TRS | Tapping | Fear | KCR

Party mlas are fearing about the tapping issue in telangana

TRS, MLA, Tapping, Chandrababu, KCR, Telangana, Calldata

TRS party MLAs are fearing about the Tapping issue in Telangana. Telangana cm KCR may have the full data of all MLAs phone.

వణికిపోతున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

Posted: 06/15/2015 11:32 AM IST
Party mlas are fearing about the tapping issue in telangana

అవును. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న అదికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవరికి ఫోన్ వస్తుందో..? ఎవరు బుక్ అవుతారో..? అన్న అనుమానాలు పాపం వారికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టిన వీడియో, ఆడియో ఆధారాలతో తెలంగాణ ఎమ్మెల్యేలు ఖంగుతిన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం. తర్వాత కరెక్ట్ గా వారానికి చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు భావిస్తున్న ఆడియో టేపులు బయటకు విడుదల కావడంతో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో భయం మొదలైంది. అవును.. దొరికింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఇరుక్కుంది తెలుగుదేశం పార్టీ అధినేత, పట్టించింది టిఆర్ఎస్ అధినేత, ప్రస్తుత తెలంగాణ సిఎం కేసీఆర్ కదా..? మరి అలాంటప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు భయపడుతున్నారనేగా అనుమానం. అయితే స్టోరీ చదవండి.

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారం బయటకు వచ్చింది. తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ కు ఐదు కోట్లు ఆపర్ చెయ్యడం.. యాభై లక్షల రూపాయలతో అడ్డంగా బుక్ కావడం జరిగింది. అయితే ఈ కేసులో రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారిస్తుండగానే.. తెలుగుదేశం పార్టీ అధినేత మంతనాలు జరిపినట్లు ఆడియో టేపులు బయటకు వచ్చాయి. అయితే తమ నేత ఫోన్ ను ట్యాప్ చెయ్యడమే కాకుండా దాదాను 120 మంది ఫొన్లను ట్యాప్ చేసినట్లు ఏపి అధికారులు గుర్తించారు. అయితే ఇదే ఇప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఫోన్ ట్యా.పింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఎన్నికల సమయంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నేతలు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారాల్సిందా మంతనాలు జరిపారట. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా నేతల్లో పార్టీ ఫిరాయింపుల గోల మరీ ఎక్కువగా ఉండేదట. అయితే అలా మంతనాలు జరిపిన టైంలో ఫోన్ లలో ఏం మాట్లాడుకున్నారు..? డీల్ కుదిరిందా..? లేదా క్యాన్సిల్ అయిందా..? అన్న విషయాలు మొత్తం కేసీఆర్ దగ్గర డాటా ఉందని అంటున్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అందుకే తమ అధినేత నుండి ఎప్పుడు కాల్ వస్తుందా అని భయపడుతున్నారట టిఠఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో దుమారానికి కారణమైన ట్యాపింగ్ వివాదం ఇప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దగ పుట్టిస్తోందట.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  MLA  Tapping  Chandrababu  KCR  Telangana  Calldata  

Other Articles