Telagana government police lathi charge on osmania students

Tension grips Osmania University Campus, Police Lathi Charge, Telagana government Police, trs government, ou students, Osmania students, o lathicharge on Osmania University students, Congress leaders, telangana jobs.

Police resorted to lathicharge on Osmania University students today, when they tried to block traffic in Secunderabad - Tarnaka crossroads government Police lathi charge

టి-పిల్లలపై గులాబీ బాస్ లాఠీ ఎత్తటం న్యాయమా?

Posted: 07/22/2014 04:28 PM IST
Telagana government police lathi charge on osmania students

‘‘పాము తన పిల్లలను తానే పొడుచుకునే తినే అలావాటు ఉంటుందని మన పెద్దలు కథలు రూపంలో చెప్పటం వినే ఉంటాం’’.!! ఏరు దాటక ముందు మల్లన్నా! ఏరు దాటిన తరువారు బోడి మల్లన్న!! అన్నట్లు గా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ ఉందని ..తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. టీఆర్ఎస్ కు అధికారం రాక ముందే జరిగిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం!!

గులాబీ బాస్ కు, గులాబీ పార్టీకి బలం తెలంగాన విద్యార్థులే అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ విద్యార్థుల బలమే, ఈరోజు గులాబీ దళానికి అధికారం దక్కిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ పిల్లలు , విద్యార్థుల బలిధానాలు ఇవ్వటం జరిగింది. కానీ ఒక్క గులాబీ దళ నేత బిడ్డలు గానీ, తెలంగాణలో ఏ రాజకీయ నేతల పిల్లలు, ప్రత్యేక తెలంగాణకోసం ఆత్మహత్యలు చేసుకోలేదు. కేవలం తెలంగాణలో ఉన్న సామాన్య కుటుంబం నుండి వచ్చిన వారే తెలంగాణ తల్లి కోసం పోరాటం చేసి ప్రాణాలు ఆర్పించి, ప్రత్యేక తెలంగాణను సాధించుకున్న అమర వీరులు తెలంగాణ విద్యార్థులు.

ఆంధ్రోడు అంటూ.. గులాబీ బాస్ నేర్పిన అక్షరాలను తెలంగాణ పిల్లలు వంటబట్టించుకోని.. ఉమ్మడి పాలనలో రబ్బర్ బుల్లెట్లకు, ఇనుప కంచెలు చేసే గాయాలను సైతం లెక్క చేయకుండా, ప్రాణాలు ఫణంగా పెట్టి.. పది జిల్లాలతో కూడిన నవ తెలంగాణను సాధించుకొన సంబరాలు జోరుదరుగా చేసుకున్నారు తెలంగాణ పిల్లలు. ఇక తెలంగాణ తల్లి ఆంద్ర సంకెళ్ల నుండి విముక్తి పొందినందుకు.. తెలంగాణలోని ప్రతి పక్షి, వాగులు, వంకలు , చేను, రైతు, ప్రజలు, ఉద్యోగులు, ఆనందంతో నాట్యం చేయటం జరిగింది. తెలంగాణలోని ప్రతి కళాకారుడు, రచయిత, తమ మాటలకు మంత్రం వేసి పాటల రూపంలో.. నృత్యం చేసి, తెలంగాణ అమరవీరులకు జోహర్లు ఆర్పించారు. అంతబాగనే ఉంది. తెలంగాణ ప్రజలు అనుకున్నట్లు గానే.. గులాబీ బాస్ ముఖ్యమంత్రి అయ్యాడు. దీంతో ఓయూలోని విద్యార్థులు పండగ చేసుకున్నారు.

 

తెలంగాణ వారి కష్టాలు గులాబీ తీర్చుతాడని ‘‘గోల్కండంత ఆశలు పెట్టుకొని, కట్టమైసమ్మ సాక్షిగా.. బంగారు తెలంగాణ రావాలని తెలంగాణ విద్యార్థులు, విద్యావేత్తలు మనసుపూర్తిగా అమ్మవారికి భోనం సమర్పించారు. కానీ వారి అమ్మవారు ఆగ్రహించిందో , లేక గులాబీ బాస్ కు తెలంగాణ విద్యార్థులపై పగ ఉందో తెలియదు గానీ .. తెలంగాణ తల్లి సాక్షిగా.. తెలంగాణ పిల్లలపై గులాబీ బాస్ సర్కార్ లాఠీ దెబ్బలతో వాతలు పెట్టింది. ’’

తెలంగాణ సర్కార్ మొట్టమొదటి సారిగా.. తెలంగాణ విద్యార్థులపై లాఠీ ఛార్జీ చేయటంతో తెలంగాణలో పెద్ద చర్చగా మారింది. తెలంగాణలోని రాజకీయ పార్టీ నాయకులు టీసర్కార్ పై నిప్పులు కురిపించారు. ‘‘ఆంధ్ర పాలనలో.. ఆంధ్రోడు లాఠీ ఛార్జీ చేస్తే.. గులాబీ ధళం అండగా వచ్చింది. ఇప్పుడు ఆ గులాబీ ధళమే.. తెలంగాణ పిల్లలపై లాఠీ చార్జీ చేస్తే.. తెలంగాణ పిల్లలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. ఉస్మానియాలో అల్లాడిపోతున్నారు. ‘‘తమ్ముడు తమ్ముడే.. పేకాట .. పేకాటే ’’ అనే విధంగా.. టీసర్కార్ వ్యవహరించిందని .. కరీంనగర్ కాంగ్రెస్ సింహం పొన్నం ప్రభాకర్ , నిజాంబాద్ తెలంగాణ ఎన్నారై కాంగ్రెస్ హీరో మధుయాష్కి కూడా ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థుల తెలంగాణ సర్కార్ లాఠీ ఛార్జీ చేయటం పై ఘాటుగా ఫైర్ అయ్యాడు.

తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉస్మానియా విద్యార్థులపై టీసర్కార్ లాఠీ ఛార్జీ చేయటం దారుణమైన విషయం అని తెలంగాణ కొన్ని రాజకీయ పార్టీల నేతలు మండిపడుతున్నారు. ‘‘ మన తెలంగాణ , మన పత్రిక, మన నేల, మన నీళ్లు, మన పాలన, అన్ని నమ్మిన విద్యార్థులకు గులాబీ బాస్ చుక్కలు చూపించారు. సొంత పాలనలో ఉద్యోగాలు వస్తాయని ఆశలు పెట్టుకున్న తెలంగాణ విద్యార్థులకు గులాబీ బాస్ లాఠీ దెబ్బల రుచి చూపించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని గులాబీ తీసుకున్న నిర్ణయం పై తెలంగాణ పిల్లలు న్యాయ పోరాటం చేస్తున్నారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే.. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల సంగతి ఏమిటి? అందరికి న్యాయం జరిగేలా ఉద్యోగుల నోటిఫికేషన్ జారీ చేసి, రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని ఉస్మానియా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. గులాబీ సర్కార్ మాత్రం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీను నేరవేర్చుకోవటానికే సిద్దంగా ఉంది. దీంతో తెలంగాణ విద్యార్థి లోకం పై టీ ప్రభుత్వం పై ఉద్యమం చేయటానికి సిద్దమైంది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ విద్యార్థుల పై టీసర్కార్ లాఠీ ఛార్జీ చేయటం జరిగింది. అయితే టీసర్కార్ పై తెలంగాణ నేతలు, మేథావులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. ‘‘మీ పిల్లలకు ఫీజు కట్టుకోలేరా అని’’ పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అ డిగిన మనమే .. మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా లాఠీ దెబ్బలు ఇవ్వటం ఎంత వరకు న్యాయం అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు.

మన సొంత పాలన కంటే.. ఆంధ్రోళ్లు పాలన ఉన్నప్పుడే బాగుందని, తెలంగాణ కోసమే లాఠీ దెబ్బలు తిన్నం కానీ, ఉద్యోగాల కోసం లాఠీ దెబ్బలు తినలేదని ఉస్మానియాలోని సీనియర్ విద్యార్థులు అంటున్నారు. ‘‘ మంచోడని మంచ ఇస్తే.. మంచంమంత ..రంథ్రాలు చేసాడనే విధంగా ’’ గులాబీ బాస్ పాలన ఉందని తెలంగాణలోని నిరుద్యోగులు అంటున్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు , చెప్పినట్లు ఇది తుగ్లక్ పాలనే అని ..తెలంగాణలోని విద్యవంతులు అంటున్నారు. ఉద్యోగాలు అడిగితే.. లాఠీ తో దెబ్బలు కొట్టిస్తారా? మా ఓటు తో గెలిచిన మీరు.. మా వీపులపై లాఠీ దెబ్బలు కొడతారా? అని తెలంగాణలోని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యార్థులను వాడుకున్న గులాబీ బాస్.. అధికారం వచ్చిన తరువాత .. పిల్లల వీపులపై లాఠీ ఛార్జీ చేయటం ఘోరమైన విషయమే అని తెలంగాణలోని ప్రజా సంఘాలు, మండిపడుతున్నాయి. ఇకనైనా తెలంగాణ సర్కార ఓయూ విద్యార్థులతో.. కలిసి చర్చలు జరిపిన తరువాత గులాబీ బాస్ నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ తల్లులు కోరుతున్నారు. తెలంగాణలోని ప్రతి బిడ్డకు కొత్త ప్రభుత్వం న్యాయం చేయాలని చదుకున్న యువకులు కోరుతున్నారు. ఈ విషయం పై తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles