sujana choudary Rs. 10,000 crore statement to save his ministry.?

Sujana choudary rs 10 000 crore statement to save his ministry

sujana choudary news, sujana choudary updates, rajya sabha news, union minister, andhra pradesh state, ap special status, ministry, central government, andhra pradesh state updates, ap capital state, sujana choudary gossips, sujana choudary plans, ntr trust bhavan

union minster sujana choudary Rs. 10,000 crore statement to andhra pradesh to renewal his Rajya sabha tenure.?

పదవి కోసమేనా..పదివేల పాట్లు.. ? సుజనా..!

Posted: 03/30/2015 04:00 PM IST
Sujana choudary rs 10 000 crore statement to save his ministry

సుజనా చౌదరి అధికార తెలుగుదేశం పార్టీ తరుపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సుజనా చౌదరికి మరో పదవా..? అందుకోసమే పదివేల పాట్లు పడుతున్నారా..? అంటూ ఆశ్చర్యపోకండి. కేంద్ర మంత్రి పదవిని మించిన మరో పదవి ఏమిటని మెదళ్లకు పని పెట్టకండి. అది సరే.. అధికారం వుండి.. కేంద్ర మంత్రిగా కోనసాగుతూ.. పది వేల పాట్లు పడాల్సిన అవసరం సుజనా చౌదరికి ఎందుకు వచ్చింది..? అంటూ అలోచనలు మొదలయ్యాయా..?

కేంద్ర మంత్రి పదివేల పాట్లు కాదు పది వేల కోట్లు.. ఇప్పటి వరకు ఒకలా చెప్పి.. ఇప్పుడు మరోలా అంటారేమిటా అనకోబాకండి.. ఒపిక పట్టండి. ఈ నెలాఖరులోపు నవ్యాంధ్ర ప్రదేశ్‌కు పదివేల కోట్లు వస్తున్నాయ్‌! నేను చెబుతున్నా రాసుకోండి’ అంటూ ఈనెల 15న హైదరాబాద్‌లో మీడియా సమావేశం పెట్టి మరీ ఢంకా భజాయించారు సుజనా చౌరది. ఏ పద్దు కింద ఎన్ని నిధులు మంజూరు అవుతున్నాయో కూడా వివరించారు. ఇదే విషయాన్ని మూడు రోజుల క్రితం మరోమారు ప్రకటించారు. ఆర్థిక సంవత్సరం రమారమి ముగిసింది. ఇవాళ, రేపు మాత్రమే గడవుంది. అయినా కేంద్రం మాత్రం 13వ ఆర్థిక సంఘం ప్రకటించిన 384.918 కోట్ల రూపాయలను విధిల్చుతున్నట్లు ప్రకటించిందే గానీ అంతకు మించి ఒక్క రూపాయిని కూడా అధికంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించలేదు. కానీ మంత్రిగారు మాత్రం పది వేల కోట్లో.. పది వేల కోట్లో అంటూ.. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధిగా ప్రకటనలు గుప్పిస్తున్నారు.

ఈ విషయాన్ని బీజేపి నేత, సినీనటుడు శివాజీ విశాఖలో బహిరంగంగా మీడిమా ముఖంగా నిలదీశారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి పదివేల కోట్ల రూపాయలు..? ఎవరు ఇస్తున్నారు..? ఇస్తామని ఎవరు ప్రకటించారు..? మీరెలా ప్రజలకు పక్రటిస్తున్నారని తూర్పారబట్టారు. అయినా.. కేంద్ర మంత్రి వాటిని విని.. విననట్టుగా వ్యవహరించాడు. ఆ తరువాత కూడా మళ్లీ తాను చెబుతున్నాను పది వేల కోట్లు అంటూ ప్రకటనలు గుప్పించారు. ప్రతికలలో పతాక శీర్షికన హైలైట్ అవ్వడానికే మంత్రివర్యులు ఇలా చేస్తున్నారని మీకు అనుమానం కలుగుతుందా..?

ఎంతమాత్రం కాదు. ఆయన పాట్లన్నీ పదవి కోసమేనంటూ ఎన్ టీ ఆర్ ట్రస్టు భవన్ చుట్టూ పుకార్లు షికార్లు కోడుతున్నాయి. మళ్లీ అదే మాట అనుకుంటున్నారా..? విషయానికి వస్తే.. సుజనా చౌదరి రాజ్యసభ సభ్యత్వం వచ్చే ఏడాదితో ముగియనుంది. అయితే కేంద్ర మంత్రి పదవి చేపట్టి.. మోజు తీరి, తీరకుండానే రాజ్యసభ సభ్యత్వం తీరిపోనున్న సమయంలో.. మరో ఆరు మాసాల లోపు మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కావాలి. లేదా..? ఎక్కడి నుంచైనా ఖాళీగా వుండే పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నిక కవాలి. రెండవది రమారమి అసాధ్యం. ఇలాంటి సమయంలో అటు కేంద్రంతో పాటు ఇటు పార్టీని దువ్వుతూ ఇద్దరినీ మంచి చేసుకుని రాజ్యసభలో మళ్లీ అడుగుపెట్టి నిరాటంకంగా కేంద్ర మంత్రి పదవిని పూర్తి చేయాలన్నది సుజన మనోగతంలా కనబడుతున్నా.. పదవి కోసం పదివేల పాట్లు పడుతున్నారన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sujana choudary  union minster  Rs. 10  000 crore fund  Rajya sabha  

Other Articles