union minister comes in rescue of metro rail land losers

Central minister opposing metro rail project proposal

vijayawada metro rail, union minister, venkaiah naidu, chandrababu naidu, sridharan, eluru canal, bandar canal, delhi metro rail corperation, final detailed project report, AP chief minister

union minister comes in rescue vijayawada metro rail land losers, who in favor of them suggest metro rail to be constructed on eluru and bandar canals

మెట్రో రైలు ప్రాజెక్టు మోకాలడ్డుతున్న కేంద్రమంత్రి

Posted: 07/09/2015 05:07 PM IST
Central minister opposing metro rail project proposal

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో వున్న విజయవాడ చుట్టూరా మణిహారంలో నిర్మితం కానున్న ప్రతిష్ఠాత్మకంగా మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సాక్షాత్తు రాష్ట్రానికి చెందిన ఓ కేంద్ర మంత్రే ’విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టు’కు మోకాలడ్డుతున్నట్లు సమాచారం. విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ కష్టాలను అధిగమించేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి రాజధాని నగరం అమరావతి వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలని ఏపీ సర్కార్‌ భావించింది. దానికి సంబంధించిన సవిరమైన నివేదికను రూపొందించే బాధ్యతను మెట్రో మ్యాన్‌ శ్రీధరన్‌ నేతృత్వంలోని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ)కి అప్పగించింది.

డీఎంఆర్‌సీ కొద్ది నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి ‘తుది సవివర ప్రాజెక్టు నివేదిక’ (ఫైనల్‌ డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌) సమర్పిం చింది. దీంతో డీఎంఆర్‌సీకి విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించడం లాంఛనప్రాయమని, త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయని పలువురు భావించారు. అయితే అనూహ్యంగా మెట్రో పనుల ప్రారంభంలో విపరీతమైన జాప్యం చోటుచేసుకుంటోంది. దీనికి కేంద్ర మంత్రే కారణమని సమాచారం. విజయవాడ మెట్రో రైల్‌ను డీఎంఆర్‌సీ ప్రతిపాదించిన బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు కారిడార్లలో కాకుండా బందరు కాల్వ, ఏలూరు కాల్వల మీదుగా నిర్మించాలని సదరు కేంద్ర మంత్రి.. ఏపీ సీఎం చంద్రబాబును, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, శ్రీధరన్‌ను కొంతకాలంగా అభ్యర్థిస్తున్నారని సమాచారం.

అమితు వారెవ్వరూ అంగీకరించలేదని తెలుస్తుంది. బందరు రోడ్డు పొడవునా ఉన్న వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులైన కొందరు బడా బాబులు ఈ రహదారిపై మెట్రో రైల్‌ కారిడార్‌ ఏర్పాటైతే తమ సంస్థలు, దుకాణాలు ఉనికి కోల్పోతాయని, దీనికి తోడు ప్రతిపాదిత మెట్రో స్టేషన్ల కోసం ఈ రోడ్డు పోడవునా పలుచోట్ల దుకాణాలను తొలగించడమో లేదా కుదించడమో చేయాల్సి రావడం ఖాయమని.. దీనిని ఎలాగైనా అడ్డుకుని తమను రక్షించాలని అభ్యర్థించారని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన కేంద్రమంత్రి మెట్రో రైలు నిర్మాన ప్రాజెక్టుకు మోకాలడ్డుతున్నాట్లు సమాచారం.

ఒకవేళ సదరు కేంద్రమంత్రి ప్రయత్నాలు ఫలించి, మెట్రో రైలు కారిడార్ల అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లయితే మళ్లీ ఈ పథకం సర్వేలను మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో అవి పూర్తవ్వాలంటే కొన్నేళ్లు పడుతుందని, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు మరి కొన్ని సంవత్సరాలు తీసుకుంటుందని, మొత్తంగా రాజధాని నిర్మితమయ్యేలోగా విజయవాడ మెట్రో రైలును పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం నేరవేరడానికి ఎన్ని ఏళ్లు పడుతుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijayawada metro rail  union minister  venkaiah naidu  chandrababu naidu  sridharan  

Other Articles