TDP MPs action agianst paven kalyan in babu s direction

Tdp mps lashes out at pavan kalyan in party chiefs direction

Pawan Kalyan victim of Chandrababu's use and throw policy..? use and throw is Telugu desam party policy, pavan kalyan, junior NTR, pavan kalyan on cash for vote case, section 8, hyderabad, cash on vote, phone tapping, media, revanth reddy, cash for vote, chandra babu, use and throw policy, revanth reddy, acb, sandra venkata veeraiah, Kcr, telangana mlc elections, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, horse riding

TDP parliament members criticises actor turned politician jana sena president power star pavan kalyan according to party chief and ap chief minister chandrababus direction

చంద్రబాబు డైరెక్షన్ లోనే టీడీపీ ఎంపీల యాక్షన్

Posted: 07/11/2015 08:02 PM IST
Tdp mps lashes out at pavan kalyan in party chiefs direction

ప్రశ్నించడానికే ఉద్బవించిన పార్టీ జనసేన. 1982లో తెలగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ.. తొమ్మిది నెలల్లోనే ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో.. అదే స్థాయిలో అంతకన్నా వేగంగా.. రాష్ట్రంలోని ప్రతీ పౌరుడిని అలోచింపచేసిన పార్టీ జనసేన. తెలుగు వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండుతున్న తరుణంలో.. తాను పార్టీని స్థాపించి.. తన పార్టీ పదవుల కోసం కాదని, కేవలం ప్రశ్నించడానికేనంటూ సమరశంఖాన్ని పూరించి.. అనుకున్నదే తడవుగా తన లక్ష్యాన్ని చేరారు పవన్ కళ్యాన్. అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గురించి ఏ మాత్రం తెలియని దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మోడీ ప్రభంజనాన్ని అందిపుచ్చుకుని ఆయనకు మద్దుతుగా ప్రచారం చేసి బిజేపి విజయానికి ప్రత్యక్షంగా కారణమయ్యారు పవన్.

రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించిందని, రాష్ట్రానికి గాఢాంధకారంలో పడేసిందని టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులు ఎంతగా గొంతుచించుకుని అరిచినా.. ప్రజలు మాత్రం టీడీపీ పట్ల ముబావంగానే వున్న పరిస్థితులు ఏపీలో కనిపించాయి. కాంగ్రెస్ పై కొపాన్ని వెళ్లగక్కిన ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపారు. ఒక దశలో నువ్వా నేనా అన్నట్లు సాగిన హోరాహోరు పోరులో పవన్ తమకు ప్రచారం నిర్వహిస్తేనే అధికారంలోకి వస్తామని తెలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. పవన్ ను తమ పార్టీ తరపున కూడా ప్రచారం చేయాలని అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన పవన్ టీడీపీకి కూడా ప్రచారం చేశారు.పవన్ కల్యాన్ ప్రసంగానికి రాష్ట్ర ప్రజలు సమ్మోహితులయ్యారు. అంతే కేంద్ర, రాష్ట్రాలలో బిజేపి, టీడీపీలు అధికారంలోకి వచ్చాయి. పవన్ ప్రచారం కారణంగానే అటు ప్రభుత్వంతో పాటు ఇటు ఎంపీలు కూడా పెద్ద సంఖ్యలో పార్లమెంటులో ప్రాతినథ్యం వహిస్తున్నారు.

తాను ప్రచారం చేసి గెలిపించినా.. టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం పోరాడటం లేదని అవేదన వ్యక్తం చేసిన పవన్ వారిని వ్యాపారాలు పక్కనబెట్టి మరీ.. ప్రత్యేక హోదా కోసం పోరాడండీ అంటూ పిలుపునిచ్చారు. నిజం మాట్లాడితే నిష్టూరమన్నట్లు.. అంతే మన ఎంపీలకు కూడా ఎక్కడో కాలింది. తమ గెలుపులో భాగమైన పవన్ కూడా ఉపేక్షించకుండా ఏకంగా విమర్శల పర్వానికి తెరలేపారు. అంతే.. అయితే ఈ సమయంలో జపాన్ లో వున్న సీఎం చంద్రబాబు.. పవన్ ను విమర్శించవద్దు అన్న చెప్పినా.. వారు విమర్శల పర్వానికి తెర తీశారు. అయితే టీడీపీ అధినేత డైరెక్షన్ లోనే పవన్ పై టీడీపీ ఎంపీలు విమర్శలను గుప్పించారని తెలుస్తోంది.

క్రమశిక్షణ గల పార్టీలో పార్లమెంటు సభ్యులగా వుండి.. పార్టీ అధినేత సూచనలను ధిక్కరించి విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్న విమర్శలు వినబడుతున్నాయి. దీంతో చంద్రబాబు అనుమతిని తీసుకున్న తరువాతే ఎంపీలతో పాటు కేంద్ర మంత్రి పవన్ ను టార్గెట్ చేశారన్న వార్తలు వినబడుతున్నాయి. ప్రతీ విషయంలోనూ రెండు పరిష్కారాలు (రెండు కళ్ల సిద్దాంతం, ద్వంద నీతి, రెండు నాల్కెల విధానం) అవలంభించే చంద్రబాబు.. పవన్ మీడియా సమావేశంలోనూ మీరు విమర్శలు చేయండి.. ఆ తరువాత నేను మిమల్ని మాట్లాడవద్దని చెబుతాను అని అన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఎంపీలు పవన్ ను విమర్శించి.. ఆ తరువాత మిన్నకుండిపోయారు. అయితే ఏది నిజమో..? ఎంత వరకు నిజమో..? చంద్రబాబుకు.. పార్టీ ఎంపీలకే తెలియాలి..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  TDP  use and throw policy  

Other Articles