NTV and Sakshi being targeted by Andhra Cable operators ? Banned in AP?

Ntv and sakshi banned in andhra pradesh

NTV, Sakshi, Andhra Pradesh, MSOs, TV channels banned, congress senior leader marri shashidhar reddy, governer, Talasani srinivas yadav, ministry, jaipal Reddy, speaker madhusudhana chary, cash for vote, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, mutaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, entertainment, movies, technology, cricket, review, weird news, education, results

cash for vote circumstances have finally led to the irritation of cable operators in the state of Andhra Pradesh as media houses started to opine various stories in their TV channels.

ఆ రెండు చానెళ్లను ఏపీలో నిషేధించారా..?

Posted: 06/16/2015 06:48 PM IST
Ntv and sakshi banned in andhra pradesh

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న చందాన్ని బాగా వంటపట్టించుకున్న ఆంద్రప్రదేశ్ ఎమ్మెస్ఓలు ఓటుకు నోటు కేసు వ్యవహారంలో రోజుకో రోజుకు కోత్త కథనాలతో వస్తున్న ప్రసారాలతో విసిగిపోయినట్లున్నారు. వాస్తవ అవాస్తవాలను ప్రజలే నిర్ణేతలని వదిలేయకుండా.. మీడియా స్వేచ్చకు భంగం కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు నుంచి నిన్న మొన్నటి వరకు అన్ని ఛానెళ్లు కథనాలను ప్రసారం చేస్తున్నా.. వాటికి భిన్నంగా ఈవ్యవహారంలో తాజా విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రజలకు అందిస్తున్న ఛానెళ్లపై మాత్రం వేటు వేసినట్లు సమాచారం.

అంతకు రెండు రోజుల ముందు జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని లైవ్ లో ప్రసారం చేసినప్పుడు మాత్రం కిమ్మనకుండా కూర్చున్న పార్టీ నేతలు.. తాజా ఎపిసోడ్ లో మాత్రం ఈ వ్యవహారం అంతటికీ  మీడియా ఛానెళ్లే కారణమైనట్లు తప్పు మీడియాపై నెడుతున్నారు. ఈ నేపత్యంలో తాజాగా ఎన్టీవి సహా సాక్షి న్యూస్ ఛానెళ్లను ఆంధ్రప్రదేశ్ లో నిషేధించినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన రాజకీయ నేతలు, తమకు అనుకూలంగా వున్న వార్త ఛానెళ్లను మాత్రమే ప్రసారం చేయాలని, వ్యతిరేక కథనాలను ప్రసారం చేస్తున్న ఛానెళ్లను నిషేధించాలని ఎమ్మెస్ఓలపై తీవ్రంగా వత్తిడి తీసుకువచ్చారని తెలుస్తోంది. దీంతో  ఏపీలో ఎన్టీవి, సాక్షి ప్రసారాలు నిలిచిపోయాయన్న కథనాలు వెలువడతున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : NTV  Sakshi  Andhra Pradesh  MSOs  banned  

Other Articles