jayasudha to join TDP after MAA elections..?

Jayasudha to join tdp

maa elections, jayasudha pannel, rajendra prasad pannel, movie artist association, maa president elections, rajendra prasad news, jayasudha press meet, artist hema news, nagababu, nagababu rajendra prasad, nagababu press meet, jayasudha updates, actor uttej, actor shivaji raja

Gossip goes in film nagar that Veteran Actress Jayasudha is to join TDP after MAA elections

టీడీపీ కండువాను కప్పుకోనున్న జయసుధ..?

Posted: 03/27/2015 01:40 PM IST
Jayasudha to join tdp

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న సహజ నటి జయసుధ.. త్వరలోనే రాజకీయ పార్టీని మారనున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. త్రివర్ణ కండువాను వీడి.. పసుపు వర్ణపు కండువాను కప్పుకునేందుకు అమె సుముఖం చూపుతున్నారని సినీ, రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నెల 29న జరగనున్న మా అధ్యక్ష ఎన్నికల అనంతరం అమె ఈ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్భలంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జయసుధ. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత క్రమంలో వచ్చిన గ్రేటర్ ఎన్నికలలోనూ సత్తా చాటుకుని ఏకంగా ఎనమిది మంది కార్పోరేటర్లను గెలిపించుకుని అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యతో తన వర్గానికి చెందిన బండ కార్తిక రెడ్డికి మేయర్ పదవిని కూడా కట్టబెట్టించుకోవడంలో సఫలీకృతులయ్యారు. అయితే అంత మంచి పేరు కాస్తా ఇటీవల వచ్చిన సార్వత్రిక ఎన్నికలలో పొగోట్టుకుని ఓటమి పాలయ్యారు. అందుకు కారణం పార్టీలోని అంతర్గత కుమ్ములాటలేనని కూడా ఓటమి తరువాత తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పోన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో చెప్పారు.

ఆ సందర్భంగా జయసుధ చెప్పిన విషయాలు..

* తాను ఒక నటిగా 2009 ఎన్నికలలో పోటీ చేశాను.
* 2014లో మరోసారి సికింద్రాబాద్ స్థానం నుంచి ఓటమితో తాను రాజకీయ నేతగా మారాను.
* మరోలా చెప్పాలంటే రాజకీయాలను పూర్తిగా నేర్చుకున్నాను.
* ఇప్పుడు రాజకీయాలను పూర్తిగా అర్థం చేసుకున్నాను.
* నిజమైన పార్టీ కార్యకర్తలకు సరైన ప్రోత్సాహం లేదు.
* యూత్ కాంగ్రెస్ విభాగాన్ని చాలా బలపర్చాల్సిన అవశ్యకత వుంది.

కాగా, తాజాగా మారిన రాజకీయాల నేపథ్యంలో అమె తెలంగాణలోనే స్థిరపడి.. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను అమె భుజస్కంధాలపై వేయాలని పార్టీ అధినేత చంద్రబాబు కూడా యోచిస్తున్నారని సమాచారం. ఇందుకు పార్టీ ఎంపీ మురళీ మోహన్ కూడా తన వంతు కృషి చేస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగానే జయసుధను మా అధ్యక్ష పదవికి ఎంపిక చేసి.. ఆ తరువాత తమ పార్టీ కండువాను కప్పేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. అంతేకాదు జయసుధ వ్యవహార శైలిపై ఇప్పుడిప్పుడే పలు అనుమానాలు కూడా మా సభ్యులలో నెలకొంది.

అవేంటో ఒక సారీ పరిశీలిద్దమా..

* పూర్తి స్థాయి రాజకీయ నేతగా అవతరించిన జయసుధ.. మార్పునెలా తీసుకువస్తారు..?
* ఐదు ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగి ఒక నియోజకవర్గంలో.. అందునా తమ ప్రభుత్వ అధికారంలో మార్పు తీసుకురాలేదు..? మరిప్పుడెలా సాధ్యం..?
* ఐదేళ్ల పాలన ముగిసాక అసలైన పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగలేదని అన్నారు..? మరి మా సభ్యుల పరిస్థితి కూడా అంతేనా..?
* రాజకీయ నేతగా వుంటూనే రాజకీయ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారని అభండాలా..? ఇది నిజమేనా..? వారెవరో చెప్పగలరా..?
* అందకనే త్రివర్ణ కండువాను వీడి పసుసు పచ్చ కండువాను కప్పుకునేందుకు రెడీ అయ్యారా..?
* వటవృక్షం కింద మొక్కలకు మాత్రమే స్థానం వుంటుంది..? మరి జయసుధ ఎలా నెగ్గుకోస్తారు..?
* మా ఎన్నికలను అడ్డుపెట్టుకుని పార్టీ కండువాను మార్చే పనిలో నిమగ్నమయ్యారా..?
* జయసుధ మార్పుకు నాంది అయితే.. ఎంపీ మురళీ మోహన్, తెరవెనుక పెట్టుబడిదారులు, బడా నిర్మాతల దండు మద్దుతు ఎందుకు..?

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajendra prasad pannel  jayasudha pannel  maa president elections  

Other Articles