AP CM Chandrababu Naidu anger on Galla Jayadev

Ap cm chandrababu naidu anger on galla jayadev

Galla Jayadev, Modi, Chandrababu, TDP, Galla, AP, Special status, Babu, Modi speech, Galla Jayadev speech

Guntur MP Galla Jayadev said contraversial statements. He express his anger on Modis speech at Amaravati inauguration ceremony.

చంద్రబాబుకు గల్లా జయదేవ్ తలనొప్పి.?!

Posted: 10/23/2015 01:14 PM IST
Ap cm chandrababu naidu anger on galla jayadev

తల్లికి తిండి పెట్టలేనోడు.. సవితి తల్లికి వెండి గాజులు కొనిస్తాడన్నట్లుగా ఉందట తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఏపి రాజధాని అమరావతి శంకుస్థాపనకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసి.. సక్సెస్ ఫుల్ గా శంకుస్థాపన కార్యక్రమాన్ని ముగించారు చంద్రబాబు. కానీ అందరిని పిలిచిని చంద్రబాబు అందరి మన్ననలు పొందినా.. శంకుస్థాపన ముగిసిన ఒక రోజు తర్వాత అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయి. దాంతో ఆ సదరు నేత చంద్రబాబు మీద గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో శిలాఫలకంపై ఎంపీల పేర్లు ముద్రించకపోవడం గల్లా జయదేవ్ ను బాధించింది. ఈ విషయాన్ని ఆయన పరోక్షంగా చెప్పకనే చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శంకుస్థాపనకు కార్యక్రమానికి ఆహ్వానించి, శిలాఫలకంలో ఆయన పేరుని చేర్చడంలో తప్పు లేదన్న జయదేవ్.. సర్పంచ్ లు, ఎమ్మెల్యేలు, ఎంపీల పేర్లు ఎందుకు మరిచారో తనకు అర్థం కావడం లేదన్నారు.

అంతేకాదు ప్రధాని స్పీచ్ పైనా గల్లా జయదేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాస్త ఘాటైన కామెంట్స్ వదిలారు. ప్రత్యేక హోదా ఎమోషనల్ ఇష్యూగా మారిందన్న ఆయన.. ప్రత్యేక హోదా రానప్పుడు రాష్ట్రానికి ఏం కావాలోముందు నుంచే అవగాహన ఉండాలని కూడా హితవు పలికారు. కనీసం భవిష్యత్ లో అయినా ఏపీకి మంచి ప్యాకేజీలు ఇస్తారని ఆశిస్తున్నట్టు జయదేవ్ ఆకాంక్షించారు. ఏది ఏమైనా రాజధాని ఎంపీగా ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ సమావేశాల్లో తన వంతు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. మొత్తంగా గల్లా జయదేవ్ కామెంట్స్ టీడీపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారాయి.

గల్లా జయదేవ్ నిరసన గళం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వద్దకు చేరిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంపై నిరసన వినిపించడమే కాక ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలే చేశారు. కేంద్ర ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉండి ఏమీ సాధించలేమని కూడా గల్లా వ్యాఖ్యానించారు. దీనిపై పూర్తి స్ధాయిలో సమాచారం అందుకున్న చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం రాజధాని కమిటీ సభ్యులతో భేటీ కానున్న చంద్రబాబు, ఈ వ్యాఖ్యలపైనా చర్చించే అకాశాలున్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు గల్లా వ్యాఖ్యలపై పెద్దగా చర్చ జరగకున్నా, రాజధాని కమిటీ భేటీ ప్రారంభమయ్యే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Galla Jayadev  Modi  Chandrababu  TDP  Galla  AP  Special status  Babu  Modi speech  Galla Jayadev speech  

Other Articles