Notice | KCR | Ap | Police

Ap govt plans to issue notices to telangana cm kcr before the telangana govt issue notices to chandrababu

Chandrababu, KCR, Telangana, Notices, ACB, cash for vote

Ap govt plans to issue notices to Telangana Cm kcr before the telangana govt issue notices to chandrababu. Chandrababu naidu discuss about the on going cash for vote case issue.

బాబు కంటే ముందుగా కేసీఆర్ కు నోటీసులు..!

Posted: 06/15/2015 03:05 PM IST
Ap govt plans to issue notices to telangana cm kcr before the telangana govt issue notices to chandrababu

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లుగా వచ్చిన ఆడియో టేపుల ఆధారంగా ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు నాయుడుకు ఏసీబీ నోటీసులు జారీ చెయ్యడానికి ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చెయ్యాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే కేసీఆర్ కు నోటీసులు జారీ చేసేది తెలంగాణ ఏసీబీ కాదు ఏపి ఏసీబీఅట. ఈమేరకు ఏపి ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్న దానిపై ఏపిలో చాలా చోట్ల పలురకాల కేసులు ఫైలయ్యాయి. ఏపిలో దాదాపుగా 70 కేసులు ఫైలైనట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఏపి ఏసీబీ అధికారులు తమకు లభించిన ఆధారాల ఆధారంగా, వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న ఫిర్యాదుల ఆధారంగా నోటీసులు జారీ చెయ్యాలని యోచిస్తున్నట్లు సామాచారం.

తెలంగాణ ఏసీబీ ఓటుకు నోటు వ్యవహారంలో చాలా వేగంగా ముందుకు కదులుతోంది. తాజాగా ఆడియో, వీడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపించడంతో పాటు ఎంతో కీలకమైన స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసిన తర్వాత మేజర్ స్టెప్ తీసుకుంటారని తెలుస్తోంది. అయితే స్టీఫెన్ సన్ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చెయ్యాలని తెలంగాణ ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఏసీబీ అధికారుల పని తీరుకు మద్దతుగా నిలుస్తోంది. అందుకే తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు పంపక ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏపి అధికారులు నోటీసులు పంపాలని చూస్తున్నారని సమాచారం. మరి ఇద్దరు చంద్రుల రగడ ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Chandrababu  KCR  Telangana  Notices  ACB  cash for vote  

Other Articles