అవసరాల మీద వారితో చర్చించారు. కానీ ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కేసీఆర్ కన్నా ఎక్కువ సార్లు దిల్లీ పర్యటన వెళ్లినా.. మోదీని కలిసినా కూడా కేసీఆర్ అంత వేగంగా పనులను చక్కబెట్టలేదన్నది చాలా మంది అనుకుంటున్న మాట. మొత్తానికి చంద్రబాబు నాయుడు కన్నా కూడా కేసీఆర్ పని తీరు అందరి మన్ననలు పొందుతోంది. మరి ముందుకూడా ఇలాగే దూకుడు ప్రధర్శిస్తారో చూడాలి కేసీఆర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  KCR  Modi  KCR Delhi Tour  Rajnath SIngh  Arun Jaitly  Delhi  

Other Articles