BJP | TDP | Clash | AP

Bip and tdp partys have facing problems from both party leaders

bjp, tdp, friend, modi, chandrababu, hari babu, seetharaman, ministry

bip and tdp partys have facing problems from both party leaders may it cost partys friendship. In ap bjp and tdp leaders clashes about their leaders and policies. hari babu who is the bjp president of ap, attacks on tdp and its leaders.

టిడిపి బుస్... బిజెపి బుస్ బుస్..?

Posted: 04/08/2015 12:14 PM IST
Bip and tdp partys have facing problems from both party leaders

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఇప్పుడు ఏపీలో బీజేపీ-టీడీపీల పరిస్థితి ఇది. తొందరలోనే రెండు పార్టీల మధ్య మైత్రి బంధం తెగిపోతోంది అంటూ ఓ వార్త ఇప్పుడు హల్ చేస్తోంది. అయితే గతంలోనే ఇలాంటి వార్తే వచ్చినా.. తర్వాత మాత్రం  పరిస్థితులు మారాయి. కానీ తాజాగా మాత్రం పరిస్థితులు వేరేలా ఉన్నాయి. అధినేతలు ఢిల్లీలో చంద్రబాబు, నరేంద్ర మోదీ ఎలా ఉన్నా.. గల్లీల్లో మాత్రం..రెండు పార్టీల మధ్య లొల్లి సాగుతోంది. రాష్ట్రంలో రెండు పార్టీల నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. మరి, ఇంతకీ ఈ రెండు పార్టీల మైత్రీబంధం దెబ్బతినడానికి, నేతలు కస్సుబుస్సులాడడానికి కారణాలేంటి?  నిన్నటి దాకా చెట్ాపట్టాలేసుకొని ఏకంగా డ్యుయెట్లు కూడా పాడుకున్న పార్టీలు ఒక్కసారిగా దూరం దూరం అంటున్నాయి. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో... అధికారంలో మిత్రపక్షాలుగా ఉన్నాయి ఇదంతా గతం ఇప్పుడు తెలుగుదేశం-బీజేపీల బంధం క్రమంగా బీటలు వారుతోందని తెలుస్తోంది. రెండు పార్టీ నేతలు మాటల తూటాలతో హీట్ పెంచుతున్నారు. టీడీపీ శ్రేణులపై బీజేపీ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా అడ్డుకునేలా టీడీపీ వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు బహిరంగ విమర్శలకు దిగారు.

బీజేపీ-టీడీపీల ఏడాది ప్రయాణంలో ఇప్పుడు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రానికి కేంద్రం సరిగా సహకరించట్లేదనే భావన టీడీపీ నేతల్లో అనుకుంటుంటే..  ఏపీలో బీజేపీకి తగిన ప్రాధాన్యం లభించట్లేదనే అభిప్రాయం కమలదళంలో ఉంది. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోపే టీడీపీ తీరుపై బిజెపి నాయకులు ఫైరవుతున్నారు.  తాజాగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోను రెండు పార్టీ మధ్య విభేధాలు బయటపడ్డాయి. బీజేపీ సభ్యత్వ నమోదును టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని, బీజేపీలో చేరితే... సంక్షేమ పథకాలు అందకుండా చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా విమర్శలు వస్తున్నాయని సమాచారం.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రంలో ఎదురవుతున్న ఇబ్బందులకు... బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అది సరికాదంటున్నారు.దేశంలో ఏ రాష్ట్రానికి చేయనంత లబ్ధి... ఏపీకి చేసినా, బీజేపీ వైఖరిపై బహిరంగ విమర్శలు గుప్పించడంపై చర్చించుకోవాల్సి ఉందంటున్నారు. నిజానికి ఏపీకి ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజీలు ఇతరత్రా డిమాండ్ల పరిష్కారం విషయంలో కూడా బీజేపీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ గెలుచుకున్న రెండు పార్లమెంటరీ స్థానాలను జాగ్రత్తగా కాపాడుకునేలా వ్యూహరచన చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు, భీమవరంలో ఎక్స్పోర్ట్ జోన్ వంటివి తమపై ఒత్తిడి పెంచేందుకేనని టీడీపీ అనుమానిస్తోంది. ఇక రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా మంత్రులకు ఆ స్వతంత్రం కూడా లేకుండా... టీడీపీ నేతలే అజమాయిషీ చేస్తుండటం కూడా బీజేపీకి అసంతృప్తి కలిగిస్తోంది. దేవాదాయ, వైద్య శాఖలు బీజేపీ నేతలకు కేటాయించినా వాటిపై...ఆయా జిల్లాల టీడీపే నేతలే, పెత్తనం చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ.

కేంద్రమంత్రి సీతారామన్ కు ఛేదు అనుభవమే ఎదురైంది. బీజేపీ ఛాయలు కానీ, మోడీ బొమ్మకానీ లేకుండా...కేవలం పసుపు జెండాలు, చంద్రబాబు బ్యానర్ల మధ్య కేంద్రమంత్రి ప్రసంగించాల్సి వచ్చింది. దీనికి ఇష్టపడని సీతారామన్...ఆ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారు. ఇది స్థానికంగా రెండు పార్టీల మధ్య విభేదాలను బహిర్గతం చేసింది. అయితే, బీజేపీ-టీడీపీ...రెండూ కలిసే ప్రయాణిస్తాయని అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని ఆమె చెబుతున్నారు. అది ఎంతకాలమన్నది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. మొత్తం మీద టీడీపీ తీరుపై బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరకముందే అధినాయకత్వం జోక్యం చేసుకుంటుందో లేదంటే కావాలనే దూరం జరిగే ప్రయత్నాల్లో ఉన్నాయా అనేది మాత్రం ఇప్పటికిప్పుడు క్లారిటీ రావడం లేదు. మరి రెండు పార్టీలు గతంలోలాగా కలిసి ముందుకు వెలతాయో.. కలహాలతొ కుదరదు అని సెలవు తీసుకుంటాయో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp  tdp  friend  modi  chandrababu  hari babu  seetharaman  ministry  

Other Articles