Rahulgandhi | Osmania UNiversity | Congress | Telangana

Rahul gandhi targets osmania university students

Osmani University, Rahul Gandhi, Telangana Chief Minister KCR

Rahul gandhi targets Osmania University students. AICC Vice president Rahul Gandhi like to come Telangana specially for OU students

అబ్బో రాహుల్ టార్గెట్ ఓయూ స్టూడెంట్సా..?

Posted: 06/15/2015 01:57 PM IST
Rahul gandhi targets osmania university students

ఇటీవ‌లే తెలంగాణ‌లో ప‌ర్యటించిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండునెల‌లైనా తిర‌క్కుండానే మ‌రొసారి ఎందుకు ప‌ర్యటించాల‌నుకుంటున్నారు? ఆయ‌న ప‌ర్యట‌న ప్రధాన ల‌క్ష్యమేమిటి? వ‌రంగ‌ల్ స్థానానికి ఉపఎన్నిక జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రాహుల్ గాంధీ ప‌ర్యటిస్తున్నార‌ని కాంగ్రెస్ నాయ‌కులు పైకి చెబుతున్నా రాహుల్ అస‌లు ల‌క్ష్యం వేరే ఉందట. ఉస్మానియా విశ్వవిద్యాల‌య‌మే ఆయ‌న ప్రధాన ల‌క్ష్యం. ఉస్మానియా విశ్వవిద్యాల‌యంలో విద్యార్థుల‌తో భేటీ కావాల‌ని రాహుల్ కోరుకుంటున్నారట. రాష్ట్ర విభ‌జ‌న ఉద్యమంలో కీల‌క‌పాత్ర పోషించిన ఉస్మానియా విద్యార్థుల‌తో ముఖాముఖి చ‌ర్చల‌లో పాల్గొని వారితో మంచి సంబంధాలు నెల‌కొల్పుకోవాల‌ని రాహుల్ భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీదేన‌న్న విష‌యాన్ని విద్యార్థుల‌కు వివ‌రించి వారి సానుభూతి సంపాదించాల‌ని కోరుకుంటున్నారట.

అయితే అన్నిటిక‌న్నా ముఖ్యమైన విష‌య‌మేమిటంటే ఇటీవ‌లే ఉస్మానియా విద్యార్థులు తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు. యూనివ‌ర్సిటీ భూముల‌లో పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టిస్తాన‌ని కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న విద్యార్థుల‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. తెలంగాణ రావ‌డానికి టీఆర్ ఎస్ పోరాటాలే కార‌ణ‌మైనా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత కేసీఆర్ వ్యవ‌హార శైలి విద్యార్థుల‌కు న‌చ్చడం లేదు. ఈ ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో కాంగ్రెస్ నాయ‌కులు విఫ‌ల‌మ‌య్యార‌ని రాహుల్ భావిస్తున్నారు. తెలంగాణ ఇచ్చింది తామేన‌న్న విష‌యాన్ని ప్రభావ‌వంతంగా ప్రజ‌ల్లోకి తీసుకెళ్లలేక‌పోయిన కాంగ్రెస్ నాయ‌కులు ఇపుడు కేసీఆర్‌తో విద్యార్థుల వైరాన్ని కూడా అనుకూలంగా మార్చుకోలేక‌పోయార‌ని, పార్టీకి ప‌నికివ‌చ్చే ఇలాంటి అంశాల‌లో స్థానిక నాయ‌క‌త్వం పూర్తిగా విఫ‌ల‌మౌతోంద‌ని రాహుల్ ఆగ్రహంతో ఉన్నార‌ట‌. అందుకే ఆయ‌నే స్వయంగా రంగంలోకి దిగాల‌ని నిర్ణయించుకున్నార‌ట‌. నెలాఖ‌రులో రాహుల్ హైద‌రాబాద్ రాక‌కు ప్రధాన కార‌ణం అదేన‌ని ఏఐసీసీ వ‌ర్గాలు కూడా అంటున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles