Nagam| bjp | tdp| modi

Nagam janardhan reddy maintaning distance from bjp from last faw days

Nagam, Nagam janardhan reddy, bjp, tdp, chandrababu, modi,

Nagam janardhan reddy maintaning distance from bjp from last faw days. After out from tdp nagam joined into bjp, But nagam facing internal political probles in bjp party.

నాగం.. బిజెపిలో ఆగం ఆగం..!?

Posted: 05/04/2015 04:34 PM IST
Nagam janardhan reddy maintaning distance from bjp from last faw days

టిడిపిలో ఎంతో కీలక నేతగా ఉన్న నాగం జనార్దన్ రెడ్డి తర్వాత పరిస్థితుల ప్రభావంతొ టిడిపిని వీడారు. టిడిపి నుండి బయటకు వచ్చిన నాగం మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ కమల దళంలో చేరారు. అయితే బిజెపిలో ఉన్నప్పటికీ మొదటినుంచి నాగం దానిలో ఇమడలేకపోతున్నారు. మొదటి నుంచి ఆపార్టీలో సీనియర్ల మధ్యే ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ విషయాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గతంలోనే నేతలకు హెచ్చరికలు చేశారు. అప్పటికి తాత్కాలికంగా సమసిపోయినట్లు కన్పించినా ఎవరి రాజకీయంలో వారు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బిజెపిలో రాష్ట్ర నాయకత్వ మార్పుపై తీవ్ర చర్చ జరుగుతోంది. బిజెపి శాసనసభాపక్షనేత డాక్టర్‌ కె లక్ష్మణ్‌కు అధ్యక్ష బాద్యతలు అప్పగించాలని ఆపార్టీలోని సీనియర్‌ నేతలు భావిస్తున్నారు. మరోవైపు సీనియర్‌ నేత చింతల రాంచంద్రారెడ్డి కూడా పార్టీ అధ్యక్ష రేసులో ఉన్నారు. ఆయన్ని టిటిడి బోర్డు సభ్యుడిగా నియమిస్తారనే ప్రచారం జరిగింది. పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి. దీనికి ప్రస్తుత బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అడ్డుపడ్డారనే విమర్శలు విన్పించాయి. అంతకు ముందే నాగం బిజెపిలో అసమ్మతి గళాన్ని విన్పించారు. బెంగుళూరులో బిజెపి జాతీయ మహాసభలకు ముందే పార్టీ ధోరణిపై బహిరంగ విమర్శలు చేశారు.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో నాగం జనార్థన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ ఎంపిగా పోటీచేస్తే, ఆయన కొడుకు నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. నాగం టిడిపిని వీడినా పార్టీ కేడర్‌ మాత్రం ఆయన వెంట రాలేదు. బిజెపి-టిడిపి పొత్తులో భాగంగా పోటీ చేసినా, టిడిపి శ్రేణులు ఏమాత్రం సహకరించకపోవడంతో తండ్రీ కొడుకులు ఓటమి పాలయ్యారు. బిజెపిలో ఉంటే రాష్ట్రంలో పార్టీలో కీలకబాధ్యతలు అప్పగించే పరిస్థితులు ఏమాత్రం కన్పించకపోవడంతో స్వంత గూటికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని పలుమార్లు విలేకరులు ఆయన్ని ప్రశ్నిస్తే అలాంటి ఆలోచన ఏదీ లేదని కొట్టిపారేశారు. అదే సందర్భంలో కొద్ది రోజులుగా బిజెపితో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. గతంలో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రెండ్రోజులకోసారి ప్రెస్‌మీట్‌లు పెట్టే ఆయన ఈ మధ్య అటువైపు కన్నెత్తి చూడట్లేదు. పాపం టిడిపి పార్టీని వీడినప్పటి నుండి అటు జనాల్లో కానీ, ఇటు మీడియాలో కానీ నాగం అలికిడి లేకుండా పోయారు. మరి బిజెపి బై బై చెబుతారొ టిడిపికి జై కొడతారో తెలియాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagam  Nagam janardhan reddy  bjp  tdp  chandrababu  modi  

Other Articles