Will Amaravati get funds from central govt

Will amaravati get funds from central govt

AP, Amaravati, Central govt. venkaih naidu, Amaravati News, funds for Amaravati, Venkaiah Naidu on Amaravati, chandrababu, funds for Amaravati

Union Minister Venkaiah naidu said that central govt will give only moral support to new capitals. He said that central govt just support the new capital cities.

అమరావతికి నిధులు అందని ద్రాక్షేనా..!

Posted: 10/19/2015 04:43 PM IST
Will amaravati get funds from central govt

ఏపి నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నుండి నిధులను ఆశిస్తోంది ఏపి సర్కార్. అందుకు కేంద్రం నుండి దాదాపుగా సానుకూలంగానే ప్రకటనలు వచ్చాయి. అయితే ఏపికి ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే మీనమేషాలు లెక్కిస్తున్న కేంద్ర సర్కార్ మరోసారి ఏపిని, ఏపి ప్ర.జలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏపి రాజధాని అమరావతి నిర్మాణానికి దసరా నాడు ముహూర్తం కుదిరింది. అయితే అమరావతి నిర్మాణానికి కేంద్రం లక్షల కోట్ల రూపాయలను సాయం కింద అందిస్తుందని ఏపి సర్కార్ ఆశతో ఉంది. కానీ ఓ కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలు వింటే మాత్రం అదంతా ఆశే అనిపిస్తోంది. అసలు ఏపి రాజధాని అమరావతికి కేంద్ర సర్కార్ సాయం చేస్తుందా అనే అనుమానాలకు మరింత బలం చేకూరేలా కేంద్ర మంత్రి స్టేట్ మెంట్స్ ఉన్నాయి.

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రాజధాని నిర్మాణాల మీద, నూతన రాజధానుల ఏర్పాటు మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రదాని వరాలు ఇస్తారా?ఇవ్వరా అన్న ఊహాగానాలపై తాను స్పందించనని అన్నారు. అనవసరంగా మాట్లాడి ఆశలు కల్పంచడం నాకు ఇష్టం లేదు... ఆర్దిక వసతులు, మన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక తయారు చేసుకోవాలి అని వివరించారు. కొత్తగా నిర్మించిన నయారాయపూర్, అహ్మదాబాద్, డెహ్రాడూన్ లకు కేంద్రం వేల కోట్లు ఇవ్వలేదని.. సహకారం అందించిందని వెల్లడించారు. లక్షల కోట్లు అని నేను మాట్లాడను....ఆశలు పెంచి ఆ తర్వాత నెరవేర్చకపోతే నిరుత్సాహం వస్తుంది... కొత్త రాజదాని అవసరాలకు మించి కడితే చైనా అనుభవం ఎదురవుతుందని... అక్కడ నగరాలకు ,నగరాలకు ఖాళీగా ఉన్నాయని కూడా వెంకయ్య వివరించారు. మొత్తానికి ఏపి రాజధాని అమరావతికి వెంకయ్య నాయుడు మాటలను అన్వయించుకుంటే మాత్రం ఖచ్చితంగా నిధులు రావనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వెంకయ్య నాయుడు మాటలను పరిగణలోకి తీసుకుంటే మాత్రం అమరావతి నిర్మాణానికి కేవలం మోరల్ సపోర్ట్ మాత్రమే అందుతుందని సమాచారం. కేంద్రం నిధులు ఇస్తుందని ఆశలు పెట్టుకోవడం. తర్వాత నిధులు విడుదల కాకపోతే నిరాశ చెందడం ఎందుకు అన్న వెంకయ్య మాటలు ఏపి ప్రజలను ఉద్దేశించినవేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వెంకయ్య నాయుడు గతంలో ఏపికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని అన్నారు. కానీ తర్వాత మాత్రం మాట మార్చారు. మరి అమరావతి నిర్మాణానికి కేంద్రం నుండి నిధులు వస్తాయా.? వచ్చినా ఎన్ని వస్తాయి అన్నది అందరికి చర్చనీయాంశంగా మారింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles