madhavaram says he joins TRS only or constituency development

Telangana government releasing funds to party mla s

Telangana government releasing funds to party mla's, kukatpally Mla madhavaram KrishnaRao, constituency development, Mla Madhavaram Krishna Rao, Telangana government, KCR, TRS, TDP, madhavaram KrishnaRao, kukatpally constituency

As per kukatpally TDP Mla Madhavaram Krishna Rao comments on joining TRS, is Telangana government releasing funds only to party mla's..?

అయినవారికి అకుల్లో.. కానివారికి కంచాల్లోనా..?

Posted: 06/02/2015 09:01 PM IST
Telangana government releasing funds to party mla s

చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ ఒక్కటే.. అయితే అధిక స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో వారు అధికారికంగా రాష్ట్రాన్ని పాలించే హక్కును కలిగివుంటారన్నది జగమెరిగిన సత్యం. కానీ ప్రస్తుతం ఏ అధికార పార్టీని చూసిన ఏమున్నది గర్వకారణం.. పార్టీ ఫిరాయింపుల పర్వం.. నియోజకవర్గాల అభివృద్ది మంత్రం అన్నట్లుగా ప్రస్తుతం సాగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ తరహా ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులు అధికమయ్యాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలకు చెందిన పార్టీ నేతలు.. అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యానికి ముందు ఏడు మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ తీర్ధాన్ని పుచ్చుకుని గులాబి కండువా కప్పుకోగా.. ఎమ్మెల్సీ ఎన్నికకు రెండు రోజుల ముందు.. కూకట్ పల్లి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గులాబి కండువా వేసుకుని కారులో ప్రయాణించారు. అయితే తనకు రాజకీయ బిక్ష పెట్టిన చంద్రబాబుకు తాను ఇప్పటికీ కృతజ్ఞుడినేనని.. ఆయనకు ఇప్పటికీ పాదాబివందనం చేస్తానని చెప్పిన మాదవరం కృష్ణారావు.. కేవలం నియోజకవర్గ అభివృద్ది కోసమే తాను పార్టీ ఫిరాయింపుకు పాల్పడినట్టు చెప్పకోచ్చారు.

అంటే తమ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రభుత్వం నియోజక అభివృద్ది కోసం నిధులను కేటాయిస్తుందా..? చట్టసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలందరిని ఒక మాదిరిగా కాకుండా అయిన వారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో అన్న చందంగా.. తమ పార్టీకి చెందిన నేతలకు అభివృద్ది నిధులు ఒకలా.. విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలకు అభివృద్ది నిధులు మరోలా కేటాయిస్తున్నారా..? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. అభివృద్ది నిధులను అందరు ఎమ్మెల్యేలకు ఒకే మాదిరిగా కేటాయిస్తామని, రాష్ట్ర అభివృద్దిలో ఏ ప్రాంతానికో, ఏ పక్షానికో, ఏ వర్గానికో పక్షపాతంగా వ్యవహరించమని ప్రమాణాలు చేసినా.. ఇంకా ఆ పక్షపాతం కోనసాగుతుందా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

నియోజకవర్గం అభివృద్ది కోసమే తాను పార్టీ ఫిరాయించినట్లు అంగీకరించిన మాదవరం కృష్ణారావు వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటే.. అసలు ప్రతిఫక్షాలు మనుగడ సాగించడమే కష్టమని చెప్పాలి. చట్టసభకు ఎన్నికైన నేతలందరూ ముందుగా తమ నియోజకవర్గాల అభివృద్దికే ప్రాధాన్యతను ఇస్తారు. రాష్ట్రం నుంచి నిధులను మంజూరు చేయించుకుని అభివృద్ది పనులు చేపడతారు. మరి ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన పార్టీలోకే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు వెళ్లి.. వార్వారి నియోజకవర్గాలను అభివృద్ది చేసుకోవాల్సి వుంటుంది. సరే పార్టీ ఫిరాయించడానికి మాదవరం కృష్ణారావు చెప్పిన మాట్లలో వాస్తవమెంతో ఆయనకే తెలియాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telanagana government  KCR  TRS  TDP  madhavaram KrishnaRao  

Other Articles