Subramaniam swamy to see sonia rahul in the court

Subramaniam Swamy Petion on National Herald irregularities, Swamy wishes to see Sonia Rahul in court, National Herald irregularities implicating Sonia Rahul

Subramaniam Swamy to see Sonia Rahul in the court in National Herald case

చిన్నిచిన్ని ఆశ! సుబ్రమణ్యమాశ!

Posted: 07/20/2014 05:01 PM IST
Subramaniam swamy to see sonia rahul in the court

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్య స్వామి తన మనసులో ఉన్న చిన్న చిన్న ఆశలను బైటపెట్టారు.  

sonia-rahulఒకటి, మూతబడ్డ నేషనల్ హెరాల్డ్ పత్రిక అవకతవకల్లో తను వేసిన కేసు మీద సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ముందస్తు బెయిల రాగూడదు, రెండు వాళ్ళిద్దరూ కోర్టు బోనెక్కితే తాను కళ్ళారా చూడాలి.

స్వచ్ఛంద సంస్థగా పనిచెయ్యవలసిన యంగ్ ఇండియా సంస్థ నుంచి నేషనల్ హెరాల్డ్ పేరుతో స్థిరాస్తులను సంగ్రహించి, అందులో నెలకి 90 లక్షల రూపాయల వరకు అద్దెల రూపంలో తీసుకుంటున్న డబ్బు ఎవరి ఖాతాల్లోకి పోతుంది, పైగా నేషనల్ హెరాల్డ్ భవనమే కాక మొత్తం ఆస్తినంతా ఎలా కబ్జా subramanian-swamyచేసారు అన్న ప్రశ్నలకు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలన్న సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్ మీద నేరం జరిగిందని, ఆ నేరానికి, నిందితులకు సంబంధమున్నదని ప్రైమా ఫాసీలో నిర్ధారించబడిందన్న విషయాన్ని మెట్రోపాలిటన్ జడ్జ్ ఇప్పటికే తీర్పునివ్వటం జరిగింది.

అందువలన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈ కేసులో కోర్టుకి ఈడ్చటమే తన ధ్యేయమని సుబ్రమణ్య స్వామి చెప్పారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles