musunuru mro vanajakshi meeting with chandrababu naidu

What is this morality where is your honesty babu garu

chandrababu naidu, ap cm chandrababu, chandrababu controversy, cash for vote scam, phone tapping controversy, chandrababu phone tapping, mro vanajakshi news, babu with vanajakshi, chintamamemi prabhakar, sand mafia issue, ap sand mafia controversy, ap sand mafia latest news, chandrababu sand mafia, babu sand mafia issue

musunuru mro vanajakshi meets and discloses mla chintamaneni prabhakar episode to Andhrapradesh chief minister chandrababu at hyderabad

ఇదేం నీతి, ఏదీ నిజాయితీ..? బాబు గారు..

Posted: 07/11/2015 08:51 PM IST
What is this morality where is your honesty babu garu

అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా మైకు పట్టుకున్న వెంటనే.. వచ్చే డైలాగ్  నీతి, నిజాయితీలకు నేను కట్టుబడి వున్నాను. ఎక్కడా అవినీతికి బంధుప్రీతికి తావివ్వకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ.. ముందుకెళ్తున్నా.. తమ్ముళ్లు మీరు కూడా నీతి, నిజాయితీలను నమ్ముకుని ముందుకెళ్లండి అంటూ ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చే నేత ఎవరో తెలుసా..? డైలాగ్ వినగానే.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని టక్కున చెప్పెస్తున్నారు కదు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఈ డైలాగ్ చెబితే.. వంద ఎలుకలను తిన్న పిల్లి పుణ్యక్షోత్రాలకు వెళ్లిందని కొందరు.. దయ్యాలు వేదాలు వల్లించినట్లు వుందని మరికోందరు విమర్శించడానికి సిద్దంగా వున్నారు.

అసలే ఓటుకు నోటు కేసులో తిమ్మిని బమ్మి చేయడంలో దిట్టగా పేరొందిన బాబు.గారు.. అ కేసును పక్కన పడేసి.. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్లితే.. హైదరాబాద్ లో సెక్షన్-8ని అమలుపర్చాలని కేంద్రంలో అధికారంలో వున్నతమ మిత్రపక్షం బిజేపిని వేడుకున్నారు. దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న చంద్రబాబు.. అసలు తాను ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారా..? ఓటుకు నోటు కేసులో అరెస్టై బెయిల్ పై వచ్చిన రేవంత్ రెడ్డి సహా పలువురిని టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వద్దకు పంపించారా..? లేదా..? స్టీఫెన్ సన్ తో ఫొన్ లో సంభాషించారా..? లేదా..? అన్న వాటిపై సమాధానాలను ఇప్పటికే చెప్పలేదు. ఎప్పటికైనా చెబుతారో..? లేక ఎప్పటికీ చెప్పరో ఆయనకే తెలియాలి.

ఈ విషయం ఇలా వుంటే.. ఇక పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహరాంలోనూ చంద్రబాబు నీతి, నిజాయితీ ప్రస్పుటించాయి. మండలస్థాయి మేజిస్ట్రేట్ ర్యాంకు అధికారిని, తహసీల్ధారుపై దెందులూరు ఎమ్మెల్యే దాడి చేశారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకుంటున్నాం.. అంటూ పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికే ప్రభుత్వం.. అధికారులను మాత్రం ఆ ధిశగా చర్యలు తీసుకోవద్దని పురమాయిస్తున్నట్లు కనబడతుతోంది. అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న వాహనాలను అడ్డుకుని వాటిపై చర్యలు తీసుకుంటే.. స్వయంగా క్రమశిక్షణ గల పార్టీలో బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా వున్న చింతమనేని ప్రభాకర్ వచ్చి... ఎమ్మార్వోను అసభ్యపదజాలంతో దూషించి.. దాడికి పాల్పడ్డాడు. దీంతో రెవెన్యూ ఉద్యోగులు ధర్నాకు దిగారు. కార్యాలయాలకు తాళాలు వేసి మరీ తమ నిరసనను హర్తాళ్ రూపంలో ప్రదర్శించారు.

రంగంలోకి దిగిన అమాత్యులు రెవెన్యూ ఉద్యోగులను బుజ్జగించే ప్రయత్నాలు చేసినా.. వినలేదు. ఇక ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితురాలితో ఫోన్ లో మాట్లాడి.. చర్యలు తీసుకుంటామని చెప్పినా.. శాంతించని రెవెన్యూ ఉద్యోగులు హర్తాళ్ కే మొగ్గుచూపారు. ఇక మరోమారు రంగంలోకి దిగిన రాష్ట్రమంత్రి దేవినేని ఉమ.. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి.. ఆయనతోనే చర్చలు జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఆ హమీ మేరకు ముందుగా ఈ నెల 13న చర్చలు జరపాల్సి వుండగా, రెవెన్యూ ఉద్యోగులందరూ పనులకు స్వస్తి పలకడంతో.. సమస్య తీవ్రతను పసికట్టిన చంద్రబాబు ఇవాళ్లే వారితో భేటీ అయ్యారు. ఇవాళ చంద్రబాబుతో ఆయన నివాసంలో రెవెన్యూ ఉద్యోగులు భేటీ అయ్యారు. దాడికి సంబంధించిన వివరాలను ఎమ్మార్వో వనజాక్షి స్వయంగా చంద్రబాబుకు వివరించారు.

ఇంత వరకు బాగానే వున్నా.. ఇక్కడే అసలు బాబుగారి నీతి, నిజాయితీలను ప్రశ్నించాల్సిన అవశ్యకత ఏర్పడింది. అసలు సమస్య ఇసుక అక్రమ రవాణా..? దినపై చర్యలు తీసుకోవాలా వద్దా..? ఎవరికి వారు అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేలు ఇసుకను అక్రమంగా రవాణా చేసుకోవచ్చా...? దీనికి చంద్రబాబు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది..? లేక ఇసుక రీచ్ లు వున్న చోట అక్రమంగా ఇసుక రవాణా చేసుకోండని చంద్రబాబు ప్రభుత్వం.. టీడీపీ ఎమ్మెల్యేలతో లోపాయికారిగా అనుమతులు మంజూరు చేసిందా..? రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు.. ఆ సమయంలో ప్రవేశపెట్టిన పనికి ఆహార పథకాం బియ్యాని.. టీడీపీ కార్యకర్తలు, నేతలు పందికోక్కులా తిన్నారని.. మనుషులతో కాకుండా పెద్దపెద్ద యంత్రాలతో పనులు చేయించి మరీ తిన్నారని అప్పట్లో అన్ని విపక్షాలు బాహాటంగానే విమర్శించాయి. అయితే ఈ ధపా మరోమారు అధికారంలోకి వచ్చిన టీడీపీ, ఇసుకు అక్రమ రవాణ విషయంలో కూడా ఆలాంటి అనుమతలే జారీ చేసిందా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక తహసిల్దార్ పై దాడి జరిగితే.. అందులోనూ ఒక మహిళా అధికారినిపై అసభ్య పదజాలంతో దూషించి.. దాడికి తెగబడితే.. చర్యలు వుండవా..? అందులోనూ ప్రజాప్రతినిధిగా వున్న తమ పార్టీ సభ్యుడిపై చర్యలు తీసుకుని, అరెస్టు చేసి, జైలుకు తరలిస్తే.. బాబు గారు నీతి, నిజాయితీ పరులను అందరూ అంగీకరిస్తారు..? కానీ తమ గూటికి చెందిన పక్షిని కాపాడుకునేందుకు ఏకంగా అమాత్యులను రంగంలోకి దింపడం చంద్రబాబు నిజాయితీని ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. తమ ఎమ్మెల్యేపై చట్టం, న్యాయం, ధర్మం వర్తించకుండా కేవలం పార్టీ అధికారం మాత్రమే వర్తిస్తుందని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ప్రతీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పే చంద్రబాబు.. తమ ఎమ్మల్యేను కాపాడుకునే పనిలో మాత్రం చట్టం కన్నా పార్టీయే అతనిపై చర్యలు తీసుకుంటుందని, ఇలా ఎందుకు చేశావని చింతమనేనికి షోకాజ్ నోటిసులు పంపిస్తామని చెప్పారు. దీంతో ఇదేం నీతి, ఏదీ నిజాయితీ..? బాబు గారు. అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : chandrababu  vanajakshi  chintamamemi prabhakar  sand mafia  

Other Articles