KCR | Kejriwal | Corruption

On anticorruption help line a gossip go viral in media

kcr, kejriwal, delhi, telangana, anticorruption, corruption

On anticorruption help line a gossip go viral in media. kejriwal call to kcr on the anti corruption helpline no. and some more suggetions. kcr replay to kejriwal that try help line.

ట్రింగ్ ట్రింగ్... హలో కేసిఆర్ ఫ్రం కేజ్రీవాల్

Posted: 04/09/2015 01:39 PM IST
On anticorruption help line a gossip go viral in media

ఒకరు నార్త్.. మరొకరు సౌత్.. కానీ ఇద్దరికీ చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ ఉద్యమ నేపథ్యం నుండే రాజకీయాల్లో రాజుల్లా ఎదిగారు. ఇద్దరి పేర్లలలోనూ కె ముందు అక్షరాన్ని కలిగి ఉన్నారు. వారిద్దరే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లు. అయితే తాజాగా వారిద్దరిలో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు అని వార్త హల్ చల్ చేస్తోంది. ఎందుకు అలాగంటే తెలంగాణలో అవినీతి నిర్మూలనకు కేసిఆర్ టోల్ ఫ్రీనంబర్ ఇచ్చారు. అలా నెంబర్ రావడంతోనే తెలంగాణా వ్యాప్తంగా అవినీతి జలగల విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు కే్జ్రీవాల్ కూడా కేసిఆర్ ను ఫాలొ అవుతున్నారని అనుకుంటున్నారు. అయితే ఫాలో అయితే పర్లేదు కానీ అంతకన్నా కాస్త ఎక్కువే జరుగుతోందని పుకారు. ఆ ఎక్కువ ఏంటని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిదానికి లంచాలు అడుగుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి వెళ్లింది. దాంతో అవినీతిని అంతం చేస్తానంటూ కెసిఆర్ ప్రకటించారు. అలా ప్రకటించడం ఒక్కటే కాదు ఏకంగా టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా స్టార్ట్ చేశారు. అయితే ఒక్క రోజులో రెండు వేల కాల్స్ రావడంతో అదో సంచలనం సృష్టించింది. ''ఒకే ఒక్క కాల్ చేసి సమాచారం ఇవ్వండి. లంచావతారుల భరతం పడతా..అటెండర్ నుంచి..ఆఫీసర్ వరకు... స్ట్రీట్ లీడర్ల నుంచి స్టేట్ లీడర్ల దాకా డోంట్ కేర్. అవినీతిని అంతం చేస్తాం... చీపురుతో కరప్షన్-ను కడిగి పారేస్తా'' అంటూ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ హామీలిచ్చారు. ఆ దిశగా చర్యలు కూడా చేపట్టారు. ప్రస్తుతం పవర్‌ లోకి వచ్చి 50 రోజులు పూర్తయిన సందర్భంగా యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ నెంబర్ 1031 ను ఆయన పునఃప్రారంభించారు. 24/7 అంటూ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా బాధితుల నుంచి, ఫిర్యాదుదారుల నుంచి వచ్చే కంప్లెయింట్లను సీరియస్‌, నాన్‌-సీరియస్‌ కాల్స్ రూపంలో విభజించి విచారణ చేస్తున్నారు.

అయితే కేజ్రీవాల్ తన యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ ను స్టార్ట్ చెయ్యడానికి ముందు కేసీఆర్ కు ఫోన్ చేశారని, 'ఏ నెంబర్ తో టోల్ ఫ్రీ పెడితే మంచిదని' సలహా అడిగినట్లు సరదా కామెంట్లు షికరు చేస్తోంది. అయితే దానికి స్పందించిన కెసిఆర్ 'మా దగ్గర హెల్ప్ లైన్ మంచి ఫలితాలనిస్తోందని.. మీరు కూడా ట్రై చెయ్యండి' అని సలహా ఇచ్చినట్లు సమాచారం. మరి ఈ పుకారులో ఎంత నిజముందో తెలియదు కానీ వినే వాళ్లకు మాత్రం భలే అనిపిస్తోంది.

 

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : kcr  kejriwal  delhi  telangana  anticorruption  corruption  

Other Articles