For KCR's China Trip, A 2-Crore Ride at Taxpayer's Expense

Babu and kcr wasting tax payers money

KCR's China Trip, 2-Crore Ride at Taxpayer's Expense, Telangana govt spend Rs. 2 cr for KCR china Trip, kcr govt spend 2 crores for private executive jet, K.Chandshekar rao and Chandrababu Naidu in politics, KCR and Chandrababu comparision, KCR and Chandrababu Naidu political journey, KCR latest updates

For Chief Minister K Chandrasekhara Rao's trip to China next week, the Telangana government will spend over two crores - not on tickets, but on a private executive jet.

ప్రజాధనం దుబారా చేయడంలో పోటీ పడుతున్న చంద్రులు..!

Posted: 09/06/2015 09:16 PM IST
Babu and kcr wasting tax payers money

ప్రజాధనం దుబారా చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. రాష్ట్రం లోటు బడ్జెట్ లో వుందని.. రాజథాని నిర్మాణానికి స్వచ్చంధంగా విరాళాలు ఇవ్వాలని కోరిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పుష్కలంగా నిధులు వున్నాయని ప్రకటించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పోటీపడుతన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో వసతులకు, అమాత్యుల వసతులకు కోట్ల రూపాల ప్రజాధానాన్ని వెచ్చిస్తున్నారు. మంత్రుల బృందంలో కలసి రాజధాని నిర్మాణం కోసం విదేశీ పర్యటనలకు రెండు ప్రత్యేక విమానాలలో వెళ్లిన చంద్రబాబు ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారనన్న విమర్శలను ఎదుర్కోనగా.. ఇప్పుడు అదే భాటలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పయనిస్తున్నారు.

ఈ నెల 8న మంత్రుల బృందంతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలతో కలసి ఎనమిది రోజుల చైనా దేశ పర్యటనకు బయలుదేరనున్న కేసీఆర్.. ప్రజాధనంతో పయనానికి సిద్దమయ్యారు. చైనాలోని డాలియన్ సిటీలో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫారమ్ లో ఆయన పాల్గోననున్నారు. కేసీఆర్ పర్యటన నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 50 సీట్లు వున్న ప్రైవేటు ఎగ్జిక్యూటివ్ జెట్ విమానాన్నే బుక్ చేశారని సమాచారం. అంతేకాదు ఈ బొంబార్డియర్ సీఆర్జే-100 ఎయిర్ క్రాప్ట్ కు ముందుగానే రెండు కోట్ల మూడు లక్షల రూపాయల పైచిలుకు నిధులను కూడా అడ్వాన్స్ గానే విడుదల చేసింది.  

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం కేసీఆర్ ఈ పర్యటన జరుపుతున్నా.. కరువుతో తల్లడిల్లుతున్న రైతులు ఆత్మహత్యలు పాల్పడుతున్న సమయంలో ఈ పర్యటన అవసరమా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. రైతులకు పరిహారం ఇప్పించాలంటే మౌనం వహించిన కేసీఆర్ ప్రభుత్వం.. విదేశీయానాల కోసం కోట్ల రూపాయలను వృధా చేస్తుందని విపక్షాలు విమర్శలను అందుకున్నాయి. అది చాలదన్నట్లు రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలకు సుస్తి చేసి.. మలేరియా, డెంగ్యూ, అతిసార వ్యాధులతో కుస్తీ పడుతున్నాయిని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి

రెండు తెలుగు రాష్ట్రాలలోని ఇద్దరు చంద్రులు పోటీ పడి మరీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కూడా విమర్శలు వినవస్తున్నాయి. గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు వారి వారి అవసరాల కోసం, ముఖ్యంగా రక్షణ కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సులను కొనుగోలు చేశారు. అదీనూ మెర్సిడిస్ బెంజ్ కంపెనీకి ప్రత్యేకంగా ఆర్డరు ఇచ్చి మరీ చేయించుకున్నారు. ముందుగా కేసీఆర్ ఇలాంటి బస్సుకు ఆర్డరు ఇవ్వగా, అదే బాటలో నడిచిన చంద్రబాబు కూడా మరో కొత్త బస్సుకు అర్ఢరిచ్చిచేయించుకున్నారు. రాష్ట్రప్రగతిలో ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ పడితే బాగుండు అని తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుకుంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : K. ChandraShekar Rao  Chandrababu Naidu  Telangana  AP  

Other Articles