AP | Ashoka Gajapatiraju | Cm

May central minister ashoka gajapatiraju will the next cm of ap

Ashoka Gajapati raju, chandrababu, Chief minister, cash for vote scam

May central minister Ashoka gajapatiraju will the next cm of ap. In the cash for vote case if Chandrababu resign, ashoka gajapati will be the next cm.

ఏపి సిఎంగా అశోఖగజపతిరాజు..?

Posted: 06/15/2015 04:41 PM IST
May central minister ashoka gajapatiraju will the next cm of ap

ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు అరెస్టయితే ఏపికి ముఖ్యమంత్రిగా ఎవరు అవుతారు అన్నదానిపై రోజుకొకరి పేరు తెర మీదకు వస్తోంది. ముందు చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఏపి సిఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని అనుకున్నారు. కానీ తర్వాత నందమూరి బాలకృష్ణ సిఎం అవుతారని అనుకున్నారు. అయితే తాజాగా మరో వ్యక్తి పేరు తెర మీదకు వచ్చింది.ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయబోతున్నారా..? ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా అశోక గజపతి రాజుకు అవకాశమివ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారా..? అవునని తెలుగుదేశం పార్టీ అత్యున్నతస్థాయి వర్గాలంటున్నాయి. చార్జిషీటులో తన పేరు ఉండే అవకాశం ఉందని సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా వేగంగా పావులు కదుపుతున్నారు. అశోకగజపతిరాజుకు అవకాశమివ్వాలన్న ప్రతిపాదనను ఆయన దాదాపు ఖరారు చేసేశారని తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏసీబీ అనుబంధ చార్జిషీట్‌లో తన పేరు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. అశోక గజపతి రాజు ప్రస్తుతం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. అనుబంధ చార్జిషీటు దాఖలు చేయడానికి ఏసీబీ సన్నద్ధమవుతోంది. ఫోరెన్సిక్ విభాగం నుంచి నివేదిక అందగానే బహుశా మంగళవారం చార్జిషీటు దాఖలయ్యే అవకాశం ఉంది. రెండు మూడు రోజులుగా డీజీపీ జేవీ రాముడు, రాష్ర్ట నిఘా విభాగ అధిపతి, ఇతర ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు జరుపుతున్న చంద్రబాబు నాయుడు భవిష్యత్ కార్యాచరణపై వేగంగా పావులు కదుపుతున్నారు. అశోక గజపతి రాజును ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడికి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఇప్పటికే చంద్రబాబు తెలియజేశారని తెలుగుదేశం పార్టీ ఉన్నతస్థాయి వర్గాలంటున్నాయి. బావమరిది నందమూరి బాలకృష్ణ, సీనియర్ మంత్రులు కె.నారాయణ, యనమల రామకృష్ణల పేర్లను కూడా పరిశీలించినప్పటికీ అశోక గజపతి రాజు వైపే చంద్రబాబు మొగ్గు చూపారని సమాచారం. ఆయన చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడే కాక మంచి అడ్మినిస్ట్రేటర్‌గా కూడా పేరుంది. మరి ఇదంతా కేవలం పుకారా లేదా నిజంగా చంద్రబాబు స్ట్రాటజీ అదేనా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ashoka Gajapati raju  chandrababu  Chief minister  cash for vote scam  

Other Articles