Pawankayan | Leaders | Tweets | Media

All political leaders fearing for pawan kalyan tweets on ap capital villages

pawankalyan, pa\owerstar, tweet, comments, media, breaking, janasena, ap, capital, chandrababu, land, pooling, farmers

all political leaders fearing for pawan kalyan tweets on ap capital villages. The political leaders are fearing for janasena leader, powrestar following in public and also in media. They are getting ready to go for long tour.

పవన్ దెబ్బకు తట్టాబుట్టా సర్దుకుంటున్న నాయకులు

Posted: 04/11/2015 12:12 PM IST
All political leaders fearing for pawan kalyan tweets on ap capital villages

"అవసరమైనప్పుడే ప్రజాసమస్యలపై స్పందించేవాడు లీడర్ కాగలడు.. ఆ క్వాలిటీ పవన్ లో ఉంది" ఓ ఆడియో ఫంక్షన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన కామెంట్లు. అందుకే ఈ మధ్య సైలెంట్ గా ఉన్న పవన్ కల్యాణ్ మళ్లీ మరోసారి రాజధాని భూసేకరణపై నోరు విప్పారు. కొద్దిరోజుల క్రితం ఏపీ రాజధాని భూసేకరణ ప్రాంతాల్లో పర్యటించి రైతన్నకు ధైర్యం చెప్పాడు. అంతేకాదు ప్రభుత్వాన్ని కూడా కదిలించాడు. బలవంతంగా భూమలు లాక్కొంటే ఉద్యమం చేయడానికి వెనకడానని హెచ్చరించాడు. ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగినట్లు కనిపించినా మళ్లీ హీటెక్కింది.

కొద్దిరోజుల క్రితం రాజధాని భూసేకరణ ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్ ఎన్నో ప్రశ్నలను ప్రభుత్వానికి సంధించాడు. ఇష్టంతో ఇస్తే తీసుకోవాలనే కానీ ఒత్తిడి పెట్టి తీసుకోవద్దని కోరాడు. అసలు రాజధాని అన్ని వేల ఎకరాలు అవసరమా అని కూడా ప్రశ్నించాడు. సింగపూర్, జపాన్ రాజధానులు మనకెందుకు , రైతు కన్నీటితో రాజధాని కట్టాలా అంటూ హితబోధ చేశాడు. అయితే ఈ ప్రశ్నలకు సమాధానమిస్తూ ఏపీ సిఎం చంద్రబాబు కూడా తన అసహనాన్ని చూపించారు. అయితే మరుసటి మళ్లీ జనసేన నేత మాటల్లో మార్పు వచ్చింది. హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో తన ఉద్దేశ్యాన్ని వివరించాడు. ఇంతటితో ఆ వివాదం సద్దుమణిగిందనుకున్నారు. కానీ మళ్లీ ఇప్పుడు హీటెక్కింది.

భూసేకరణ చట్టాన్ని అమలు చేసి రాజధానికి భూములు ఇవ్వని రైతుల నుంచి ప్రభుత్వం భూములు తీసుకోవాలనుకుంటోందట. ఈ విషయం మీడియాలో హైలెట్ కావటంతో జనసేన నేత స్పందించాడు. ఆ పద్ధతిలో భూములు లాక్కొంటే ఇక పోరాటం తప్పదని ట్విట్టర్ ద్వారా ఏపీ సిఎం చంద్రబాబును హెచ్చరించాడు. అయితే ఓ సారి పవన్ కళ్యాణ్ పర్యటన రాజధాని గ్రామాల్లో కాక రేపింది. టిడిపి నాయకుల గుండెల్లో గుబులు పుట్టించింది. మరి మరోసారి పవర్ స్టార్ ప్రజల సమస్యలపై ట్విట్టర్ వేదికగా గళమెత్తితే ఏం జరగబోతోందని సర్వత్రా చర్చ మొదలైంది. అయితే టిడిపి కి మూడినట్లే ఉంది అని కాంగ్రెస్ నాయకులు సంబరపడుతున్నట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ గురించి తెలిసిన వారు మాత్రం టిడిపి కాంగ్రెస్ అనే తేడా పవన్ కు ఉండదు అని హెచ్చరిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఎవరిపైననైనా, ఎంత వరకైనా పోరాటానికి సిద్దమని గతంలోనే పవన్ ప్రకటించారు. పాపం కాంగ్రెస్ వాళ్లు ఆ విషాన్ని మరిచిపోయినట్లున్నారు.

అయితే వపన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ పై మీడియాలో ఏకంగా బ్రేకింగ్ న్యూస్ పెట్టి మరీ ప్రచారం చేశాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పవన్ చర్చ మొదలైంది. అయితే ట్విట్టర్ వేదికగా పవన్ సందించిన ప్రశ్నలు, హెచ్చరికలతో టిడిపి, కాంగ్రెస్ పక్షాల్లో వణుకు మొదలైందని సమాచారం. హర్రర్ సినిమాలో దెయ్యంలాగా రాజకీయ నాయకులను అన్ని రకాలుగా భయపెడుతున్నారట పవన్. అందుకే వారు పవన్ ట్విట్టర్ ఎకౌంట్ ఎందుకు తెరిచాడా అని తలలు పట్టుకుంటున్నారట. అదేవిధంగా తాము ఎంత ప్రయత్నం చేసినా మీడియాలో మాత్రం తగిన గుర్తింపు రావడం లేదని కానీ పవన్ కళ్యాణ్ ఒక్క ట్వీట్ చేసినా ఏకంగా దాని పైనా అటు మీడియాలో, ఇటు జనాల్లో చర్చ మొదలవుతోంది. దీనిపై మన నేతలకు తెగ విచారం మొదలైందట. అందుకే ఈ టెన్షన్ తట్టుకోలేక అందరు రాజకీయ నాయకులు మీడియా, తెలుగు ప్రజలు లేని చోటికి టూర్ కు ప్లాన్ చేస్తున్నారట. మరదే పవన్ అంటే అందరికి దడేగా...

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : pawankalyan  pa\owerstar  tweet  comments  media  breaking  janasena  ap  capital  chandrababu  land  pooling  farmers  

Other Articles