why KTR and Nara Lokesh leaving for us at a time..?

Will rival heirs meet in us

kalvakunta taraka ramarao, Telangana minister KTR, Nara Lokesh, America tour of rival heirs, Andhra pradesh, Andhra pradesh cm Chandrababu, Telangana cm KCR, lagadapati rajagopal, former mp vijayawada, congress ex mp L rajagopal

Are rival heirs of Andhra pradesh and Telangana meet in america tour..?

ఇక్కడ తిట్టుకుని.. అక్కడ కలుస్తున్నారా..? బాబులూ..!

Posted: 05/02/2015 02:07 PM IST
Will rival heirs meet in us

టీడీపీ యువనేత, న్యవాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బాబు.. ఆర్థికంగా చతికిలబడిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కోసం అహర్నిషలు శ్రమిస్తున్నారు. తాను చదువుకున్న కాలేజ్ కు సంబంధించి మిత్రులలో అనేక మందిని కలసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అభ్యర్థించనున్నారు. ఇందుకోసం ఆయన అమెరికా పర్యటన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తన అమెరికా పర్యటన ఉంటుందని లోకేశ్ స్పష్టం చేశారు. అయితే ఇక్కడే మరో విషయం ఏమిటంటే.. ఈ నెల 5న మరో చంద్రుడు.. అదేనండీ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తనయుడు కల్వకుంట తారకరామారావు కూడా అమెరికా పర్యటన చేయనున్నారు. ఇద్దరు ఒకే సమయంలో ఒకటి రెండు రోజులు అటుఇటుగా అగ్రరాజ్యంలో పర్యటనకు సిద్దమయ్యారు.

ఇక్కడ నువ్వా- నేనా అంటూ పోటీ పడుతూ తెలంగాణ, ఆంద్ర రాష్ట్ర ప్రజల మధ్య వైరుధ్యాలను పెంచుతున్న ఇద్దరు చంద్రుల తనయులు.. అక్కడ ఎవరూ చూడని ప్రాంతంలో వారి స్నేహాన్ని కోనసాగిస్తున్నారా..? అన్న సందేహాలు తెలుగు రాష్ట్ర ప్రజలలో ఉదయిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం మహోద్యమంగా సాగుతున్న క్రమంలో ప్రత్యేకవాదులుగా ముద్రపడిన తారకరామారావు.. సమైక్యవాదులకు ముఖ్యనేతగా కోనసాగిన మాజీ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో కలసి ఉత్తరభారతలో ఓ పవర్ ప్లాంట్ సంస్థలో పెట్టుబడులు పెట్టారన్న వార్తలు అప్పట్లో గుప్పమన్నాయి.

ఈ విషయాన్ని తేల్చాలని అప్పట్లో పలువుతు తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్వయంగా కేటీఆర్ ను ప్రశ్నించారు కూడా. అయితే మౌనమే నా బాష ఓ మూగ మనసా అన్న పాటను అలపించిన కేటీఆర్.. దానిపై స్పందించనే లేదు. అయితే ఇద్దరు నేతలు మాత్రం బాహాటంగా తిట్ల దండకం అందుకుని పోటీ పడ్డారు. దీంతో ఇప్పుడు కూడా అలాంటి వ్యవహారమే ఏమైనా కేటీఆర్, లోకేష్ మధ్య నడుస్తుందా అన్న అనుమానాలు తెలుగు ప్రజలకు కలుగుతున్నాయి. ఇద్దరు అమెరికాలోనే చదవడం.. ఒకే సారి అగ్రరాజ్యానికి ప్రయాణం కావడం కూడా ఈ అనుమానాలకు తావిస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rival heirs  KTR  Lokesh  America  

Other Articles