smriti irani, forgotten she is union minister, speaks as defeated mp in amethi

Smriti irani union minister for nation or for amethi

smriti irani, union minister for nation, or for amethi, union minister smruthi Irani, HRD minister smruthi irani, smriti irani, rahul gandhi, priyanka gandhi, amethi, constituency development, congress,

union minister smruti irani fforgotten, that she is a central minister, counters congress leaders comments as defeated mp

కేంద్రమంత్రినన్న విషయం మరిచారా..?

Posted: 06/02/2015 08:56 PM IST
Smriti irani union minister for nation or for amethi

బీజేపి పార్టీలో ప్రధాని నరేంద్రమోడీ తరువాత అదే స్థాయిలో.. విపక్షాలను ధాటిగా ఎదుర్కోంటూ ముందుకు సాగుతన్నఆయన మంత్రివర్గ సహచరుల్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఒకరు. ఇప్పటికే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన సొంత నియోజకవర్గం అమేధీలోనే టర్గెట్ చేసి విమర్శల పర్వాన్ని రుచిచూపించారు. అమేధీలో రాహుల్ చేతిలో ఓటమి పాలైన స్మృతి ఇరానీ.. మోడీ సర్కారు తీసుకువస్తున్న భూ సేకరణ చట్టంలోని సవరణలతో దేశ రైతాంగానికి ఎనలేని నష్టం కలుగుతుందని ప్రచారం చేస్తున్న క్రమంలో స్మృతి రాహుల్ ను టార్గెట్ చేశారన్న విమర్శలు వినబడుతున్నాయి.
 
ఇటీవల వరుసగా అమేథీలో పర్యటించిన అమె.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ తనపై విమర్శలను కూడా సమర్థవంతంగా తిప్పికోట్టారు. కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ నాయకత్వ లోపం గురించి బాగా తెలుసేమోనని, అందుకే ఆయన తన సొంత గడ్డ మీద తనను తాను రక్షించుకోలేక.. అదనపు ఆయుధాలుగా చెల్లెలు ప్రియాంకను తెచ్చుకున్నారని అమె విమర్శించారు. అంతేకాదు అమేథీలో గెలిచిన అభ్యర్థి రాహుల్ గాంధీని పక్కన బెట్టి.. అదే స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన తనను ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా అడుగుతున్నారని, ఇదెక్కడి విడ్డూరమని కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి విస్మయం వ్యక్తం చేశారు.

ఇంతవరకు బాగానే వున్నా.. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం అమెపై విమర్శల దాడి ఎక్కుపెడుతున్నారు. స్మృతి ఇరానీ.. కేంద్ర మంత్రినన్న విషయాన్ని మర్చిపోతున్నారని, అమె కేవలం అమేధీకే మంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినబడుతున్నాయి. దేశంలో అత్యంత కీలక శాఖైన కేంద్ర మానవ వనరుల శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమె.. దేశంలో మానవ వనరులు అభివృద్ది చర్యలు తీసుకోవాలని.. అ విషయాన్ని మర్చి అమేధీలో ఎలా గెలుద్దామా..? అన్న కోణంలోనే తన అలోచనలు వున్నాయంటున్నారు. అమేధీపైనున్న శ్రద్ద మానవ వనరుల అభివృద్దిలో చూపాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.

ప్రస్తుతం కేంద్రంలో వున్న ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నందున స్మృతి ఇరానీ అక్కడి ప్రజలు అభివృద్ది చేయాల్సిందిగా కోరడంలో అమె అంతగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదని కాంగ్రెస్ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రమంత్రిగా కాకుండా ఓటమి పాలైన హోదాలో స్మృతి ఇరానీ వస్తే.. ఎందురు అమె పర్యటనకు కదులుతారో అమె అంచానాకు కూడా రాదన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా రాహుల్ ప్రచారం చేయడంతోనే.. అమె అమేధీలో పర్యటిస్తుంది తప్ప.. అమేదీ ప్రజలపై నిజమైన ప్రేమతో కాదన్న విమర్శలు వినబడుతున్నాయి. ఇక మరోవైపు మద్రాసు యూనివర్శిటీలో అంబేద్కర్ పెరియార్ స్టూడెంట్ సర్కిల్ రద్దు విషయమై దేశవ్యాప్తంగా నిరసన సెగలు అలుముకుంటుంటే.. దానిపై స్పందించని మంత్రి.. ఎంతసేపు తాను  మంత్రి నన్న విసయాన్ని మర్చి.. కేవలం రాజకీయ నాయకురాలుగానే వ్యవహరిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : smriti irani  rahul gandhi  priyanka gandhi  amethi  

Other Articles