Kcr do not own a car although his party symbol is car

KCR do not own a car although his party symbol is car, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

KCR do not own a car although his party symbol is car

కారు పార్టీ అధినాయకుడికి కారు లేదు?

Posted: 04/10/2014 10:23 AM IST
Kcr do not own a car although his party symbol is car

కారు ఎన్నికల గుర్తుగల తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ అధినాయకుడు కె చంద్రశేఖరరావుకు సొంత కారు లేదని ఆయన సమర్పించిన ఎన్నికల నామినేషన్ తో ఇచ్చిన అఫిడవిట్ తెలియజేప్తోంది. 

అయితే బేఫికర్, బేమతలబ్, బేయిమాన్ అన్న రీతిలో కారులేదు కాబట్టి బేకార్ అని అనగూడదు, దానికి వేరే అర్థమొస్తుంది అంటున్నారు హిందీ బాగా తెలిసినవాళ్ళు. 

కెసిఆర్ ఆస్తుల వివరాలు ఇవి-

నగదు- తన పేర 9.90 లక్షలు, తన భార్య పేర 1.50 లక్షల రూపాయలు.

బంగారం- 710 గ్రాములు ఆభరణాల రూపంలో.  విలువ సుమారు రూ. 21.30 లక్షలు.

చిరాస్తులు- ఎర్రవల్లిలో 37 ఎకరాల 70 గుంటలు.  దాని విలువ సుమారు రూ.91.78 లక్షలు.  మార్కెట్ విలువు రూ.4.50 కోట్లు.  మిట్టపల్లిలో రూ.50 లక్షల మార్కెట్ విలువ గల 2 ఎకరాల 4 గుంటలు. హైద్రాబాద్ బంజారా హిల్స్ లోను, కరీం నగర్ జిల్లా తీగలగుట్టలోను నివాస భవనాల విలువ సుమారు రూ. 3.65 కోట్లు. 

పెట్టుబడులు- తెలంగాణా బ్రాడ్ కాస్టింగ్ ప్రై లిమిటెడ్ లో 55 లక్షల రూపాయలు, తెలంగాణా పబ్లికేషన్స్ ప్రై లిమిటెడ్ లో 4.16 కోట్ల రూపాయలు,  హిమాంశు మోటార్స్ ప్రై లిమిటెడ్ లో రూ.ఒక లక్ష రూపాయల విలువైన షేర్లు.

వసూలు కావలసిన ఋణాలు- ఒక కోటి రూపాయలు.

2012-13 ఆర్థిక సంవత్సర వార్షిక ఆదాయం రూ.6.59 లక్షలు. 

బ్యాంక్ లు ఆర్థిక సంస్తలకు తీర్చవలసిన ఋణాలు-  రూ.7.87 కోట్లు.

ఇన్నీ ఉన్నా కెసిఆర్ కి ఆయన పేరు మీద సొంత కారంటూ లేదు.  అయితే ఇది కేవలం హాస్యోక్తిగా చెప్పుకోవటానికే కానీ ఎన్నికల చిహ్నాలతో నాయకులకు ఏ సంబంధమూ ఉండదు.  కేవలం వ్యాఖ్యానాల్లో వాటిని ఉపయోగిస్తుంటారు.  కమలం సైకిలెక్కిందని, కారు హస్తంతో పొత్తు పెట్టుకోలేదని, సైకిల్ నుంచి కారులోకి జంప్ అయ్యారని ఇలా వ్యాఖ్యాతలు వాడటం కద్దు! 

అయితే భాజపా ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఇలా తీవ్రస్థాయిలో ఉపయోగించగా ఎన్నికల కమిషన్ ఒకసారి ఆయనను హెచ్చరించింది.  హస్తం గుర్తు గల కాంగ్రెస్ పార్టీ గురించ్ మాట్లాడుతూ అది ఖూనీ పంజా- అంటే హత్య చేసే చెయ్యి అని మోదీ విమర్శించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles