Shivaji | Media | ap | special status

Cinema actor shivaji pasting for special status for ap

Shivaji, Media, ap, special status, tv9,

Cinema actor shivaji pasting for special status for ap. But the media didnt cover the shivaji with special interst. Only one channel broadcasting shivaji news and updates.

శివాజీని పట్టించుకునేవారే లేరా..?

Posted: 05/04/2015 04:36 PM IST
Cinema actor shivaji pasting for special status for ap

పాపం సినిమా నటుడు శివాజీ.. ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ గత కొంత కాలంగా గొంతెండిపోయేలా అరుస్తున్నా పట్టించుకోలేదు. అంతేనా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు ప్రత్యేక హోదా కోసం పోరాటం చెయ్యాలని కూడా పిలుపునిచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్ దానిపై స్పందించలేదు. అయితే తాను బిజేపీలోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. దాంతో బిజెపి నాయకులు శివాజీని అడ్డుకుని, పార్టీ పేరును వాడుకోవద్దని బాగానే వార్నింగ్ ఇచ్చారట. అయితే తాజాగా ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని దీక్షకు దిగారు. కానీ తెలుగు మీడియాలో దాదాపు పదుల సంఖ్యలో చానల్స్, పత్రికలు ఉన్నా ఏ ఒక్క ఛానల్ లో కానీ పత్రికలో కానీ శివాజీ గురించి పెద్దగా కథనాలు రాలేదు.

శివాజీ ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా బూతద్దంలో పెట్ి మరీ చూపిస్తోంది టివి9. అయితే ఒక్క టివి9లో మాత్రమే వస్తున్న శివాజీ కథనాలతో పెద్దగా లాభం లేకుండా పోయింది. పాపం మీడియా వారు అతడిని పట్టించుకోవడం లేదు. రెండు రోజులుగా దీక్ష చేస్తున్నా ఎలాంటి ప్రచారం రావడం లేదు. అయితే అసలు శివాజీ ఎందుకు దీక్షకు దిగుతున్నారు అని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారట.ఊరికి ఉపాకారానికి అని బయలుదేరితే ఊరకుక్క కరిచింది అన్న చందంగా తయారైంది శివాజీ పరిస్థితి.అయినా మంచి చెయ్యాలనుకునే వారికి ఇలాంటి మామూలే అని ముందుకు వెళుతున్నారట శివాజీ. పాపం పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని శివాజీ కూడా ఊహించాడో లేదో.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shivaji  Media  ap  special status  tv9  

Other Articles